Multani soil
-
Beauty Tips: మొటిమలను శాశ్వతంగా దూరం చేసేందుకు ఇలా చేస్తే సరి!
పుదీనా ఆకులను ఎండబెట్టి పొడి చేయాలి. ఈ పొడిలో కొద్దిగా ముల్తానీ మట్టి, రోజ్‌వాటర్ వేసి పేస్టులా కలపాలి. ఈ పేస్టుని ముఖంపై ఉన్న మొటిమలపై రాయాలి. పూర్తిగా ఆరాక నీటితో కడిగేయాలి. ఈ పేస్టు చర్మంపై పేరుకు పోయిన జిడ్డుని తొలగించి, మొటిమలు తగ్గుముఖం పట్టేలా చేస్తుంది. క్రమం తప్పకుండా ఈ ప్యాక్ వేసుకుంటే ముఖచర్మం నిగారింపుని సంతరించుకుంటుంది. గుప్పెడు పుదీనా ఆకులకు కొద్దిగా తేనె, రోజ్‌వాటర్ జోడించి పేస్టులా నూరాలి. ఈ పేస్టుని ముఖానికి పూతలా వేసి పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం జిడ్డులేకుండా ఫ్రెష్‌గా కనిపిస్తుంది. -
బ్యూటిప్స్
ముఖం తరచు జిడ్డుగా మారుతోందా? అయితే, చెంచాడు ముల్తానీ మట్టిలో కాస్తంత రోజ్‌వాటర్, తాజా నిమ్మరసం కలిపి పేస్టులా తయారు చేయండి. ఆ పేస్టును ముఖానికి ప్యాక్‌లా పట్టించి, అరగంటసేపు గాలికి ఆరనిచ్చి చల్లటి నీటితో కడిగేయండి. వారానికి రెండుసార్లయినా ఈ ప్యాక్ అప్లై చేస్తే, ముఖం నుంచి జిడ్డు మటుమాయం అవుతుంది. మోచేతుల దిగువ నల్లగా మారి చూడటానికి ఇబ్బందిగా ఉంటోందా? రసం తీసేసిన నిమ్మచెక్కలతో రుద్ది, పావుగంట తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. నలుపు తగ్గి, మోచేతులు కూడా నిగనిగలాడతాయి.