Mudhole
-
ముధోల్‌లో బీజేపీకి పట్టు.. బీఆర్ఎస్పై అసంతృప్తి?
ఈ ఎమ్మెల్యే మాకోద్దంటూ స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిదులు సైతం తిరగబడుతున్నారు. ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని మార్చాలంటున్నారు. మార్చకపోతే మాదారి మేము చూసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినా అధిష్టానం ఆయనకే మరోసారి బీఆర్ఎస్ టికెట్ కట్టబెట్టింది. దాంతో ముధోల్ గులాబీ దళంలో అసంతృప్తి ఛాయలు కనిపిస్తున్నాయట. మరి అధికార పార్టీలోని అసంతృప్తి సెగ కమలం పార్టీకి అనుకూలంగా మారుతుందా? ముథోల్ గడ్డపై కాషాయ జెండా ఎగురుతుందా? మాజీ మంత్రి వేణుగోపాల్ ఛారి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల రంగంలో దిగుతారా? ముధోల్ గడ్డ ఎన్నికల సమరంపై సాక్షి స్పెషల్ రిపోర్టు. నిర్మల్ జిల్లాలో ముథోల్ నియోజకవర్గం ఉంది. ఇది ఒకప్పడు కాంగ్రెస్ కంచుకోట. ఇప్పుడు ఆ కాంగ్రెస్ కోట గులాబీ సామ్రాజ్యంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ అధిక్యతతో గత అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి విజయం సాధించారు. మళ్లీ రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించి సత్తా చాటాలని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తహతహలాడుతున్నారు. నియోజకవర్గంలో ముథోల్, బైంసా రూరల్, బైంసా పట్టణం, కుబీర్, కుంటాల, లోకేశ్వరం, బాసర మండలాలు ఉన్నాయి. వీటిలో 2,26,725 మంది ఓటర్లు ఉన్నారు. ప్రధానంగా నియోజకవర్గంలో మున్నూరు కాపు, ముస్లిం, లంబడా, మరాఠ ఓట్లు ఉన్నాయి. ఈ సామాజిక వర్గాల మద్దతుతో గడ్డేన్నగారి విఠల్ రెడ్డి 2014లో కాంగ్రెస్ నుండి గెలుపోందారు. మారిన రాజకీయ పరిస్థితులతో బీఆర్ఎస్లో చేరారు. ముచ్చటగా మూడోసారి.. ముధోల్‌పై బీఆర్ఎస్ కన్ను! 2018లో జరిగిన ఎన్నికలలో 83,933 ఓట్లతో 46 శాతం ఓట్లు సాధించారు. బీజేపీ నుండి పోటీ చేసిన రమాదేవి 40,602 ఓట్లతో 22 శాతం ఓట్లు సాధించారు. రమాదేవిపై 43,331 మేజారీటీ రికార్డు స్థాయిలొ విజయం సాధించారు విఠల్ రెడ్డి. మళ్లీ ముచ్చటగా మూడోసారి విజయం సాధించాలని తహతహలాడుతున్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గ్రామీణ ప్రాంతంలో రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించారు. అదే విధంగా ముథోల్, బైంసా అసుపత్రులలో బెడ్ల సంఖ్య పెంచి రోగులకు వైద్య సేవలు మేరుగుపరిచారు. పల్సికర్ రంగారావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో ముంపుకు గురైనా గుండేగామ్ గ్రామస్తులకు పరిహరం మంజూరు చేయించారు. అదే విధంగా బాసర మాస్టర్ ప్లాన్ కోసం యాబై కోట్లు మంజూరు చేయించారు. అభివృద్ధి పథకాలతో పాటు విఠల్ రెడ్డి ప్రజల్లో సౌమ్యుడిగా మంచి పేరుంది. కానీ అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న అభివృద్ధి చేసింది అణువంత మాత్రమే అనే విమర్శలు ఏదుర్కోంటున్నారు. ప్రాణహిత చేవేళ్ల 28వ ప్యాకేజీతో నియోజకవర్గంలో సాగునీటి కోసం అప్పట్లో కాల్వలు తవ్వారు. గత కాంగ్రెస్ హయంలో ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అదేవిధంగా కాల్వలు కనిపిస్తున్నాయి. 28 ప్యాకేజీ పనులు పురోగతి లేదు. రైతులకు సాగునీరు అందడం లేదు. అదేవిధంగా గుండేగామ్ ప్రజలకు పునరావాసం క్రింద నిధులు మంజూరైనా బాధితులకు పరిహరం అందలేదు. బీఆర్ఎస్పై అసంతృప్తి పైగా బాధితులు కోరిన విధంగా పరిహరం ఇవ్వడం లేదని ఎమ్మెల్యే తీరుపై బాధితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా బాసర టేంపుల్ సిటీ అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే మాటలు కోటలు దాటుతున్నాయి. నిధుల మంజూరుతో అనువంత కూడా అభివృద్ధి జరగడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే బాసర ట్రిపుల్ ఐటి వివాదాల పుట్టగా మారింది. స్థానిక ఎమ్మెల్యేగా విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో విఫలం అయ్యారని ఎమ్మెల్యే తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. విఠల్‌రెడ్డి వైఫల్యాలతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. సమస్యలపై అట్టిముట్డనట్లుగా ఉండే ఎమ్మెల్యే తీరు ప్రజలకు నచ్చడం లేదట. దీనితో పాటు పార్టీలో అసంతృప్తి పెరుగుతోంది. ఎకంగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తిరుగుబాటు సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ పదవులు, మార్కేట్, బాసర అమ్మవారి ఆలయం పదవులు భర్తి చేయని ఎమ్మెల్యేను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమదారి తాము చూసుకుంటామని పార్టీకి అల్టీమేటమ్ జారీ చేశారట. అయితే విఠల్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకతతో పాటు ముథోల్ నియోజకవర్గంలో బీజేపీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికలలో నియోజకవర్గంలో బీజేపీ పట్టుందని నిరూపితమైంది. దీనికి తోడు బైంసా మున్సిపల్లో ఎంఐఎంకి పట్టుంది. ఎళ్లుగా మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుని పాలన సాగిస్తోంది. ఎంఐఎం పాలనకు వ్యతిరేకంగా హిందూ సానుభూతి ఓటర్లు బీజేపీకి మద్దతు పలుకుతుండటం విశేషం. ఇక్కడ బీజేపీ కంటే హిందు వాహిని బలంగా ఉంది. ఇక్కడి నుండి రెండు సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు బీజేపీ అభ్యర్థి రమాదేవి. గెలుపు ధీమాతో కమలం? అయితే బీజేపీకి నియోజకవర్గంలో ఊపు పెరిగింది. బండి సంజయ్ పాదయాత్ర నియోజకవర్గంలో పార్టీకి బలాన్ని పెంచింది. గెలుపు ఖాయమనే బావన పార్టీ నాయకులలో పెరిగింది. ఒకవైపు సంజయ్ పాదయాత్రకు తోడు కాంగ్రెస్ మాజీ డీసీసీ అధ్యక్షుడు రామరావు పటేల్, మోహన్ రావు పటేల్ పార్టీలో చేరారు. రమాదేవితో పాటు ఈ ఇద్దరు కూడ టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారట. పార్టీ అభ్యర్థులుగా ప్రకటించకపోయినా ప్రజల్లోకి ముగ్గురు వెళ్లుతున్నారు. ప్రజల మద్దతు కూడ గడుతున్నారట ఎన్నికలలో పోటీ చేసి విఠల్ రెడ్డిపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్దమవుతున్నారట ముగ్గురు. టిక్కెట్ కోసం సాగిస్తున్నా పోరు పార్టీని బలహీనం చేస్తోందట. ఏవరికి వారు పోటీ పడి ఈ ముగ్గురు నాయకులు పార్టీని బలహీనం చేస్తున్నారని కార్యకర్తలు దాల్చిన. ఈ ముగ్గురు కలిసి పార్టీ టిక్కెట్ ఇచ్చిన అభ్యర్థి కోసం పనిచేయకపోతే ఓటమి తప్పదని పార్టీ వర్గాలే ధ్రువీకరిస్తున్నాయి. రామారావు పటేల్ కాంగ్రెస్ వీడటంతో ఆ పార్టీకి పోటీ చేసే అభ్యర్థి కరువయ్యారు. ద్వితీయ శ్రేణి నాయకులే పోటీ దిక్కు అన్నట్టు చందంగా మారింది. బలమైన అభ్యర్థి కోసం పార్టీ పెద్దలు అన్వేషణ సాగిస్తున్నారు. వేణుగోపాల్ చారికి బీఆర్ఎస్ టిక్కెట్ దక్కకపోతే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమైందట. బీజేపీ టిక్కెట్ పంచాయితీ తనకు అనుకూలంగా ఉందని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అంచనా వేసుకుంటున్నారట. బీజేపీ టిక్కెట్ పోరు, ఎంఐఎం మద్దతు అభిస్తే సంక్షేమ పథకాలతో విజయం సాధించడం ఖాయమని భావిస్తున్నారు ఎమ్మెల్యే. బీజేపీ మాత్రం హిందూ ఓటు బ్యాంకు, ఎంఐఎం వ్యతిరేక ఓట్లు, సర్కార్ వైఫల్యాలు విజయానికి చెరువచేస్తాయని అంచనా ఉంది. ఈసారి ఆరునూరైనా ముథోల్ గడ్డపై కమలం జెండా ఎగురడం ఖాయమంటున్నారట ఆ పార్టీ నాయకులు. మరి ఈమూడు పార్టీల్లో ఏవరు విజయం సాదిస్తారో చూడాలి. -
ముథోల్ నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో బండి సంజయ్?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆ నియోజకవర్గం కాషాయ కోటగా పేరు తెచ్చుకుంది. అన్ని చోట్లా డిపాజిట్లు పోయినా.. అక్కడ మాత్రం గులాబీ పార్టీకి కాషాయ దళం చెమటలు పట్టించింది. ఓటమి భయం కలిగించింది. ఇప్పుడు అదే నియోజకవర్గం మీద కాషాయ సేన రాష్ట్ర దళపతి గురి పెట్టారా? మజ్లిస్ పార్టీ బలంగా ఉన్న ఆ స్థానంలో బండి సంజయ్ పోటీ చేయబోతున్నారా? బండి టార్గెట్ మజ్లిస్.? కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. తన ఐదో విడత పాదయాత్రను నిర్మల్ జిల్లా బైంసా మాటేగామ్ నుంచి బండి సంజయ్ ప్రారంభించారు. భైంసాలో సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో.. కోర్టు ఆదేశాల మేరకు మూడు కిలోమీటర్ల దూరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి రాగానే భైంసా పేరును మహిషాగా మార్చుతామన్నారు. అలాగే ముథోల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామన్నారాయన. వీటితో పాటు భైంసా అల్లర్ల సందర్భంగా కేసుల్లో చిక్కుకున్న వారికి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు సంజయ్. ఎంఐఎం కోటను బద్దలు చేయడమే బీజేపీ లక్ష్యమన్నారు. సామాజిక వర్గం కలిసొస్తుందా? బహిరంగ సభలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో.. బండి సంజయ్ ముథోల్ నియోజకవర్గం నుండే అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతారనే ప్రచారం జరుగుతోంది. అందుకే భైంసా పేరు మార్చుతామని...ముథోల్‌ను దత్తత తీసుకుంటానని ప్రకటించారంటూ కాషాయ శిబిరంలో చర్చ సాగుగుతోందట. సంజయ్ సామాజిక వర్గానికి చెందిన మున్నూరు కాపులు నియోజకవర్గంలో బలమైన వర్గంగా ఉన్నారు. ఈ వర్గానికి చెందినవారే 47 వేల మంది ఓటర్లున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుండి పోటీ చేస్తే తన సామాజిక వర్గం అంతా పార్టీ వైపు నిలబడే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారట. దీనికి తోడు నియోజకవర్గంలో హిందుత్వ ఓట్లు కూడా బాగానే ఉండటంతో..విజయం ఖాయమని భావిస్తున్నారని సమాచారం. అలాగే..ఎంఐఎం పార్టీ బైంసా మున్సిపాలీటిని అనేక సంవత్సరాలుగా ఏలుతోంది. ఎంఐఎం కోటను కూల్చడమే తనలక్ష్యమంటున్నారు సంజయ్. కమలం వ్యూహమేంటీ? గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాషాయ పార్టీ ముథోల్ నియోజకవర్గంలో భారీగా ఓట్లు సాధించింది. రాష్ట్రంలోని వందకుపైగా నియోజకవర్గాలలో కమలం డిపాజిట్లు కోల్పోయినా.. ఇక్కడ మాత్రం పార్టీ అభ్యర్థి రమాదేవి రెండు సార్లూ అదికార పార్టీకి ఓడిపోతామనే భయాన్ని కలిగించింది. పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్నందున రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే, గెలుపు ఖాయమని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయట. ముథోల్ నుంచి బండి బరిలోకి దిగడం వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోపార్టీకి ఒక ఊపు వస్తుందని.. అదేవిధంగా ఉత్తర తెలంగాణ అంతటా దీని ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. భైంసా పట్టణం ఉన్న ముథోల్ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు పోటీ చేస్తే..హిందూ ఓటు బ్యాంకు పై రాష్ట్ర వ్యాప్తంగా ప్రబావం ఉంటుందట. అన్నీ దృష్టిలో ఉంచుకునే బండి సంజయ్ ముథోల్ నుంచి పోటీ చేసే అవకాశాలు బాగా ఉన్నట్లు చెబుతున్నారు. బండి సంజయ్ ముథోల్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారంపై పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతోందట. అయితే ఈ విషయాన్ని పార్టీలోని సీనియర్లు కొట్టిపారేస్తున్నట్లు సమాచారం. సంజయ్ సొంత జిల్లాలోని కరీంనగర్ లేదా వేములవాడ నుంచే బరిలో దిగుతారని అంటున్నారట. మరి ఆఖరు నిమిషంలో పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
కాటేసిన అప్పులు: తెలంగాణలో ఇద్దరు రైతులు బలవన్మరణం
అప్పుల భారం తాళలేక సాగు చేసే రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. కష్టపడి పండించగా దిగుబడి రాక, మార్కెట్లో ధర పలకకపోవడంతో ఆ రైతులు తమ ప్రాణాలను తీసుకున్నారు. అప్పులు తీర్చే మార్గం లేక తమను తాము బలి తీసుకున్నారు. పొలంలో పురుగుల నియంత్రణకు వాడాల్సిన మందు వారిద్దరూ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబాన్ని పోషించలేక... అప్పులు తీర్చలేక తనువు చాలించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకేరోజు ఇద్దరూ రైతులు ఆత్మహత్యకు పాల్పడడం విషాదం నింపింది. తానూరు (ముధోల్): మూడేళ్లుగా పంటలు సరిగా పండకపోవడం, చేసిన అప్పులు తీరే దారి కనిపించకపోవడంతో మనస్తాపానికి గురైన యువరైతు అశోక్ (27) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రాజన్న తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బెంబర గ్రామానికి చెందిన చుక్కబొట్ల అశోక్ తనకున్న రెండెకరాలతోపాటు మరో ఎకరం భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. మూడేళ్లుగా పంటలు సరిగా పండకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. బ్యాంకు రుణాలతోపాటు ప్రైవేట్‌గా తీసుకున్న అప్పులు సుమారు రూ.3 లక్షల వరకు ఉన్నాయి. అప్పులు తీరడం లేదని మనస్తాపానికి గురైన అశోక్ మంగళవారం మధ్యాహ్నం పశువుల పాకలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు భైంసా ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం నిర్మల్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య రాధిక, కుమారులు అభిరాం, మణికంఠ ఉన్నారు. అశోక్ తండ్రి భుజంగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. చదవండి: ‘సారూ.. భూములు లాక్కోద్దు’ తహసీల్దార్ కాళ్లపై రైతులు మరో ఘటన పెంబి (ఖానాపూర్): అప్పుల బాధతో పురుగుల మందు తాగిన మండలంలోని రాయదారి గ్రామానికి చెందిన రైతు రాథోడ్ బాబుసింగ్ (35) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఎస్సై అశోక్ కథనం ప్రకారం.. రాథోడ్ బాబుసింగ్ పదెకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మొక్కజొన్న పంటలు సాగుచేస్తున్నాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పత్తిపంట పూర్తిగా దెబ్బతినగా.. మొక్కజొన్ని పంట సైతం అడవి పందుల దాడిలో ధ్వంసమైంది. దీంతో అప్పు చేసి పెట్టిన పెట్టుబడులు కూడా రావేమోనని ఆందోళన చెందిన బాబుసింగ్ శనివారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సోమవారం ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య విజయ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. చదవండి: రాజకీయ నాయకుడి వేధింపులకు మహిళ బలి -
కన్నీళ్లు మిగిల్చిన సాగు: తట్టుకోలేక 20 ఏళ్లు నిండని యువరైతు
తానూరు (ముధోల్): పంటకు నష్టం వాటిల్లడంతో మనస్తాపానికి గురైన యువకుడు వాగులోదూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం వెలుగుచూసింది. కుభీర్ ఎస్సై ప్రభాకర్‌రెడ్డి వివరాల ప్రకారం.. మండలంలోని బెల్‌తరోడా గ్రామానికి చెందిన పూరంశెట్టి శివకుమార్ (20) తన తండ్రికి సంబంధించిన రెండెకరాల వ్యవసాయ భూమిలో కూరగాయాల సాగు చేశాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంటకు నష్టం వాటిల్లింది. దీంతో శివకుమార్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. (చదవండి: రైతు ‘ఐడియా’ అదిరింది.. సమస్య తీరింది) శనివారం సాయంత్రం ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు ఆదివారం ఉదయం వెతకడం ప్రారంభించగా కుభీర్ మండలం లింగి గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం, చెప్పులు కనిపించాయి. అనుమానం వచ్చి జాలర్లతో వాగులో గాలించారు. దీంతో శివకుమార్ మృతదేహం బయటపడింది. కుభీర్ ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి తండ్రి పూరంశెట్టి నరేందర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. చదవండి: పుట్టింటికి వస్తానన్న కుమార్తె.. తల్లి వద్దనడంతో -
ముదోల్లో రెండిళ్లలో చోరీ
ముదోల్ (ఆదిలాబాద్ జిల్లా) : ఆదిలాబాద్ జిల్లా ముదోల్ పట్టణంలో మంగళవారం వేకువజామున రెండిళ్లలో చోరీలు జరిగాయి. సురేష్, లతీఫ్ అనే వ్యక్తుల ఇళ్లు పక్కపక్కనే ఉంటాయి. వీరిళ్లలో దొంగలుపడి ఆరున్నర తులాల బంగారు నగలు, 30 తులాల వెండి, 31వేల రూపాయల నగదు దోచుకెళ్లారు. ఈ మేరకు బాధితులు మంగళవారం మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు.