Mumbai man
-
హై రిటర్న్స్ కోసం ఆశపడితే మీకూ ఇదే జరగొచ్చు..!
అత్యధిక లాభాల కోసం ఆశపడి మోసగాళ్ల చేతికి చిక్కిన ఓ వ్యక్తి కోటి రూపాయలకు పైగా పోగొట్టుకున్న సంఘటన ముంబైలో చోటుచేసుకుంది. ముంబైలోని ఖర్ఘర్‌కు చెందిన 48 ఏళ్ల వ్యక్తిని షేర్ ట్రేడింగ్ ద్వారా అధిక రాబడులు ఇప్పిస్తామని నమ్మించి రూ.1.07 కోట్లు కాజేశారు కేటుగాళ్లు.దీనిపై దర్యాప్తులో భాగంగా ఆదివారం ఒక యాప్, వెబ్సైట్ యజమానులతో సహా 15 మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని నవీ ముంబై జిల్లా ఖర్ఘర్ టౌన్‌షిప్‌కు చెందిన బాధితుడికి ఫిబ్రవరి 13 నుంచి మే 5 మధ్య పలుమార్లు ఫోన్ వచ్చింది. షేర్ ట్రేడింగ్ ద్వారా అధిక రాబడి వచ్చేలా చేస్తామని నమ్మించి వివిధ బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేయడానికి అతన్ని ఒప్పించారని నవీ ముంబై సైబర్ పోలీసు సీనియర్ ఇన్స్పెక్టర్ తెలిపారు.మోసగాళ్లను నమ్మిన బాధితుడు మొత్తం రూ.1,07,09,000 వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాడు. తర్వాత తాను ఇన్వెస్ట్ చేసిన డబ్బును తిరిగి చెల్లించాలని కోరగా మోసగాళ్లు స్పందించలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
పర్సు పక్కన పెట్టి క్రికెట్.. రూ. 6.72 లక్షలు గోవిందా!
ముంబై: పర్సు పక్కన పెట్టిన క్రికెట్ ఆడిన వ్యక్తి రూ. 6.72 లక్షలు పోగొట్టుకున్న సంఘటన ముంబైలో చోటుచేకుంది. దక్షిణ ముంబైలోని క్రాస్ మైదాన్‌లో క్రికెట్ ఆడేందుకు వచ్చిన 28 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ తన క్రెడిట్, డెబిట్ కార్డులు దొంగతనానికి గురై రూ. 6.72 లక్షలు పోగొట్టుకున్నారని పోలీసులు తెలిపారు. మార్చి 30 న జరిగిన ఈ సంఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్లో ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఒక అధికారి చెప్పారు. ఎలా జరిగిందంటే.. ముంబై క్రాస్ మైదాన్‌లో క్రికెట్ ఆడేందుకు వచ్చిన బాధితుడు వివేక్ దవే క్రెడిట్, డెబిట్ కార్డులు ఉన్న వ్యాలెట్, మొబైల్ ఫోన్ సహా ఇతర వస్తువులను పక్కన పెట్టి ఆటలో నిమగ్నమయ్యాడు. ఆట ముగించుకుని బోరివలికి రైలులో ఇంటికి వెళుతుండగా తన మొబైల్ ఫోన్లో బ్యాంక్ లావాదేవీ సందేశాలను గమనించాడు. వాటి ప్రకారం అతని బ్యాంక్ ఖాతా నుండి సుమారు లక్ష రూపాయలు కట్ అయ్యింది. దుండగులు అతని క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి రూ. 5 లక్షలకు పైగా కొనుగోళ్లు చేసినట్లు పోలీసు అధికారి పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ ప్రకారం, బాధితుడు మూడు గంటల పాటు క్రికెట్ ఆడుతుండగా, గుర్తు తెలియని నిందితులు అతని క్రెడిట్, డెబిట్ కార్డులను దొంగిలించారు, ఏటీఎం నుండి రూ. 1 లక్ష నగదును విత్‌డ్రా చేశారు. నాలుగు నగల దుకాణాల్లో షాపింగ్ చేశారు. దీంతో బాధితుడు ఆ నగల దుకాణాలను సంప్రదించగా వారు సీసీ ఫుటీజ్ అందించారు. నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
మాట్లాడుకుందామని పిలిచి మోడల్‌పై ఆత్యాచారం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ మోడల్‌పై జరిగిన ఆత్యాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఆత్యాచార ఘటన బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలో నివాసం ఉండే ఓ మహిళ(మోడల్)కు ముంబైకి చెందిన ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతను తన కుటుంబం సభ్యులతో కలిసి ఢిల్లీలోని ఓ వివాహ వేడుకకు హాజరవుతానని ఆమెకు ఫోన్లో సందేశం పంపాడు. అతను తన కుటుంబాన్ని ఢిల్లీలోని ఓ హోటల్లో దింపాడు. అనంతరం ఆ యువతిని తన స్నేహితుడి ఇంటి వద్ద కలుద్దామని ఫోన్లో సందేశాల ద్వారా కోరాడు. దానికి ఆమె నిరాకరించింది. దీంతో నిందితుడు తాను ఖాన్ మార్కెట్ ప్రాంతంలో ఉన్నానని కలవమని మరోసారి కోరగా.. ఆమె అక్కడికి వెళ్లింది ఇద్దరు కలిసి టిఫిన్ చేశారు. అనంతరం ఆమెకు మాయ మాటలు చెబుతూ అతడు చాణక్యపురి ప్రాంతంలోని ఉన్న మరో హోటల్‌కు తీసుకువెళ్లాడు. ఆ వ్యక్తి హోటల్ గదిలో తనపై ఆత్యాచారానికి ఒడిగట్టాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఇక ఆమె వృత్తిరీత్యా మోడల్ అని, నిందితుడు దక్షిణ ముంబైకి చెందిన వాడని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఫిబ్రవరి 23న ముంబైకి పంపినట్లు తెలిపారు. చదవండి: ఇంటి బేస్మెంట్లో ఓ పెద్ద సొరంగం -
అనుమతి లేకుండా కన్నారని కోర్టు కీడుస్తాడట..!
ముంబై : ముంబైకి చెందిన రఫేల్ సామ్యూల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. తన అనుమతి లేకుండా తనను కన్నందుకు తల్లిదండ్రులపైనే కేసు వేస్తానంటూ విచిత్ర వాదనతో ముందుకొచ్చాడు. తనను తాను యాంటీ-నటాలిస్ట్(జనాభాను తగ్గించే వ్యక్తిగా) పేర్కొన్న సామ్యూల్...‘ అన్ని దుష్పరిణామాలకు జనాభా పెరుగుదలే మూల కారణం. పిల్లల్ని కనడం ఆపండి’ అంటూ ఫేస్బుక్ పేజీలో రాసుకొచ్చాడు. అంతేకాకుండా తాను ఇలా మాట్లాడటానికి కారణాలు వివరిస్తూ ఓ యూట్యూబ్ చానల్‌కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. ‘ప్రపంచంలోని ప్రతీ వ్యక్తి తన అనుమతి, ప్రమేయం లేకుండానే భూమి మీదకి వస్తున్నాడు. తల్లిదండ్రులకు పిల్లలు, పిల్లలకు తల్లిదండ్రులు ఎప్పటికీ సొంతం కారు. పిల్లల్ని పెంచాం కదా అని తమను పోషించాలంటూ తల్లిదండ్రులు వారిని బ్లాక్మెయిల్ చేయొద్దు. అలాగే పిల్లలు కూడా నిజంగా, నిస్వార్థంగా సేవ చేయాలనుకున్నపుడు మాత్రమే అమ్మానాన్నలను చేరదీయాలి. అంతేతప్ప మొహమాటానికి నాటకాలు ఆడాల్సిన పనిలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు తాను కేసు వేస్తానని చెప్పినపుడు మొదట తల్లిదండ్రులు వ్యతిరేకించారని, అయితే ప్రస్తుతం తల్లి మాత్రం తనను అర్థం చేసుకుందని పేర్కొన్నాడు. అసలు ఎవరో కోరుకున్నారని పిల్లలకు జన్మనివ్వడం తప్పని, జీవితం సవాళ్లతో కూడుకున్నది కాబట్టి.. జనాభా నియంత్రణను పోత్సహించడమే తన లాంటి యాంటి నటాలిస్టుల ఎజెండా అని వ్యాఖ్యానించాడు. కాగా రఫేల్ సామ్యూల్ వాదనను కొంతమంది నెటిజన్లు సమర్థిస్తుండగా.. మరికొంత మంది మాత్రం ఇదేమీ చోద్యం అంటూ విమర్శిస్తున్నారు. జనాభాను నియంత్రించాలంటే ఇంతకంటే వేరే మార్గం కనిపించలేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
నీకిదే సరైన శిక్ష.. రోజంతా ఇక్కడే కూర్చో..!!
సాక్షి, ముంబై : పన్నెండేళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి ముంబై క్రిమినల్ కోర్టు అనూహ్యమైన శిక్ష విధించింది. పోక్సో చట్టం కింద రూ.30 వేల జరిమానాతోపాటు రోజంతా కోర్టు రూమ్‌లోనే కూర్చోవాలని ఆదేశించింది. క్రిమినల్ కేసుల్లో అతి తక్కువ శిక్షాకాలం కలిగిన కేసుల్లో ఇదొకటి కావడం విశేషం. వివరాలు.. ఎదురింట్లో ఉండే బాలికతో అరవింద్ కబ్‌దేవ్ కామత్ (29) అనే వ్యక్తి అశ్లీలంగా ప్రవర్తించాడు. నగ్నంగా నిల్చుని కిటీకీలోనుంచి ఆమెకు సైగలు చేశాడు. ఈ ఘటన 2015లో జరగగా గోవాదేవి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. విచారించిన ముంబై న్యాయస్థానం .. ‘కోర్టు ఉదయించేవరకు ఇక్కడే కూర్చో. వచ్చిపోయేవాళ్లంతా నీఘనకార్యం గురించి ముచ్చటించాలి’ అని వ్యాఖ్యానించింది. పోక్సో (లైంగిక నేరాల నుంచి చిన్నారుల రక్షణ చట్టం) లోని సెక్షన్ 12 కింద కామత్‌ను దోషిగా తేలుస్తూ.. ఒక రోజు ‘కోర్టు శిక్ష’,తో పాటు రూ. 30 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మూడు నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. -
మరో భారీ స్కాం : హవాలా కింగ్ అరెస్ట్
ముంబై : మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందిన ఓ హవాలా కింగ్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మహ్మద్ ఫరూక్ అలియాస్ ఫరూక్ షేక్ అనే వ్యక్తి దాదాపు రూ.2,253 కోట్ల మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణల నేపథ్యంలో ఇతన్ని అధికారులు అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్ నివారణ చట్టం కింద ఫరూక్‌ను అధికారులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. కోట్ల కొద్దీ ఈ రూపాయలను నకిలీ దిగుమతి డాక్యుమెంట్ల ద్వారా విదేశాలకు తరలించడానికి ఫరూక్ 13 కంపెనీలను వాడినట్టు ఈ ఫైనాన్సియల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వెల్లడించింది. 2015-16లో రూ.2,253 కోట్లగా ఉన్న ఈ రెమిటెన్స్, ప్రస్తుతం రూ.10వేల కోట్లను దాటిపోయినట్టు కూడా ఈడీ అంచనావేస్తోంది. 2015-16లో ఈ 13 కంపెనీలు బ్యాంకులకు నకిలీ డాక్యుమెంట్లను సమర్పించి, రూ.2,253 కోట్ల నగదును విదేశాలకు పంపించాయని ఈడీ పేర్కొంది. అయితే ఎంట్రీలో నమోదు చేసిన అసలు బిల్లులు, విలువ, ఆ ఉత్పత్తుల పరిమాణం చూసుకుంటే అవి రూ.24.6 కోట్లేనని తేలింది. ఈ 13 సంస్థలకు కూడా నకిలీ అడ్రస్‌లు, డమ్మీ వ్యక్తులే బోర్డు డైరెక్టర్లగా ఉన్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ సంస్థల ద్వారా ఫరూక్ మొత్తం 135 బ్యాంకు అకౌంట్లను తెరిచినట్టు అధికారులు తెలిపారు. అయితే ఆ 13 సంస్థలతో తనకేమీ సంబంధాలు లేనట్టు ఫరూక్ చెబుతున్నాడు. అతన్ని ఏప్రిల్ 26 వరకు ఈడీ తన కస్టడీలోకి తీసుకుంది. ఈ స్కాంను సీబీఐ గత మేలో వెలుగులోకి తీసుకొచ్చింది. ఫారిన్ ఎక్స్చేంజ్ స్కాండల్‌గా దీన్ని పేర్కొంది. ఈ స్కాంలో ఫరూక్ ప్రమేయమున్నట్టు ఈ మధ్యనే తేలింది. ఈ కేసు కోసం 149 బ్యాంకు ఖాతాలను పరిశీలించిన సమయంలో ఫరూక్ మూడు మొబైల్ నంబర్లను ఉపయోగించినట్టు తెలిసింది. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అతన్ని విచారించింది. కానీ వారి విచారణకు ఫరూక్ సహకరించకపోవడంతో, ఏజెన్సీ అతన్ని అరెస్ట్ చేయాలని భావించింది. ఈ స్కాంలో కెనారా బ్యాంకు, స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్, కార్పొరేషన్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు అధికారులకు భాగమున్నట్టు సీబీఐ ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేసింది. -
22 కొవ్వొత్తుల వెలిగించి..అమాంతం నోట్లోకి..
-
తన కారుపై కుక్క మూత్రం పోసిందని!
-
తన కారుపై కుక్క మూత్రం పోసిందని!
నోరులేని మూగ జీవాలపై మనుషుల అమానుష దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటికిమొన్న హైదరాబాద్‌లో ఓ కిరాతకుడు కుక్కను చంపి.. దానిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఇద్దరు మెడికల్ విద్యార్థులు కుక్కను బంగ్లా మీద నుంచి కిందకు విసిరేసి.. ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇటీవల కొందరు పిల్లలు సరదా కోసం కుక్క తోక పట్టుకొని గిరగిరా తిప్పి విసిరేశారు. తాజాగా ఇదేరీతిలో ముంబైకి చెందిన ఓ వ్యక్తి శునకంపై దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఖరీదైన తన కారుపై వీధి కుక్క మూత్రం పోసిందని.. అది పడుకున్న సమయంలో దానిపైనుంచి పోనిచ్చాడు. దీంతో తీవ్రగాయపడిన కుక్క బాధతో విలవిలలాడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలు, వివరాలను తాజాగా ‘ఫీడ్ ఏ స్ట్రే. ఎవ్రీడే’ ఫేస్బుక్ పేజీ వెలుగులోకి తెచ్చింది. వెంటనే ఈ పోస్టు వైరల్‌గా మారిపోయింది. ముంబైకి చెందిన సౌరబ్ దుఖాండే అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు ఈ ఫేస్బుక్ పేజీ వెల్లడించింది. ‘సిగ్గులేని వ్యక్తి.. అమాయకమైన జీవులపై మనుషులు ఇంత క్రూరంగా ఎలా ఉండగలరు. తన కారుపై మూత్రం పోసిందనే కారణంగా పగ దీర్చుకోవాలని ఈ కుక్కపిల్ల పడుకొని ఉన్న సమయంలో దానిపై నుంచి కారును పోనిచ్చాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాడు చేసినా పట్టించుకోలేదు’ అని ఈ ఫేస్బుక్ పేజీ యూజర్ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే, ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన తర్వాత పోలీసులు నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని మరో నెటిజన్ తెలిపారు. -
‘అందరూ నన్ను అనుమానంగా చూస్తున్నారు’
ముంబై: తాను తీవ్రవాదిని కాదని చెప్పాలంటూ ముంబైలో ఓ వ్యక్తి ప్లకార్డు పట్టుకుని పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించాడు. వాట్సాప్ లో తనపై తీవ్రవాది ముద్ర వేశారని వాపోయాడు. తనను తీవ్రవాదిగా పేర్కొంటూ వాట్సాప్ లో పోస్టు చేసిన మెసేజ్ లు, ఫొటోలు పోస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విరార్ పోలీస్ స్టేషన్ లో సయీద్ అలీ ఖాన్(30) అనే వ్యక్తి మంగళవారం ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. మొదట ఖాన్ ఫిర్యాదును స్వీకరించేందుకు పోలీసులు నిరాకరించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేయడంతో ఫిర్యాదు నమోదు చేశారు. ఈ సందర్భంగా ‘నా పేరు సయీద్ అలీ ఖాన్. నేను తీవ్రవాదిని కాదు’ అని రాసున్న ప్లకార్డులు ప్రదర్శించారు. విరార్ లోని గోపచద్ పాడా ప్రాంతంలో ఖాన్ నివసిస్తున్నాడు. తన ఇంటి యజమాని అదనంగా రూ. 2 వేలు డిమాండ్ చేశాడని, ఇవ్వకపోవడంతో తాను తీవ్రవాది అంటూ వాట్సాప్ లో ప్రచారం చేస్తున్నాడని వాపోయాడు. తనను పట్టుకుని పోలీసులకు అప్పగించాలని రాశాడని చెప్పాడు. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, అందరూ తనను అనుమానంగా చూస్తున్నారని పోలీసులకు ఖాన్ తెలిపాడు. -
భారత్‌పైకి ఏలియన్స్ దండయాత్ర!?
మీరు నమ్మండి.. నమ్మకపోండి. కానీ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా ప్రభుత్వానికి అందే వేలాది ప్రశ్నల్లో.. ప్రజలకు ఉపయోగపడేవి.. సమాచారాన్ని ఇచ్చేవే కాదు.. ప్రభుత్వ అధికారులను తికమక పెట్టే వికృతమైన వెర్రీమొర్రి ప్రశ్నలు కూడా ఎన్నో ఉంటున్నాయి. రామ్‌లీలా నాటకంలో ప్రధాని మోదీ నటించారా? మహాత్మాగాంధీ ఐక్యూ ఎంత? దేశంలోని పచ్చగా ఉన్న చెట్లు ఎన్ని, ఎండిపోయినవి ఎన్ని? రాఖీపూర్ణిమ సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బూష్‌కు పంపిన లడ్డూలు ఎందుకు వెళ్లలేదు? ఇలాంటి వెర్రి ప్రశ్నలెన్నో ఆర్టీఐ ద్వారా ముందుకొచ్చాయి. కానీ తాజాగా ఆర్టీఐ ద్వారా తెరపైకి వచ్చిన ప్రశ్న మాత్రం ఈ వెర్రి ప్రశ్నల్లోనే మహా వెర్రి ప్రశ్న అని చెప్పవచ్చు. ఎందుకంటారా? ముంబైకి చెందిన అజయ్ కుమార్‌కు ఒక డౌటు వచ్చింది. దేశం మీద ఒక్కసారిగా గ్రహాంతర వాసులు, జాంబీలు, మానవాతీత శక్తులు దండయాత్రకొస్తే.. దానిని ఎదుర్కొనేందుకు మోదీ ప్రభుత్వం సన్నద్ధంగా ఉందా? అంటూ ఆయనకు సందేహం వచ్చింది. దీంతో వెంటనే ఆర్టీఐ ద్వారా ఓ ప్రశ్నాస్త్రాన్ని ఆయన కేంద్ర ప్రభుత్వానికి సంధించారు. ’గ్రహాంతర వాసులు, జాంబీలు, మానవాతీత శక్తులు దేశంపై దండయాత్రకు వస్తే ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందా?.. ఈ అంశం నన్ను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రిత్వశాఖ నాకు చెప్పాలి. ప్రభుత్వం వాటిని ఓడించడానికి ఏం చేయబోతున్నది? విల్ స్మిత్ లేకుండా మనం వాటిని ఎదర్కోగలమా?’ అంటూ ఆయన ప్రశ్నించాడు. 1996నాటి సైన్స్-ఫిక్షన్ హాలీవుడ్ సినిమా ’ఇండింపెండెన్స్ డే’ సినిమాలో విల్ స్మిత్ ఎలియన్స్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. అందుకే ఆయన సాయం తీసుకోమంటూ ఉదారంగా సలహా కూడా ఇచ్చాడు. తాజాగా ట్విట్టర్ లో జర్నలిస్టు అభిమాన్యు ఘోషల్ పెట్టిన ఈ ఆర్టీఐ ప్రశ్న ఫొటోకాపీ వైరల్ గా మారిపోయింది. -
షాకింగ్ న్యూస్
-
షాకింగ్ న్యూస్
ముంబై: షాకింగ్ న్యూస్. ముంబైలో ఓ వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన ఐదుగురు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరడానికి వెళ్లినట్టు సమాచారం. కేరళ నుంచి అదృశ్యమైన పది మంది ఐసిస్ లో చేరినట్టు అనుమానాలు బలపడుతుండగా తాజాగా వెలుగు చూసిన ఉదంతం మరింత భయాందోళన కలిగిస్తోంది. వ్యాపారవేత్త అబ్దుల్ మజీద్ కుమారుడు అష్ఫాక్ అహ్మద్ తన భార్య, బిడ్డను తీసుకుని పశ్చిమాసియాకు వెళ్లిపోయాడు. మరో ఇద్దరు సోదరులు అతడితో కలిశారని 'టైమ్స్ ఆఫ్ ఇండియా' వెల్లడించింది. 26 ఏళ్ల అష్ఫాక్ తన భార్యాబిడ్డ, సోదరులు మహ్మద్ సిరాజ్(22), ఇజాజ్ రెహ్మాన్(30)లతో పాటు ఈ ఏడాది జూన్ లో దేశం విడిచిపెట్టి ఐసిస్ లో చేరడానికి వెళ్లాడని తెలిపింది. సిరాజ్, వ్యాపారవేత్త కాగా, రెహ్మాన్ మెడికల్ ప్రాక్టిషినర్ గా పనిచేశాడు. తామంతా ఐసిస్ లో చేరడానికి వెళ్లినట్టు అష్ఫాక్ తన తమ్ముడికి మెసేజ్ పంపాడు. తన కుటుంబ సభ్యుల అదృశ్యంపై అబ్దుల్ మజీద్ ఆగస్టు 6 పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడు ఐసిస్ లో చేరడానికి ఇస్లాం మతబోధకుడు మహ్మద్ హనీఫ్ కేరళకు చెందిన స్కూల్ టీచర్ అబ్దుర్ రషీద్, నవీ ముంబైకి చెందిన ఆర్షీ ఖురేషీ, కళ్యాణ్ ప్రాంతవాసి రిజ్వాన్ ఖాన్ కారణమని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ముంబై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హనీఫ్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.