'మెగా' హీరోయిన్ ముద్దపప్పు-ఆవకాయ
మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ వచ్చేసింది. వచ్చే దీపావళికి... కొణిదెల వారమ్మాయి తెరపై సందడి చేయనుంది. నాగబాబు కుమార్తె నిహారిక తొలి చిత్రం.... శరవేగంగా తెరకెక్కుతోంది. నిహారిక, ప్రతాప్, వర్ష, అదితి తదితరులు నటిస్తున్న ఆ చిత్రం పేరు ముద్దపప్పు-ఆవకాయ. పింక్ ఎలిఫెంట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపొందుతున్న వెబ్ సిరీస్ టీజర్‌ను గురువారం నాగబాబు విడుదల చేశారు. తొలిసారిగా ఈ చిత్రాన్ని యూట్యూబ్ ద్వారా విడుదల చేయబోతున్నారు. ముద్దపప్పు ఆవకాయలో నిహారిక 'ఆశా' పాత్ర పోషిస్తోంది.
ప్రస్తుతం ఆ టీజర్ యూట్యూబ్‌లో హల్చల్ చేస్తోంది. అలాగే ‘ఏ ఫర్ ఆశ, ఏ ఫర్ అర్జున్’. ‘ఆశ ఎవరు?, అర్జున్ ఎవరు?’ అంటూ హీరోయిన్ కాజల్, మంచు లక్ష్మి, నాని, సాయిధరమ్‌తేజ్, సందీప్ కిషన్ తదితరుల ద్వారా ఆసక్తికరంగా రూపొందించిన ప్రొమో వీడియోలు ప్రేక్షకుల్లో ఇప్పటికే ఎంతో ఉత్కంఠని రేకెత్తించాయి. కాగా నిహారిక ...ఓ ఛానల్లో ప్రసారమయ్యే చిన్న పిల్లల డాన్స్ కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.