ముంబై: ఎన్నో ఏళ్లు వాళ్లిద్దరూ కలిసి ఆడారు. చిరస్మరణీయ భాగస్వామ్యాలతో జట్టుకు అద్భుత విజయాలు అందించారు. సచిన్‌ను దగ్గరినుంచి పరిశీలించిన ద్రవిడ్, అతని గురించి ఆసక్తికర వ్యాఖ్య చేశారు. సచిన్ బహిరంగంగా కోపం ప్రదర్శించడం తానెప్పుడూ చూడలేదని ద్రవిడ్ అన్నారు. ‘అందరి ముందు సచిన్‌కు కోపం రావడం నేను ఎప్పుడూ చూడలేదు. జనం మధ్యలో ఉన్నప్పుడు కనీసం తన నిరాశను కూడా వ్యక్తం చేయలేదు. తప్పుడు నిర్ణయాల కారణంగా కొన్ని సార్లు డ్రెస్సింగ్ రూమ్‌లో కొద్దిగా బాధ పడినా బయట ఎప్పుడూ దానిని ప్రదర్శించలేదు’ అని ద్రవిడ్ వ్యాఖ్యానించారు. క్లిష్ట సమయాల్లోనూ వివాదాలకు దూరంగా ఉండగలగడం అద్భుతమని ద్రవిడ్ ప్రశంసించారు.
ముల్తాన్ టెస్టులో సచిన్ 194 పరుగుల వద్ద ఉన్నప్పుడు కెప్టెన్‌గా ఉన్న ద్రవిడ్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి విమర్శల పాలైన విషయం తెలిసిందే. ‘మేమిద్దరం మాట్లాడుకొని ఆ వివాదాన్ని పరిష్కరించుకున్నాం. ఏం మాట్లాడామో అది మా ఇద్దరికే తెలుసు. దానిని అలాగే ఉండనివ్వండి. ఆ తర్వాత మేమిద్దరం పరస్పరం గౌరవించుకోవడంలో ఎలాంటి సమస్యా రాలేదు’ అని ద్రవిడ్ గుర్తు చేసుకున్నారు.
ఎప్పుడూ కోప్పడలేదు! : ద్రవిడ్
Published Tue, Nov 5 2013 1:31 AM | Last Updated on Sat, Sep 2 2017 12:16 AM
Advertisement