mudslides
-
ఫిలిప్పీన్స్‌లో వరదలు.. 23 మంది మృతి
మనీలా: ఫిలిప్పీన్స్ ఈశాన్య ప్రాంతాన్ని ట్రామి తుపాను అతలాకుతలం చేస్తోంది. బికోల్ ప్రాంతంతోపాటు క్వెజాన్ ప్రావిన్స్‌లో నీట మునిగిన ఘటనల్లో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క నాగా నగరంలోనే ఏడుగురు చనిపోయారు. రెండు నెలల్లో కురవాల్సిన వర్షం కేవలం 24 గంటల్లోనే నమోదైందని అధికారులు తెలిపారు. ఆల్బే ప్రావిన్స్‌లో మయోన్ అగ్ని పర్వతం నుంచి వెల్లువెత్తుతున్న బురద ప్రవాహం అనేక నివాస ప్రాంతాలను ముంచెత్తింది. ఇళ్లపైకి చేరిన వారిని, వరదలో చిక్కుకున్న వారిని యంత్రాంగం మోటారు బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ట్రామి తుపానుతో 75,400 మంది నిరాశ్రయులయ్యారని మొత్తం 20 లక్షల మందిపై ప్రభావం చూపిందని ప్రభుత్వం తెలిపింది. బుధ, గురు వారాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. చాలా ప్రాంతాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. సాయం అందించడం కూడా కష్టంగా మారిందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ప్రభుత్వం పేర్కొంది. -
బస్సును కమ్మేసిన బురద.. 34 మంది సజీవ సమాధి
బొగోటా: భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి అమెరికాలోని కొలంబియాలో ఘోర ప్రమాదం జరిగింది. కొండచరియలు విరిగిపడడంతో రహదారిపై వెళ్తున్న ఓ బస్సును పూర్తిగా ముంచేసింది బురద. మరో రెండు వాహనాలు సైతం పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ దుర్ఘటనలో మొత్తం 34 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నట్లు జాతీయ విపత్తు నిర్వహణ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. రిసరాల్డా జిల్లాలోని ప్లూబో రికో నగరంలో ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. భారీగా బురద ఉప్పొంగటంతో రహదారి రెండుగా చీలిపోయింది. భారీగా ట్రీఫిక్ జామ్ ఏర్పడింది. రెండు మీటర్ల లోతులో బురదలో కూరుకుపోయిన బస్సులో మొత్తం 33 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బురద కమ్మేయడంతో ఓ కారులోని ఆరుగురు, ద్విచక్రవాహనంపై ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. సుమారు 70 మంది రెస్క్యూ సిబ్బంది 24 గంటల పాటు శ్రమించి మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు కొలంబియా అధ్యక్షుడు గుస్టావో పెట్రో. ‘బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వారికి ప్రభుత్వ తరపు నుంచి పూర్తి సహకారం ఉంటుంది.’ అని పేర్కొన్నారు. A #landslide engulfed a #bus in #Colombia on Sunday afternoon, leaving at least 34 people dead and several injured. The bus and 3 other vehicles were traveling on the highway near Pueblo Rico, #Risaralda when they were surprised by the #avalanche. #viralvdoz pic.twitter.com/ePahStfzo1 — ViralVdoz (@viralvdoz) December 6, 2022 ఇదీ చదవండి: మనిషి మెదడులో చిప్.. న్యూరాలింక్ ప్రయోగాలపై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ -
సునామీ భయం ప్రాణాలు తోడేసింది
మనీలా: సునామీ భయం ఫిలిప్పీన్స్ పర్వతప్రాంత ప్రజల ప్రాణాలు తీసింది. అక్కడ కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం భారీ అలలు వచ్చి పడటంతో సునామీ ముంచుకొస్తోందని మగుందనావో ప్రావిన్స్‌లోని కుసియాంగ్ గ్రామవాసులు భయపడ్డారు. గతంలో ఆ గ్రామాన్ని భయంకర సునామీ ముంచెత్తింది. నాటి నేటికీ వెంటాడుతున్నాయి. దాంతో వారంతా హుటాహుటిన కొండ వద్దకు చేరుకున్నారు. అప్పటికే కుండపోతగా కురుస్తున్న వర్షాల ధాటికి అక్కడ మట్టి, బురదచరియలు విరిగిపడి ఉన్నాయి. ఆ ఊబిలో చిక్కి దాదాపు 20 మంది సజీవ సమాధి అయ్యారు. అయితే, ఈసారి మృత్యువు మరో రూపంలో వారిని కబళించింది. వాయవ్య ఫిలిప్పీన్స్‌ను అతలాకుతలం చేస్తున్న నాల్గే తుపాను కారణంగా ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయ. ఈ తుపాను ప్రభావ వర్షాల కారణంగానే కుసియాంగ్ గ్రామంలో బురదచరియలు విరిగిపడ్డాయి. ‘ఏటా ఇక్కడి వారు సునామీ వస్తే ఎలా అప్రమత్తంగా ఉండాలనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఘటన జరిగినప్పుడు సైతం వార్నింగ్ బెల్స్ మోగడంతో చాలా మంది కొండ వద్ద ఉన్న చర్చి వద్దకు పరుగులు తీశారు. అదే వారి ఉసురు తీసింది’’ అని ఆ ప్రావిన్స్ మంత్రి చెప్పారు. -
క్రికెట్ ఆడుకోవడానికి వెళ్లి మృత్యువాత
నిడమానూరు: ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం నిడమానూరు లో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుకోవడానికి వెళ్లిన ముగ్గురు విద్యార్థులు ముసి ఏటిలో మునిగి మృతి చెందారు. మృతి చెందిన చిన్నారులు మహేష్, వాసు, జగన్‌లుగా గుర్తించారు. నిన్న సాయంత్రం నుండి కనిపించకపోవడంతో ఇవ్వాళ ముసి కాలువ లో గాలించగా చిన్నారుల మృతదేహాలు బయటపడ్డాయి. లాకీగా వుండే చిన్నారులు ముగ్గురు చనిపోవడం తో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
వైరల్ : క్షణం ఆలస్యమైతే శవమయ్యేవాడే..!
మలప్పురం : భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కేరళ ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పట్టుకుని తిరుగుతున్నారు. గత రెండు రోజులుగా మలప్పురం, వయనాడ్ జిల్లాల ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఓ ఘటన ప్రకృతి విలయ తాండవానికి కేరళ నిలయంగా మారిందనడానికి సాక్ష్యంగా నిలిచింది. వర్షం కురుస్తుండటంతో ఓ వ్యక్తి గొడుగు పట్టుకుని తల్లితో పాటు నడుస్తున్నాడు. ఒక్కసారిగా ఆ పరిసరాల్లో ఏదో అలజడి మొదలైంది. ప్రమాదమేదో ముంచుకొస్తోందని గ్రహించిన ఆ తల్లీకొడుకు ముందుకు పరుగెత్తే యత్నం చేశారు. ఉన్నట్టుండి భారీగా మట్టిపెళ్లల ప్రవాహం వారిని ముంచెత్తేందుకు దూసుకొచ్చింది. కొడుకు క్షణాల్లో అక్కడికి సమీపంలో ఉన్న ఓ భవనం వద్దకు చేరగా.. అతని తల్లి మాత్రం మట్టిపెళ్లల కింద కూరుకుపోయింది. వస్తూవస్తూ ఆ ప్రవాహం వారి ఇళ్లును కూడా కప్పెట్టేసింది. ఆ సమయంలో అతని భార్య, ఏడాదిన్నర కొడుకు కూడా ఇంట్లోనే ఉండటంతో మట్టిలో కూరుకుపోయినట్టు తెలిసింది. దీంతో బాధితుడు కొట్టక్కున్ను జనమైత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు సహాయక చర్యలు మొదలు పెట్టారు. శుక్రవారం రాత్రి వరకు గాలించినా అతని భార్య, కుమారుడు, కొడుకు జాడ కానరాలేదు. భారీ స్థాయిలో మట్టిపెళ్లలు, చెట్లు పైనబడటంతో వారు బతికే అవకాశాలు లేవని డిప్యూటీ ఎస్పీ వెల్లడించారు. సమీపంలోని సీసీటీవీలో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నమోదయ్యాయి. ఇక గత మూడు రోజులుగా వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 28 మంది ప్రాణాలువిడిచారు. ఒక్క మలప్పురం జిల్లాలోనే 9 మరణాలు సంభవించాయి. ఇక ఇదే జిల్లాలోని నీలంబూర్లో కొండ చరియలు విరిగిపడటంతో భూథతాన్-ముథప్పాన్ పర్వతాల కింద 40 మందికి చిక్కుకున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. -
ట్రక్కుతో చిక్కు తప్పెన్
చైనా యాక్షన్ సూపర్ స్టార్ జాకీ చాన్ అంటే యాక్షన్ సినిమా ప్రియులందరికీ ఇష్టమే. ఎందుకంటే ఎంతో రిస్కీ స్టంట్స్‌ని కూడా అవలీలగా స్క్రీన్ మీద చేసేస్తారు. కానీ స్క్రీన్ వెనక ఆ స్టంట్స్ కోసం ఎంత సాహసానికైనా రెడీ అంటారు. ఈ ప్రక్రియలో ఎన్నోసార్లు ఒళ్లు జల్లెడ అయిపోయేలా దెబ్బలు తగిలించుకొన్నారు. కొన్నిసార్లు ప్రాణం మీదకు కూడా తెచ్చుకున్నారు. ఆయన శరీరం మీదున్న ప్రాక్చర్స్ అయితే లెక్క లేనన్ని. తాజాగా ‘ప్రాజెక్ట్ ఎక్స్’ అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నారు జాకీ. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఫేమ్ జాన్ సేనా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈసారి కూడా ఓ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారట జాకీ చాన్.జాకీ మాత్రమే కాదు మొత్తం చిత్రబృందం ‘మడ్‌స్లైడ్’ (మట్టి దానంతట అదే కుదించుకుపోయే ప్రకృతి వైపరీత్యం) నుంచి తప్పించుకున్నారట. ఈ విషయాన్ని జాకీ పంచుకుంటూ – ‘‘లొకేషన్లో షూటింగ్ చేస్తుండగా వాతావరణంలో మార్పు వచ్చేసి మట్టి కుదించుకుపోవడం స్టార్ట్ అయింది. మా ప్రొడక్షన్ ట్రక్కులన్నీ అందులో చిక్కుకుపోయాయి. మా టీమ్ అంతా భయపడిపోయాం. ఇంతలో పెద్ద ట్రక్ వచ్చి మమ్మల్ని కాపాడింది. వాళ్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అనుభవం వల్ల మాకో పాఠం బోధపడింది. వాతావరణ పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని తెలిసింది’’ అని పేర్కొన్నారు. -
వరదల్లో 55 మంది మృతి
-
కొలంబియా విలయం: 254కు పెరిగిన మృతులు
మొకోవా: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు, వరదతోపాటు ముంచెత్తిన బురద విలయానికి దక్షిణ అమెరికా దేశం కొలంబియా విలవిలలాడుతోంది. దేశ నైరుతి ప్రాంతంలోని మొకోవా నగరం మొత్తాన్ని బురద ప్రవాహం ముంచెత్తింది. దీంతో అనేక ఇళ్లు, వంతెనలు, వాహనాలు, చెట్లు కొట్టుకుపోయాయి. ఎక్కడచూసినా బురద తప్ప మరేమీ కనిపించని పరిస్థితి నెలకొంది. విలయం కారణంగా చనిపోయినవారి సంఖ్య సోమవారం నాటికి 254కు పెరిగింది. దేశాధ్యక్షుడు జువాన్ మాన్యుయెల్ శాంటోస్ మొకోవాలోనే మకాం వేసి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. (బురద విలయం ఫొటోలు ఇక్కడ క్లిక్ చేయండి) గత శుక్రవారం భారీ వర్షం కురవడంతో మొకోవా, దాని ఉపనదులు ఉప్పొంగి ప్రవహించిన కారణంగానే మట్టిపెళ్లలు విరిగిపడ్డాయని, చివరికి మహా విపత్తుకు దారితీసింది. ఈ విషాదం నేపథ్యంలో దాదాపు 200 మంది గల్లంతుకాగా, 300 కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయాయి. అనేక ఆవాసాలు ధ్వంసమయ్యాయి. స్థానిక అధికారులు, సైనిక సిబ్బంది, పోలీసులతో కూడిన విపత్తు బృందాలు గల్లంతైనవారి కోసం గాలింపు చేపట్టాయి. గడిచిన మూడు రోజులుగా మొకోవాలో, పరిసర గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తాగునీరు దొరకకపోవడంతో ప్రజలు విలవిలలాడుతున్నారు.