mumbai corporation elections
-
ముంబైలో హంగ్ కార్పొరేషన్
-
ముంబైలో హంగ్ కార్పొరేషన్
బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఫలితాలు చిత్రంగా వచ్చాయి. ముందునుంచి ఆధిక్యంలో ఉన్న శివసేన... చివరి నిమిషంలో తడబడగా, జీజేపీ మాత్రం పుంజుకుంది. శివసేన - బీజేపీ నువ్వా నేనా అన్నట్లుగా నిలిచాయి. మొత్తం 227 స్థానాలున్న కార్పొరేషన్లో శివసేన 84, బీజేపీ 81, కాంగ్రెస్ 31, ఎన్సీపీ 9, ఎంఎన్ఎస్ 7, ఇతరులు 13 చోట్ల గెలిచారు. దాంతో అధికారం చేపట్టాలంటే కావల్సిన కనీస స్థానాలు.. 114 మ్యాజిక్ ఫిగర్ ఎవరికీ దక్కలేదు. ఇప్పటివరకు శివసేన - బీజేపీ కలిసి మహారాష్ట్రలో పోటీ చేయగా, ఇప్పుడు ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. అయితే అత్యధిక స్థానాలను ఈ రెండు పార్టీలే పంచుకోవడం విశేషం. కాంగ్రెస్ పార్టీ కేవలం 31 చోట్ల మాత్రమే గెలవగా, దాని మిత్రపక్షం ఎన్సీపీకి అంతకంటే దారుణంగా 9 వార్డులే దక్కాయి. మరో రెండు స్థానాల్లో ఫలితాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆ రెండు స్థానాలు ఎవరికి దక్కినా కూడా అధికారం చేపట్టేందుకు తగినంత బలం ఉండదు. దాంతో.. ఇప్పుడు అతిపెద్ద పార్టీగా అవతరించిన శివసేన మళ్లీ ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా అనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఇతరులు గెలిచిన 13 స్థానాల్లో మూడు మజ్లిస్ పార్టీకి ఉన్నాయి. వాళ్లతో శివసేన పొత్తు పెట్టుకునే అవకాశం లేదు. ఇక కాంగ్రెస్తో ఎట్టి పరిస్థితుల్లోనూ కలవరు. ఇలాంటి పరిస్థితులలో మళ్లీ బీజేపీ - శివసేన కూటమి అధికారం చేపట్టవచ్చని భావిస్తున్నారు. -
ముంబై కార్పొరేషన్లో ఒవైసీ బోణీ
ప్రతిష్ఠాత్మకమైన బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ బోణీ కొట్టింది. తొలిసారి ఆ కార్పొరేషన్లోని మూడు స్థానాల్లో గెలిచింది. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఆలిండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ పార్టీ ఇప్పటివరకు కేవలం హైదరాబాద్కు మాత్రమే పరిమితం అయ్యిందని అనుకున్నా.. ఇప్పుడు ముంబైలోనూ అడుగుపెట్టింది. మొత్తం 227 వార్డులున్న బీఎంసీలో మొత్తం 59 చోట్ల పోటీ చేసిన ఎంఐఎం.. చీతా క్యాంప్, బైకుల్లా వార్డులలో గెలిచింది. అయితే మజ్లిస్ పార్టీ కనీసం 6 నుంచి 8 స్థానాల వరకు గెలుచుకోవచ్చని చాలామంది ఊహించారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ ఔరంగాబాద్, బైకుల్లా స్థానాలలో గెలిచింది. ఇప్పుడు ముంబై కార్పొరేషన్లో కూడా అడుగుపెట్టడంతో ఒవైసీ కల కొంతవరకు నెరవేరినట్లయింది. -
ఎడ్ల పందేల కోసం పట్టుబడదాం
తమిళనాడులో జల్లికట్టు కోసం జరిగిన పోరాటం మరిన్ని రాష్ట్రాలకు స్ఫూర్తినిచ్చింది. కర్ణాటకలో కంబళ పోటీని చట్టబద్ధం చేసేందుకు అక్కడ ప్రయత్నాలు ఇప్పటికే మొదలుకాగా, తాజాగా మహారాష్ట్రలో ఎడ్ల బండ్ల పందేలకు కూడా అనుమతి పొందేందుకు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ముందుకొచ్చారు. ఈ విషయాన్ని ఆయన ముంబైలో జరిగిన పార్టీ సమావేశంలో ప్రకటించారు. దాంతోపాటు, త్వరలోనే జరగనున్న బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో ఇక ఎవరితోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని, అసలైన పోరు ఇప్పుడే మొదలు కాబోతోందని కూడా ఠాక్రే చెప్పారు. మహారాష్ట్రలో ఇన్నాళ్లూ బీజేపీ - శివసేనల మధ్య పొత్తు ఉండగా.. ఇప్పుడు ఒంటరి పోరాటానికి శివసేన ముందుకెళ్లడం విశేషం.