multan test
-
పాక్ క్రికెట్‌కు ఏమైంది? పిచ్చి నిర్ణయాలు: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఫైర్
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తీరుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మండిపడ్డాడు. అత్యుత్తమ ఆటగాడిని జట్టు నుంచి తప్పించడం సెలక్టర్ల తెలివితక్కువతనానికి అద్దం పడుతోందన్నాడు. పీసీబీ అర్థంపర్థంలేని నిర్ణయాలకు ఇది పరాకాష్ట అంటూ విమర్శించాడు. కాగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు గత కొంతకాలంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.బాబర్‌పై వేటుముఖ్యంగా టెస్టుల్లో దాదాపు మూడున్నర సంవత్సరాలుగా ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయింది. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజం తప్పుకోగా.. అతడి స్థానాన్ని షాన్ మసూద్‌తో భర్తీ చేసింది పీసీబీ. అయితే, అప్పటి నుంచి పరిస్థితి ఇంకా దిగజారింది. ఆస్ట్రేలియా పర్యటనతో పాటు సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ టెస్టు సిరీస్‌లలో క్లీన్‌స్వీప్ అయింది.ఫలితంగా మసూద్ కెప్టెన్సీపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇక తాజాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోనూ పాక్ వైఫల్యం కొనసాగిస్తోంది. తొలి టెస్టులో ఏకంగా ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇరు జట్ల మధ్య అక్టోబరు 15 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది.పీసీబీ మూర్ఖత్వానికి ఇది పరాకాష్టఈ నేపథ్యంలో మిగిలిన రెండు టెస్టులకు ప్రకటించిన జట్టు నుంచి టాప్ బ్యాటర్ బాబర్ ఆజంను తప్పించింది. ఈ విషయంపై స్పందించిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్.. ‘‘చాలా కాలం నుంచి పాకిస్తాన్ ఇప్పటి వరకు ఒక్క టెస్టు కూడా గెలవలేదు. ఈ సిరీస్‌లోనూ 1-0తో వెనుకబడి ఉంది. అయినప్పటికీ అత్యుత్తమ ఆటగాడు బాబర్ ఆజంను తప్పించింది. పాకిస్తాన్ క్రికెట్ ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకుంటోంది.అందులో ఇది పరాకాష్టలాంటిది. ఇంతకంటే తెలివి తక్కువతనం, మూర్ఖత్వం మరొకటి ఉండదు! ఒకవేళ అతడే స్వయంగా విరామం కావాలని గనుక అడిగి ఉండకపోతే!’’ అని ఎక్స్ వేదికగా పీసీబీ విధానాలను, సెలక్టర్ల తీరును తప్పుబట్టాడు.మూడు ఫార్మాట్లలోనూ ఆటగాడిగా, కెప్టెన్‌గా బాబర్ భేష్ తొమ్మిదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో బాబర్ ఆజం పాకిస్తాన్ నంబర్‌వన్ బ్యాటర్‌గా ఎదిగాడు. టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో పలు కీలక విజయాలు అందించడంతో పాటు కెప్టెన్‌గా కూడా చెప్పుకోదగ్గ ఘనతలు సాధించాడు. అంతేకాదు.. సుదీర్ఘ కాలం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ బ్యాటర్‌గా కూడా కొనసాగాడు. అయితే ఇటీవల ఫామ్ కోల్పోయిన అతను టెస్టుల్లో పరుగులు చేయడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు.గడ్డుకాలంచివరగా... డిసెంబర్ 2022లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన బాబర్...గత 18 టెస్టు ఇన్నింగ్స్‌లలో ఒక్క అర్ధ శతకం కూడా బాదలేకపోయాడు. ఇర 2023 నుంచి ఆడిన 9 టెస్టుల్లో అతడు సాధించిన పరుగుల సగటు 21 మాత్రమే. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో కూడా బ్యాటింగ్‌కు బాగా అనుకూలించిన ముల్తాన్ పిచ్‌పై బాబర్ 30, 5 పరుగులు మాత్రమే సాధించడం గమనార్హం. ముఖ్యంగా బౌలింగ్‌కు ఏమాత్రం అనుకూలంగా లేని వికెట్‌పై అతను పేలవంగా ఆడి నిష్క్రమించడం విమర్శలకు తావిచ్చింది.కొత్త సెలక్టర్లు వచ్చారు.. వేటు వేశారు!ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో మొదటి టెస్టులో పాక్ ఓడిపోగానే... మాజీ ఆటగాళ్లు ఆకిబ్ జావేద్, అసద్ షఫీక్, అజహర్ అలీ తదితరులతో పాక్ బోర్డు హడావిడిగా కొత్త సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేయడం విశేషం. ఈ ఆటగాళ్లే బాబర్‌ను తప్పించాలని నిర్ణయించారు. అయితే, టాప్ బ్యాటర్ బాబర్‌పై వేటు పాక్ క్రికెట్ వర్గాల్లో సంచలన చర్చకు కారణమైంది. ఇటీవల ఫామ్ కోల్పోయినా సరే...ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్లో అందరికంటే పెద్ద స్టార్ ఆటగాడు అతడేనన్నది వాస్తవం.ఇతరులలో మరో ఆటగాడు అతడి దరిదాపుల్లో కూడా లేడు. జట్టు ప్రదర్శనతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా బాబర్‌కు ఎంతో ఫాలోయింగ్ ఉంది. ఒక దశలో తన నిలకడైన ఆటతో ‘ఫ్యాబ్ 4’తో పోటీ పడుతూ ఐదో ఆటగాడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న బాబర్‌పై వేటు నిజంగా అసాధారణమనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే మైకేల్ వాన్ కూడా ఘాటుగా స్పందించాడు. కాగా బాబర్ 55 టెస్టుల్లో 43.92 సగటుతో 9 శతకాలు, 26 హాఫ్ సెంచరీలు సహా 3997 పరుగులు చేశాడు.చదవండి: India vs Australia: భారత్ సెమీస్ ఆశలకు దెబ్బ! -
కోహ్లి కోసం తపిస్తున్న పాకిస్తాన్ అభిమానులు.. ఇది చూడండి..!
టీమిండియా స్టార్ క్రికెటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లికి ఈ ప్రాంతం ఆ ప్రాంతం అన్న తేడా లేకుండా విశ్వవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. కింగ్‌కు దాయాది దేశం పాక్‌లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న విషయం మరోసారి నిరూపితమైంది. ముల్తాన్ వేదికగా పాకిస్తాన్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్ట్ సందర్భంగా ఇద్దరు పాక్ అభిమానులు కోహ్లిపై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. వచ్చే ఏడాది జరుగనున్న ఆసియా కప్‌లో ఆడేందుకు కోహ్లి పాక్‌కు రావాలని ప్లకార్డ్‌లు పట్టుకుని మరీ విన్నవించుకున్నారు. కింగ్ కోహ్లి పాక్‌కు వచ్చి ఆసియా కప్ ఆడాలని మొరపెట్టుకున్నారు. ఓ అభిమాని అయితే.. మా కింగ్ బాబర్ ఆజమ్ కంటే నిన్నే ఎక్కువ ఇష్టపడతాం అంటూ కోహ్లిపై అభిమానాన్ని చాటుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరలవుతుంది. Virat Kohli fans in Pakistan - The craze is huge. pic.twitter.com/THW0veDL7L — Johns. (@CricCrazyJohns) December 12, 2022 ఇదిలా ఉంటే, వచ్చే ఏడాది పాక్‌లో జరిగే ఆసియా కప్‌లో ఆడేది లేదని భారత్ ఇదివరకే స్పష్టం చేసింది. ఇందుకు ప్రతిగా పాక్.. తాము సైతం భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో ఆడేది లేదని బెదిరింపులకు దిగింది. పాక్ ఉడత బెదిరింపులకు భయపడేది లేదని, ఆ దేశంలో ఎట్టి పరిస్థితుల్లో అడుగుపెట్టేది లేదని భారత వర్గాలు తెగేసి చెప్పడంతో పాక్ తోకముడిచి ఆ ప్రస్తావనకు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఈ నేపథ్యంలో పాక్‌కు చెందిన అభిమానులు కోహ్లి కోసం, టీమిండియా పాక్‌లో ఆడటం కోసం చేసిన విన్నపం క్రికెట్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. కొందరు ఆటను ఇతర విషయాలతో ముడిపెట్టడం సబబు కాదని, ఆటను ఆటలా చూసి పాక్‌లో క్రికెట్ ఆడాలని కోరుతున్నారు. అక్కడ కూడా కోహ్లికి వీరాభిమానులు ఉన్నారు.. వారు కింగ్ ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు తపిస్తున్నారంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. -
బౌలింగ్ చేస్తున్నావా లేక అడుక్కుంటున్నావా..? అక్తర్ స్లెడ్జింగ్‌కు సెహ్వాగ్ కౌంటర్
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు దాయాది పాక్‌తో ముల్తాన్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ ఎంత ప్రత్యేకమైందో వివరించి చెప్పాల్సిన పని లేదు. నాటి మ్యాచ్‌లో సెహ్వాగ్ (375 బంతుల్లో 309; 39 ఫోర్లు, 6 సిక్సర్లు) ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. అయితే ఆ మ్యాచ్‌లో పాక్ ప్రధాన పేసర్ షోయబ్ అక్తర్ సెహ్వాగ్‌ను పదేపదే విసిగించాడు. వారి మధ్య జరిగిన నాటి సంభాషణను మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తాజాగా పంచుకున్నాడు. ఓ ప్రముఖ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఆ టెస్ట్‌లో సెహ్వాగ్ డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత అక్తర్ అతనిపైకి షార్ట్ పిచ్ బంతులతో దాడి చేశాడు. పదే పదే బౌన్సర్లు సంధించాడు. ఇక సెహ్వాగ్ ప్రతి షార్ట్ బాల్‌ను డకింగ్( బంతిని వదిలేసి కిందికి వంగడం) చేశాడు. సెహ్వాగ్ తెలివైన వ్యూహానికి చిర్రెత్తుకుపోయిన అక్తర్ అతని దగ్గరకు వెళ్లి.. ఒక్క పుల్ షాట్ ఆడే ప్రయత్నమైనా చేయొచ్చుగా అని కోరాడు. దానికి సెహ్వాగ్.. అరే అక్తర్.. నువ్వు బౌలింగ్ చేస్తున్నావా లేక అడుక్కుంటున్నావా అని దిమ్మతిరిగే బదులిచ్చాడని నాటి మ్యాచ్ విశేషాలను మంజ్రేకర్ గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, సెహ్వాగ్ మెరుపు ఇన్నింగ్స్‌తో ముల్తాన్ టెస్ట్‌లో భారత్ రెండే రోజుల్లోనే 650 పరుగులు చేసింది. మిగతా రెండు రోజుల్లో పాక్‌ను రెండు సార్లు ఆలౌట్ చేసి ఇన్నింగ్స్ 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ అత్యంత దుమారానికి కూడా కారణమైంది. సచిన్ టెండూల్కర్ (194 ) డబుల్ సెంచరీకి దగ్గర్లో ఉండగా అప్పటి కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ మ్యాచ్‌ను డిక్లేర్ చేశాడు. ఇది పెద్ద వివాదం అయ్యింది. సచిన్ తన కన్న ముందు 5 డబుల్ సెంచరీలు చేస్తాడన్న అక్కసుతోనే ద్రవిడ్ మ్యాచ్‌ను డిక్లర్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. కానీ మ్యాచ్ గెలవడం కోసమే అలా చేశానని, సచిన్‌కు ముందే చెప్పానని ద్రవిడ్ వివరణ ఇచ్చాడు. ఇదే విషయాన్ని సచిన్ తన బయోగ్రఫీ 'ప్లేయింగ్ ఇట్ మై వే' లో ప్రస్తావించాడు. -
అదేంటో అదే రోజు.. రెండు ట్రిపుల్ సెంచరీలు: సెహ్వాగ్
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పాకిస్తాన్ గడ్డపై నెలకొల్పిన అరుదైన రికార్డు క్రికెట్ ప్రేమికుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 2004లో దాయాది దేశంలో పర్యటించిన భారత జట్టు, నాటి టెస్టు సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఇందులో భాగంగా, ముల్తాన్ టెస్టు(మార్చి 28)లో వీరూ విధ్వంసకర బ్యాటింగ్‌తో పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ట్రిపుల్ సెంచరీ(309 పరుగులు) చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా సెహ్వాగ్ చరిత్రకెక్కాడు. ఇక ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా పాకిస్తాన్‌పై ఇన్నింగ్స్ 52 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తన తొలి ట్రిపుల్ సెంచరీకి 17 ఏళ్లు నిండిన సందర్భంగా సెహ్వాగ్ ఆనాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు. ‘‘మార్చి 29.. నాకు ఎంతో ప్రత్యేకమైన తేదీ. టెస్టు క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా గౌరవం లభించింది. ముల్తాన్‌లో పాకిస్తాన్‌పై ఈ ఘనత సాధించాను. యాధృచ్చికంగా సరిగ్గా నాలుగేళ్ల తర్వాత మళ్లీ అదే రోజు దక్షిణాఫ్రికాపై 319 పరుగులు చేశాను’’అంటూ పాత వీడియోను ట్విటర్లో షేర్ చేశాడు. ఈ క్రమంలో.. ‘‘ముల్తాన్ కా సుల్తాన్.. వీరూ పా నీ అద్భుత ఇన్నింగ్స్ మిస్పవుతున్నాం’’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: సచిన్ పాజీతో మళ్లీ బ్యాటింగ్.. సూపర్ ఇన్నింగ్స్! 29th March- a special date for me. Had the privilege and honour of becoming the first Indian to score a triple hundred in Test cricket. Icing in the cake was to score against Pakistan in Multan. Coincidentally 4 years later on the same date got out on 319 against South Africa. pic.twitter.com/ZKBHa5rCOA — Virender Sehwag (@virendersehwag) March 29, 2021 -
ట్రిపుల్ సెంచరీ కంటే.. 136 పరుగులే మిన్న!
ఇస్లామాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ముల్తాన్‌లో చేసిన ట్రిపుల్ సెంచరీ కంటే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ చెన్నైలో చేసిన 136 పరుగులకే తాను ఎక్కువ రేటింగ్ ఇస్తానని పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ అన్నాడు. అలా అని తాను సెహ్వాగ్ రికార్డును తక్కువ చేసి మాట్లాడటం లేదని.. అతడు ఓ గొప్ప ఆటగాడని పేర్కొన్నాడు. అయితే చెన్నైలో ప్రతికూల పరిస్థితుల్లోనూ సచిన్ సెంచరీ సాధించడం గొప్ప విషయమన్నాడు. కాగా 2004లో పాకిస్తాన్‌తో జరిగిన ముల్తాన్ టెస్టు మ్యాచ్‌లో సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. తద్వారా పాక్ గడ్డపై ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా చరిత్రకెక్కాడు. ఈ నేపథ్యంలో టీమిండియాతో జరిగిన 1999, 2004 టెస్టు మ్యాచ్‌ల్లో పాక్ జట్టులో భాగమైన సక్లయిన్ శుక్రవారం క్రికెట్ బాజ్‌తో మాట్లాడాడు. ఈ సందర్భంగా పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు.‘‘ వీరేంద్ర సెహ్వాగ్ సాధించిన ట్రిపుల్ సెంచరీ కంటే.. అంతకంటే ముందు అంటే 1999లో చెన్నైలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ రెండో ఇన్నింగ్స్‌లో చేసిన 136 పరుగులకే విలువ ఎక్కువ అని భావిస్తాను. ఎందుకంటే ఆనాడు మేం(పాక్ జట్టు) పూర్తిస్థాయి ప్రణాళికతో అక్కడికి వెళ్లాం. అదొక యుద్ధమనే చెప్పాలి. రెండు జట్లు హోరాహోరీగా పోరాడాయి. (నా భార్యను అల్మారాలో దాక్కోమని చెప్పా) అయితే ముల్తాన్(2004)లో పరిస్థితి ఇందుకు భిన్నం. అప్పుడు ఎలాంటి పోటీ లేదు. పైగా టెస్ట్ మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్ అది. అప్పుడు నాతో పాటు షోయబ్ అక్తర్ కూడా గాయపడ్డాడు. వికెట్ ఫ్లాట్‌గా ఉంది. బౌలర్లకు ఏమాత్రం అనుకూలించలేదు. బౌలింగ్ యూనిట్ మొత్తం చేతులెత్తేసింది. అంతేకాదు అప్పుడు బోర్డులో కూడా గందరగోళం ఉండేది. ఇంజమాముల్ హక్ అనుకోకుండా కెప్టెన్ అయిపోయాడు. మ్యాచ్‌పై సరిగా దృష్టి సారించలేకపోయాం. పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేకపోయాం.(‘భారత్‌లో అతడిని ఎదుర్కోవడం కష్టం’) యాషెస్‌కు ముందు ఏడాది ముందే ప్రిపరేషన్స్ జరుగుతాయి కదా. అలాగే ఇండియాతో మా మ్యాచ్ కూడా. కానీ మేం సిద్ధంగా లేము. సెహ్వాగ్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ అన్నది నిజమే. అయితే అప్పుడు పరిస్థితులు అనుకూలించినందు వల్లే ట్రిపుల్ సాధించాడని భావిస్తున్నా. ఎందుకంటే మనం పూర్తిగా సన్నద్ధమై.. బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టినపుడే కదా మ్యాచ్‌ను ఆస్వాదించగలం. ఏదేమైనా సెహ్వాట్ గొప్ప బ్యాట్స్‌మెన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా 2004 నాటి టెస్ట్ సిరీస్‌ను 2-1తో టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. -
ఎప్పుడూ కోప్పడలేదు! : ద్రవిడ్
ముంబై: ఎన్నో ఏళ్లు వాళ్లిద్దరూ కలిసి ఆడారు. చిరస్మరణీయ భాగస్వామ్యాలతో జట్టుకు అద్భుత విజయాలు అందించారు. సచిన్‌ను దగ్గరినుంచి పరిశీలించిన ద్రవిడ్, అతని గురించి ఆసక్తికర వ్యాఖ్య చేశారు. సచిన్ బహిరంగంగా కోపం ప్రదర్శించడం తానెప్పుడూ చూడలేదని ద్రవిడ్ అన్నారు. ‘అందరి ముందు సచిన్‌కు కోపం రావడం నేను ఎప్పుడూ చూడలేదు. జనం మధ్యలో ఉన్నప్పుడు కనీసం తన నిరాశను కూడా వ్యక్తం చేయలేదు. తప్పుడు నిర్ణయాల కారణంగా కొన్ని సార్లు డ్రెస్సింగ్ రూమ్‌లో కొద్దిగా బాధ పడినా బయట ఎప్పుడూ దానిని ప్రదర్శించలేదు’ అని ద్రవిడ్ వ్యాఖ్యానించారు. క్లిష్ట సమయాల్లోనూ వివాదాలకు దూరంగా ఉండగలగడం అద్భుతమని ద్రవిడ్ ప్రశంసించారు. ముల్తాన్ టెస్టులో సచిన్ 194 పరుగుల వద్ద ఉన్నప్పుడు కెప్టెన్‌గా ఉన్న ద్రవిడ్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి విమర్శల పాలైన విషయం తెలిసిందే. ‘మేమిద్దరం మాట్లాడుకొని ఆ వివాదాన్ని పరిష్కరించుకున్నాం. ఏం మాట్లాడామో అది మా ఇద్దరికే తెలుసు. దానిని అలాగే ఉండనివ్వండి. ఆ తర్వాత మేమిద్దరం పరస్పరం గౌరవించుకోవడంలో ఎలాంటి సమస్యా రాలేదు’ అని ద్రవిడ్ గుర్తు చేసుకున్నారు.