Mumbai bullion market
-
స్పాట్ మార్కెట్లో మరింత పెరిగిన బంగారం
ముంబై: అంతర్జాతీయ ట్రెండ్ ఫలితంగా ముంబై బులియన్ మార్కెట్లో శుక్రవారం పసిడి ధర మరింత పెరిగింది. గురువారం రాత్రి మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఫ్యూచర్స్ ధర రూ. 30,000 దాటినప్పటికీ, శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో ఇది తగ్గింది. దాంతో ముంబై స్పాట్ మార్కెట్లో మేలిమి బంగారం పది గ్రాముల ధర మరో రూ. 275 మాత్రమే పెరిగి రూ. 29,260 వద్ద, ఆభరణాల బంగారమూ అంతే పెరుగుదలతో రూ. 29,110 వద్ద ముగిసింది. ఇది 20 నెలల గరిష్టానికి ఎగిసింది. ఇక వెండి రేటు కేజీకి రూ. 175 పెరిగి రూ. 38,175కి చేరింది. అటు ఢిల్లీలో రూ. 850 మేర పెరిగి రూ. 29,650 వద్ద ముగిసింది. 2014 మే 16 తర్వాత ఈ స్థాయిలో ముగియడం ఇదే ప్రథమం. న్యూయార్క్ ట్రేడింగ్‌లో కడపటి సమాచారం అందేసరికి ఔన్సు పుత్తడి ధర క్రితం ముగింపుకంటే 13 డాలర్లు క్షీణించి 1,235 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
గతవారం పసిడి.. స్వల్ప నష్టం...
న్యూఢిల్లీ: పసిడి గడచిన వారంలో స్వల్పంగా దాదాపు రూ.100 తగ్గింది. ముంబై బులియన్ మార్కెట్లో 24 క్యారెట్లు 10 గ్రాముల ధర రూ.26,480 వద్ద ముగి సింది. ఇక వెండి కేజీ ధర దాదాపు రూ.1,200 లాభపడింది. రూ.37,430 వద్ద ముగిసింది. ఆభరణాలు, రిటైల్ వర్తకుల మందగమన కొనుగోళ్లు బంగారం ధరపై ప్రభావం చూపాయి. దీపావళి పండుగ నేపథ్యంలో నాణాలకు డిమాండ్ ఏర్పడడంతో వెండి ధర పెరిగినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్‌ను చూస్తే.. పసిడి, వెండి ధరలు వారంలో కొంత పెరిగాయి. వడ్డీరేట్ల పెంపు విషయంలో అమెరికా ఫెడరల్ ఆలస్యం చేస్తుందన్న వార్తలు ఈ విభాగంలో నష్టాలు పూడ్చుకోడానికి కొంత ఉపయోగపడింది. న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో చురుగ్గా ట్రేడవుతున్న డిసెంబర్ కాంట్రాక్ట్ ధర శుక్రవారం ఔన్స్‌కు (31.1 గ్రా) 1,156 డాలర్ల వద్ద ముగిసింది. గత వారం ముగింపు 1,137 డాలర్లు. కాగా వెండి ఔన్స్‌కు 15.26 డాలర్ల నుంచి 15.82 డాలర్లకు ఎగసింది. -
మళ్లీ దిగివస్తున్న బంగారం ధరలు
- ముంబై బులియన్ మార్కెట్లో రెండు రోజుల్లో రూ.765 డౌన్ - అంతర్జాతీయ బలహీన ధోరణి ప్రభావం ముంబై: పసిడి, వెండి ధరలు మళ్లీ దిగొస్తున్నాయి. ఈ రెండు రోజుల్లో ముంబై బులియన్ మార్కెట్లో పసిడి 24 క్యారెట్ల ధర 10 గ్రాములకు రూ.765 పడింది. వెండి కేజీ ధర రూ.1,355 నష్టపోయింది. స్థానిక బులియన్ మార్కెట్లో బుధవారం 10 గ్రాముల పసిడి 24 క్యారెట్ల ధర రూ.355 పడి రూ.26,595కు చేరింది. 22 క్యారెట్ల ధర సైతం అంతే పరిమాణంలో కిందకుదిగి రూ.26,445కు జారింది. వెండి కేజీ ధర రూ.785 పడి రూ.35,045కు చేరింది. కారణం: అంతర్జాతీయ, దేశీ మార్కెట్లలో ఫ్యూచర్స్ మార్కెట్లో బలహీన ధోరణి, అలాగే స్టాకిస్టులు, ఇన్వెస్టర్ల అమ్మకాలు, దేశీయంగా కొనుగోళ్ల మద్దతు లేకపోవడం వంటి అంశాలు దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. తాజా పరిస్థితి ఇదీ... కాగా బుధవారం రాత్రి కడపటి సమాచారం అందేసరికి అంతర్జాతీయ, దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లలో సైతం పసిడి, వెండి ధరలు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. నెమైక్స్ కమోడిటీ మార్కెట్లో ఔన్స్ (31.1గ్రా) ధర 15 డాలర్ల నష్టంతో 1,123 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి కూడా నష్టాల్లో 14 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇందుకు అనుగుణంగా దేశీయ ఎంసీఎక్స్‌లో పసిడి 10 గ్రాముల ధర 374 నష్టంతో రూ.26,366 వద్ద ట్రేడవుతోంది. వెండి కేజీ ధర ఏకంగా రూ.1,250 నష్టంతో రూ.33,414 వద్ద ట్రేడవుతోంది. తాజా ట్రేడింగ్ ఇదే ధోరణిలో ముగిసి, గురువారం రూపాయి బలహీనపడితే, దేశీయ మార్కెట్లో పసిడి వెండి ధర రేపు (గురువారం) మరింత పడే అవకాశం ఉంది. -
వారంలో భారీగా పెరిగిన పుత్తడి
ముంబై : అంతర్జాతీయ మార్కెట్లో పటిష్టమైన ట్రెండ్‌తో పాటు డాలరుతో రూపాయి మారకపు విలువ క్షీణించడంతో గతవారం దేశీయంగా బంగారం ధర భారీగా పెరిగింది. గతవారం ముంబై బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛతగల పుత్తడి ధర అంతక్రితం వారంతో పోలిస్తే రూ. 1,345 లాభపడి రూ. 27,225 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛతగల బంగారం ధర అంతే లాభంతో రూ.27,075 వద్ద ముగిసింది. న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు ధర 47 డాలర్ల వరకూ పెరిగి 1,159 డాలర్ల వద్ద క్లోజయ్యింది. చైనా కరెన్సీ యువాన్ విలువను తగ్గించడంతో ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లు సంక్షోభంలో పడ్డాయని, దాంతో సురక్షిత సాధనంగా పుత్తడివైపు ఇన్వెస్టర్లు మళ్లుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్‌లో వడ్డీరేట్లు పెంచకపోవొచ్చన్న అంచనాలూ పసిడి ర్యాలీకి కారణమంటున్నారు. -
దూసుకుపోయిన పసిడి, వెండి
ముంబై : ముంబై బులియన్ మార్కెట్లో శుక్రవారం బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్లు 10 గ్రాముల ధర గురువారం ధరతో పోల్చితే రూ.495 పెరిగి రూ.26,995కు చేరింది. 22 క్యారెట్ల ధర కూడా అంతే స్థాయిలో ఎగసి రూ.26,845కు ఎగసింది. జూన్ 19 తరువాత రేట్లు ఈ స్థాయికి పెరగడం ఇదే తొలిసారి. ఇక కేజీ వెండి విషయానికి వస్తే- రూ.240 పెరిగి రూ.37,035కు చేరింది. ఈ రేటు కూడా రెండు నెలల గరిష్ట స్థాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ధరల పెరుగుదల ధోరణి, దేశంలో స్టాకిస్టుల డిమాండ్ పెరగడం వంటి కారణాలు పసిడి పరుగుకు కారణం. తాజా సమాచారం అందే సరికి నెమైక్స్ కమోడిటీ మార్కెట్లో పసిడి ధర (ఔన్స్ 31గ్రా)లాభాల్లో 1,160 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో పసిడి ధర శుక్రవారం కూడా భారీ లాభాలతో కడపటి సమాచారం అందే సరికి రూ.27,290 వద్ద ట్రేడవుతోంది. వెండి కూడా రూ.100కుపైగా లాభంతో రూ.36,201 వద్ద ట్రేడవుతోంది. -
రెండు నెలల కనిష్టస్థాయికి పుత్తడి
గ్రీసు పరిణామాల నేపథ్యంలో గతవారం దేశీయ మార్కెట్లో పుత్తడి ధర రెండు నెలల కనిష్టస్థాయికి తగ్గింది. ముంబాయి బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛతగల 10 గ్రాముల బంగారం ధర రూ. 400 తగ్గి, రూ. 26,535 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛతగల పుత్తడి అంతేమొత్తం క్షీణించి రూ. 26,385 వద్ద ముగిసింది. బంగారం తగ్గడానికి నిధులు ఈక్విటీ మార్కెట్లోకి మళ్లడం కూడా ఒక కారణమని బులియన్ ట్రేడర్లు చెప్పారు. పుత్తడికి డిమాండ్ తగ్గించేదిశగా ప్రభుత్వం గోల్డ్ బాండ్స్ ప్రవేశపెట్టాలని యోచించడం కూడా సెంటిమెంట్‌పై ప్రభావం చూపిందని వారన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2.4 శాతం క్షీణించి 1173 డాలర్లకు పడిపోయింది. ఈ స్థాయి మూడు వారాల కనిష్టం.