multiplex shares
-
జోష్ నింపిన ఆర్ఆర్ఆర్.. దిల్కుష్లో మల్టీప్లెక్సులు
ముంబై: కొద్ది నెలలుగా భారత్‌సహా ప్రపంచ దేశాలను వణికించిన కరోనా మహమ్మారి నీరసించడంతో ఆంక్షలు తగ్గుముఖం పట్టాయి. దేశీయంగా ఏప్రిల్ 1 నుంచి మాస్క్, సామాజిక దూరం మినహా పలు ఆంక్షలను ఎత్తివేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎంటర్టైన్మెంట్ పరిశ్రమకు తిరిగి జోష్ వచ్చింది. ఓవైపు ఓటీటీ విభాగం పుంజుకోవడం, మరోపక్క భారీ బడ్జెట్ సినిమాల విడుదల కారణంగా మళ్లీ మల్టీప్లెక్స్ రంగం కళకళలాడుతోంది. ఊపు తెచ్చిన ఆర్ఆర్ఆర్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రేక్షకులను భారీగా ఆకట్టుకుంటోంది. సినిమా శుక్రవారం విడుదలకాగా.. వివిధ భాషల్లో టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఇప్పటివరకూ రూ. 59 కోట్లు వసూలు చేసినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లలో కొద్ది రోజులుగా బలపడుతూ వస్తున్న మల్టీప్లెక్స్ చెయిన్ కౌంటర్లకు మరోసారి డిమాండ్ పెరిగింది. వెరసి లిస్టెడ్ కంపెనీలు పీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ షేర్లు రెండేళ్ల గరిష్టాలకు చేరాయి. స్టార్ హీరోలు రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ సినీ పరిశ్రమకు మరింత జోష్‌నివ్వనున్నట్లు సినిమా రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇకపై పలు భాషల్లో మరింత కంటెంట్‌కు వీలుండటంతో మల్టీప్లెక్స్ కౌంటర్ల హవా కొనసాగవచ్చని స్టాక్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. షేర్ల జోరు ఎన్ఎస్ఈలో పీవీఆర్ లిమిటెడ్ షేరు ఒక దశలో 5 శాతంపైగా జంప్‌చేసి రూ. 1,868ను తాకింది. ఇది 25 నెలల గరిష్టంకాగా.. చివరికి రూ. 1.6 శాతం బలపడి రూ. 1,804 వద్ద ముగిసింది. ఈ బాటలో ఐనాక్స్ లీజర్ 12 శాతంపైగా దూసుకెళ్లి దాదాపు రూ. 497కు చేరింది. వెరసి 25 నెలల గరిష్టాన్ని అందుకుంది. చివరికి 6.2 శాతం లాభంతో రూ. 470 వద్ద నిలిచింది. ఇంతక్రితం 2020 ఫిబ్రవరి చివరి వారంలో పీవీఆర్, ఐనాక్స్ కౌంటర్లు ఈ స్థాయిలో ట్రేడయినట్లు స్టాక్ నిపుణులు తెలియజేశారు. తగ్గేదేలే.. మల్టీప్లెక్స్ రంగానికి తిరిగి మంచి రోజులురానున్నట్లు ఎడిల్వీజ్ రీసెర్చ్ ఇన్వెస్టర్ల నోట్లో పేర్కొంది. దేశవ్యాప్తంగా సినిమాలు తిరిగి ప్రారంభంకానుండటంతోపాటు.. పలు రాష్ట్రాలు పూర్తిస్థాయి సీటింగ్ సామర్థ్యాలకు అనుమతిస్తున్నట్లు తెలియజేసింది. ఇటీవల మల్టీప్లెక్స్ టికెట్ ధరలు 14 శాతం పుంజుకున్నట్లు వెల్లడించింది. ఇటీవల దేశవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించిన పుష్ప తదుపరి దక్షిణాది సినిమాలకు ఆకర్షణ పెరిగినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో మరిన్ని పాన్ఇండియా మూవీలకు అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు. -
మల్టీప్లెక్స్ షేర్ల లాభాల షో
నేటి నుంచి మహారాష్ట్రలో అన్ని సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్ థియేటర్లు ప్రారంభంకానున్న నేపథ్యంలో లిస్టెడ్ మల్టీప్టెక్స్ కంపెనీల షేర్లకు డిమాండ్ పెరిగింది. కంటెయిన్మెంట్ జోన్లకు వెలుపల గల అన్ని సినిమా హాళ్లు, థియేటర్లను ప్రారంభించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నేటి(5) నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే థియేటర్ల సీట్ల సామర్థ్యంలో 50 శాతం వరకూ మాత్రమే అనుమతించింది. అక్టోబర్ 1న కేంద్ర ప్రభుత్వం 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో సినిమా హాళ్లను తెరిచేందుకు మార్గదర్శకాలను జారీ చేసిన విషయం విదితమే. సమాచార, ప్రసార శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా థియేటర్లు, సినిమా హాళ్లను తిరిగి ప్రారంభించేందుకు అనుమతించింది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డవున్ తదుపరి మార్చి నుంచి సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్ థియేటర్లు తదితరాలు మూత పడిన సంగతి తెలిసిందే. షేర్ల జోరు సినిమా హాళ్ల పున:ప్రారంభం నేపథ్యంలో మల్టీప్లెక్స్ రంగ లిస్టెడ్ కంపెనీలు పీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో పీవీఆర్ షేరు దాదాపు 9 శాతం దూసుకెళ్లింది. రూ. 1,212 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో ఐనాక్స్ లీజర్ సైతం 4.5 శాతం జంప్ చేసి రూ. 276 వద్ద కదులుతోంది. తొలుత ఒక దశలో రూ. 280 వరకూ ఎగసింది. -
పీవీఆర్, ఐనాక్స్ లీజర్.. లాభాల షో
కంటెయిన్మెంట్ జోన్లలో మినహాయించి ఈ నెల 15 నుంచీ సినిమా హాళ్లను తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 50 శాతం వరకూ సీట్ల సామర్థ్యంతో సినిమా థియేటర్లను నిర్వహించుకునేందుకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ తాజాగా అనుమతించింది. దీంతో దేశవ్యాప్తంగా సినిమాల ప్రదర్శనకు వీలు కలగనుండటంతో మల్టీప్లెక్స్ నిర్వాహక కంపెనీల షేర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో లిస్టెడ్ కంపెనీలు పీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. హుషారుగా.. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో పీవీఆర్ 9 శాతం జంప్‌చేసి రూ. 1,319 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 15 శాతం దూసుకెళ్లింది. గరిష్టంగా రూ. 1,395ను తాకింది. ఇక ఐనాక్స్ లీజర్ సైతం ఇంట్రాడేలో 17 శాతం దూసుకెళ్లింది. రూ. 318కు చేరింది. ప్రస్తుతం 7.2 శాతం లాభపడి రూ. 290 వద్ద ట్రేడవుతోంది. సినిమా థియేటర్ల ప్రారంభానికి కేంద్రం అనుమతించినప్పటికీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి అని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. కాగా.. మహారాష్ట్ర, తమిళనాడులలో సినిమా హాళ్లు అక్టోబర్ నెలలోనూ తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించకపోవడం గమనార్హం! -
రైట్స్‌తో పీవీఆర్- బైబ్యాక్‌తో ఎంపీఎస్.. స్పీడ్
నిధుల సమీకరణకు చేపట్టిన రైట్స్ ఇష్యూ ఓవర్ సబ్స్క్రయిబ్ అయిన వార్తలతో మల్టీప్లెక్స్ చైన్ కంపెనీ పీవీఆర్ లిమిటెడ్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోవైపు సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించడంతో పబ్లిషింగ్ సొల్యూషన్స్ అందించే ఎంపీఎస్ లిమిటెడ్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి నష్టాల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. పీవీఆర్ లిమిటెడ్ గత నెల 17-31 మధ్య చేపట్టిన రైట్స్ ఇష్యూకి 2.24 రెట్లు అధికంగా స్పందన లభించినట్లు పీవీఆర్ లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. షేరుకి రూ. 784 ధరలో నిర్వహించిన రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 300 కోట్లు సమీకరించినట్లు తెలియజేసింది. రైట్స్‌లో ఆఫర్ చేసిన 38.23 కోట్ల షేర్లకుగాను 85.29 లక్షల షేర్ల కోసం దరఖాస్తులు లభించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పీవీఆర్ షేరు ఎన్ఎస్ఈలో 6.4 శాతం జంప్‌చేసి రూ. 1,194 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1,229 వరకూ ఎగసింది. ఎంపీఎస్ లిమిటెడ్ ఒక్కో షేరు రూ. 600 ధర మించకుండా బైబ్యాక్ చేపట్టేందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ఎంపీఎస్ లిమిటెడ్ తెలియజేసింది. కంపెనీ ఈక్విటీలో 3.04 శాతం వాటాకు సమానమైన దాదాపు 5.67 లక్షల షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. ఇందుకు రూ. 34 కోట్లను వెచ్చించనున్నట్లు తెలియజేసింది. పబ్లిషింగ్ సంబంధ సొల్యూషన్లు అందించే కంపెనీలో ప్రమోటర్ల వాటా జూన్‌కల్లా 67.77 శాతంగా నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎంపీఎస్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 415 సమీపంలో ఫ్రీజయ్యింది. -
మళ్లీ మల్టీప్లెక్స్‌ల జోరు- పీవీఆర్, ఐనాక్స్ హవా
కరోనా వైరస్ కట్టడికి వీలుగా కేంద్ర ప్రభుత్వం మార్చి 25 నుంచి లాక్డవున్లు ప్రకటించాక డీలాపడిన మల్టీప్లెక్స్ కౌంటర్లు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో లిస్టెడ్ కంపెనీలు పీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ జోరందుకున్నాయి. నష్టాల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. అన్‌లాక్-3లో భాగంగా కొన్ని సినిమా థియేటర్లను ఆగస్ట్ 1 నుంచి తిరిగి నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించనుందన్న వార్తలు ఈ కౌంటర్లకు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వివరాలు చూద్దాం.. జోరుగా.. దేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్‌ల చైన్ కలిగిన పీవీఆర్ లిమిటెడ్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 4 శాతం జంప్‌చేసి రూ. 1,147 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 6.3 శాతం ఎగసి రూ. 1,172ను తాకింది. ఇక ఐనాక్స్ లీజర్ మరింత అధికంగా 8 శాతం దూసుకెళ్లి రూ. 259 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో దాదాపు 12 శాతం పురోగమించి రూ. 268కు చేరింది. అన్‌లాక్-3లో దేశవ్యాప్తంగా పలు సినిమా థియేటర్లను తిరిగి ఆగస్ట్ 1 నుంచి ప్రారంభించేందుకు కేంద్రం అనుమతించనుందన్న వార్తలతో ఐనాక్స్ కౌంటర్లో ట్రేడింగ్ పరిమాణం సైతం భారీగా ఎగసింది. మధ్యాహ్నానికల్లా బీఎస్ఈలో 2.6 లక్షల షేర్లు చేతులు మారాయి. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 35,000 షేర్లు మాత్రమేకావడం గమనార్హం! -
మల్టీప్లెక్స్ షేర్ల పతనం- పీవీఆర్ నుంచి రైట్స్!
దేశీయ మల్టీప్లెక్స్‌ల దిగ్గజం పీవీఆర్ లిమిటెడ్.. నిధుల సమీకరణ బాటపట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా రైట్స్ ఇష్యూని చేపట్టే యోచనలో ఉన్నట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. పీవీఆర్ సినిమాస్ పేరుతో దేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్ నిర్వహిస్తున్న కంపెనీ లాక్‌డవున్ కారణంగా ఇటీవల సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 300 కోట్లు సమీకరించేందుకు పీవీఆర్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా ఇప్పటికే యాక్సిస్ కేపిటల్‌ను మర్చంట్ బ్యాంకర్‌గా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. 845 తెరలతో పీవీఆర్ లిమిటెడ్ చేపట్టదలచిన రైట్స్ ఇష్యూలో ప్రమోటర్లతోపాటు ఇప్పటికే కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన పీఈ దిగ్గజాలు వార్బర్గ్ పింకస్, మల్టీపుల్స్ ఆల్టర్నేట్ అసెట్ మేనేజ్మెంట్ సైతం పాలుపంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి డేటాబేస్ ప్రకారం పీవీఆర్ లిమిటెడ్‌లో ప్రమోటర్ల వాటా 18.54 శాతంకాగా.. వార్బర్గ్ పింకస్ 12.74 శాతం, మల్టిపుల్స్ ఏఏఎం 11.17 శాతం చొప్పున వాటాలను కలిగి ఉన్నాయి. దేశవ్యాప్తంగా పీవీఆర్ 176 ఆస్తులను కలిగి ఉంది. తద్వారా 845 తెరల(స్ర్కీన్స్)ను నిర్వహిస్తోంది. గతేడాది అక్టోబర్‌లో కంపెనీ క్విప్ ద్వారా రూ. 500 కోట్లు సమకూర్చుకుంది. లాక్‌డవున్ కోవిడ్-19 కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డవున్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సినిమా హాళ్లు, మాల్స్ మార్చి నుంచి తాత్కాలికంగా మూతపడ్డాయి. దీంతో మల్టీప్లెక్స్ రంగంలో ఆదాయాలకు గండి పడింది. మరోపక్క మూవీ నిర్మాతలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా సినిమాలను విడుదల చేసే ప్రణాళికలు వేస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఓటీటీ ద్వారా కాకుండా నేరుగా థియేటర్లలో తొలిసారి విడుదల చేసే సినిమాలను మాత్రమే ప్రదర్శించాలని పీవీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. షేర్లు డీలా కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూతపడటంతో ఇటీవల స్టాక్ మార్కెట్లలో లిస్టయిన మల్టీప్లెక్స్ కంపెనీలు పీవీఆర్, ఐనాక్స్ లీజర్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. వెరసి గత మూడు నెలల్లో పీవీఆర్ షేరు 57 శాతం పతనంకాగా.. ప్రత్యర్ధి కంపెనీ ఐనాక్స్ లీజర్ షేరు సైతం 55 శాతం దిగజారింది. కాగా.. జులైకల్లా తిరిగి మల్టీప్లెక్స్‌ల కార్యకలాపాలు ప్రారంభంకాగలవని పీవీఆర్ భావిస్తోంది. ఆగస్ట్ రెండో వారం నుంచీ బిజినెస్ పుంజుకోగలదని ఆశిస్తోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో పీవీఆర్ షేరు 2 శాతం క్షీణించి రూ. 864 వద్ద ట్రేడవుతోంది. ఈ ఫిబ్రవరి 25న రూ. 2125 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఇక రూ. 512 వద్ద ఏడాది గరిష్టానికి చేరిన ఐనాక్స్ లీజర్ ప్రస్తుతం 2 శాతం నీరసించి రూ. 212 వద్ద ట్రేడవుతోంది. -
పీవీఆర్‌కు బాహుబలి-2 కిక్.. సీఈవో ఏమన్నారు?
ముంబై: భారతీయ సినిమాలో బ్లాక్ బస్టర్ మూవీగా చరిత్ర సృష్టించనున్నబాహుబలి -2 స్టాక్ మార్కెట్లో కూడా మెరుపులు మెరిపిస్తోంది. ముఖ్యంగా మల్టీప్లెక్స్ నిర్వాహక సంస్థలు పీవీఆర్, ముక్తా ఆర్ట్స్ కౌంటర్లకు బాహుబలి విజయం మాంచి కిక్ ఇచ్చింది. మదుపర్ల కొనుగోళ్లతో ఈ షేర్లు కళకళలాడుతున్నాయి. ప్రధానంగా ముక్తా ఏ2 సినిమాస్ పేరుతో ముక్తా ఆర్ట్స్ మల్లీప్లెక్స్‌లను నిర్వహిస్తున్న ముక్తా ఆర్ట్స్ ఏకంగా 6.3 శాతం ఎగిసింది. మరో మల్టీప్లెక్స్ దిగ్గజ సంస్థ పీవీఆర్ షేరు 1.7 శాతం జంప్ చేసింది. సినిమా టికెట్లు, ఆహారం, పానీయాలు(ఫుడ్ అండ్ బెవరేజెస్) విక్రయాల ద్వారా ఆదాయం పెరుగుతుందన్న అంచనాలు ఈ కౌంటర్లలో జోష్ పెంచినట్టు నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా భారీసంఖ్యలో 9వేల స్క్రీన్లలో రిలీజ్ అయిన బాహుబలి-2 రికార్డులు సృష్టించడం ఖాయమని పీవీఆర్ పిక్చర్స్ సీఈవో కమల్ జ్ఞాన్‌చందానీ అభిప్రాయపడ్డారు. తాను వ్యక్తిగతంగా దర్శకుడు రాజమౌళికి పెద్ద ఫ్యాన్ అని చెప్పారు. స్పెషల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయినీ, ఇంతకముందెన్నడూ చూడలేదని, నమ్మశక్యం కానంత అమోఘంగా ఉన్నాయని కొనియాడారు. బాహుమలి-2కి అనూహ్యమైన స్పందన వస్తోందని.. కలెక్షన్లు ఇప్పుడే అంచనావేయడం కష్టమని కమల్ తెలిపారు. అమెరికాలో దాదాపు 30 లక్షల ముందస్తు టికెట్లు అమ్ముడుబోయినట్టు చెప్పారు. దంగల్ను మించి రికార్డులు సృష్టిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. అటు బాహుబలి ట్విట్టర్ పేజీ ఇప్పటికే 2,లక్షల 45 వేలకు పైగా ఫాలోవర్లను దాటేసింది.