మనీలా: ఫిలిప్పీన్స్ ఈశాన్య ప్రాంతాన్ని ట్రామి తుపాను అతలాకుతలం చేస్తోంది. బికోల్ ప్రాంతంతోపాటు క్వెజాన్ ప్రావిన్స్‌లో నీట మునిగిన ఘటనల్లో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క నాగా నగరంలోనే ఏడుగురు చనిపోయారు. రెండు నెలల్లో కురవాల్సిన వర్షం కేవలం 24 గంటల్లోనే నమోదైందని అధికారులు తెలిపారు. ఆల్బే ప్రావిన్స్‌లో మయోన్ అగ్ని పర్వతం నుంచి వెల్లువెత్తుతున్న బురద ప్రవాహం అనేక నివాస ప్రాంతాలను ముంచెత్తింది.
ఇళ్లపైకి చేరిన వారిని, వరదలో చిక్కుకున్న వారిని యంత్రాంగం మోటారు బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ట్రామి తుపానుతో 75,400 మంది నిరాశ్రయులయ్యారని మొత్తం 20 లక్షల మందిపై ప్రభావం చూపిందని ప్రభుత్వం తెలిపింది. బుధ, గురు వారాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. చాలా ప్రాంతాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. సాయం అందించడం కూడా కష్టంగా మారిందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ప్రభుత్వం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment