Mumbai Municipal Corporation (MCGM)
-
‘మిషన్–ముంబై’ ఘరూ
సాక్షి, ముంబై: జనవరి చివర లేదా ఫిబ్రవరిలో మొదటి వారంలో జరగనున్న ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం రాష్ట్రంలోని అన్ని పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ‘మిషన్–ముంబై’ పేరుతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నా యి. రోజురోజుకి మారుతున్న రాజకీయ పరిణామాలపై దృష్టి కేంద్రికరించిన పార్టీలు పరిస్థితులకు అనుగుణంగా మారుతున్నాయి. ముఖ్యంగా పార్టీలని బలోపేతం చేయడంతో పాటు ప్రజాదారణ పొందేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. అదే విధంగా కొన్ని పార్టీలైతే అంతర్గత విబేధాలు, సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు మార్పులు చేర్పులు చేపట్టాలని భావిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల మహావికాస్ ఆఘాడి (ఎంవీఏ) ప్రభు త్వం కొనసాగుతోంది. దీంతో ఇటీవలే జరిగిన విధాన మండలి ఎన్నికల్లో మహావికాస్ ఆఘాడిలోని పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఎన్నికల ఫలితాలు కూడా వీరికి అనుకూలంగా వచ్చాయి. ఈ నేపథ్యంలో రాబోయే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక లు రసవత్తరం గా మారనున్నా యని చెప్ప వచ్చు. ముంబై లో శివసేన, బీజేపీలు కలిసి పోటీ చేయడం తో పాటు అనేక ఏళ్లుగా ముంబై కార్పొరేషన్లో శివసేన అధికారంలో ఉంది. మేయర్ శివసేన అభ్యర్థి ఉండగా డిప్యూటీ మేయర్‌గా బీజేపీ అభ్యర్థి కొనసాగుతున్నారు. చదవండి: (నిన్ను చంపేస్తాం..) ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైన మహావికాస్ ఆఘాడిని ముఖ్యంగా శివసేనకు గట్టి పోటీ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. మరోవైపు పట్టును నిలుపుకోవాలని సేన భావిస్తుండగా తమ బలాన్ని పెంచుకునేందుకు కాంగ్రెస్, ఎన్సీపీలు పనిచేస్తున్నాయి. మహావికాస్ ఆఘాడి లో ఔరంగాబాద్ పేరును సంభాజీనగర్‌గా మార్చే అంశంపై రగడ కొనసాగుతోంది. పేరును మార్చేందుకు శివసేన భావిస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రాబోయే ముంబై మున్సిపల్ ఎన్నికల్లో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కలిసి పోటీ చేస్తా యా లేదా అనేది చూడాల్సిందే. ఎన్సీపీ ముంబై మున్సిపల్ కార్పొరేన్ ఎన్నికల కోసం ఎన్సీపీ కూడా అన్ని విధాల సిద్ధమవుతోంది. వీలైతే మహావికాస్ ఆఘాడిగా కలిసి పోటీ చేయాలని లేదంటే ఒంటరి పోరుకు కూడా సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తోంది. ఇటీవలే ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయనున్నట్టు సంకేతాలిస్తోందని, తాము కూడా ఒంటరి పోరుకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలిచ్చారు. అయితే ఈ విషయంపై ఇంకా ఎ లాంటి స్పష్టత రాలేదు. చదవండి: (జలేబీ ఫాఫడా.. ఉద్ధవ్ ఆపడా!) బీజేపీ... 2022లో జరగబోయే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అంతర్గత విబేదాలకు తావులేకుండా జాగ్రత్తపడుతోంది. ఇటీవలే ముంబైలో బీజేపీ కోర్ కమిటి సమావేశం నిర్వహించింది. ఇందులో గ్రామ పంచాయితీ ఎన్నికలు, రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై చర్చలు జరిపారు. ఈ సమావేశాల్లో ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో తమ బలాన్ని పెంచుకోవడం కోసం పలువురు నేతలకు బాధ్యతలను అప్పగించినట్టు తెలిసింది. ఇప్పటికే పలుమార్లు ముంబైలో ఈసారి అధికారం మాదే అంటూ దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటిస్తూ వస్తున్నారు. శివసేన.. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై దృష్టి కేంద్రికరించిన శివసేన కూడా మిషన్–ముంబై కోసం పావులు కదుపుతోంది. ముఖ్యంగా పేరు మార్పు అంశంపై కాంగ్రెస్, శివసేనల మధ్య విబేధాలు ఏర్పడ్డాయి. బీజేపీకి కొంత అనుకూలంగా ఉన్న ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. గుజరాతీ ఓటర్లను ఆకట్టుకునేందుకు జనవరి 10వ తేదీన గుజరాతి సమ్మేళనం నిర్వహించనుంది. ఇందుకోసం ‘ముంబై మా జలేజీ ఫాఫడా.. ఉదవ్ ఠాక్రే ఆపడా..’ అనే నినాదంతో గుజరాతీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ బాధ్యతలను శివసేన పదాధికారి హేమరాజ్ షాకు అప్పగించారు. కాంగ్రెస్... మిషన్–ముంబై కోసం కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఔరంగాబాదు పేరు మార్పు అంశంపై విబేధాలు కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ నాయకులు బాలాసాహెబ్ థోరాత్తోపాటు భాయి జగ్తాప్‌లు ఇప్పటికే పలుమార్లు ముంబైలో తాము ఒంటరిగానే బరిలోకి దిగనున్నట్టు చెబుతూ వస్తున్నారు. మరోవైపు ఈ ఎన్నికల కోసం అన్ని విధాల సిద్ధంగా ఉండాలంటూ అన్ని ప్రయాత్నాలను కాంగ్రెస్ ప్రారంభించింది. కొత్త సమీకరణాలు.. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొత్త రాజకీయ సమీకరణాలు కనిపించే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు కలిసికట్టుగా పోటీ చేసిన శివసేన, బీజేపీలు రాబోయే ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయనున్నారు. మరోవైపు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కూడా కలిసి పోటీ చేసే అవకాశాలున్నాయి. ఇదిఇలాఉండగా మరోవైపు ఈ మూడు పార్టీలు కలిస్తే వీరిని అడ్డుకునేందుకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్)తో బీజేపీ చేతులు కలిపే అవకాశాలున్నాయి. దీనిపై ఇప్పటికే వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే స్థానికుల అంశంపై ఎమ్మెన్నెస్ పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై పట్టుసడలిస్తే వీడితే ఎమ్మెన్నెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు బీజేపీ చెబుతోంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో వీరిద్దరు ఒక్కటవుతారా లేదా అన్ని పార్టీలు ఒంటరిగానే బరిలోకి దిగనున్నాయా అనేది వేచి చూడాల్సిందే. -
జలేబీ ఫాఫడా.. ఉద్ధవ్ ఆపడా!
సాక్షి, ముంబై: వచ్చే సంవత్సరం జరగబోయే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం శివసేన సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా గుజరాతీ ఓటర్లను ఆకట్టుకునేందుకు జనవరి 10వ తేదీన గుజరాతి సమ్మేళనం నిర్వహించనుంది. ఇందుకోసం ‘ముంబై మా జలేబీ ఫాఫడా... ఉద్దవ్ ఠాక్రే ఆపడా...’ అన్న హెడ్డింగుతో ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో ముంబైలో నివసించే గుజరాతీల కోసం ప్రత్యేకంగా జోగేశ్వరీలో సమ్మేళనం నిర్వహించనున్నట్టు ప్రకటించింది. వచ్చే ఏడాదిలో ఎన్నికలు.. 2022 జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ముంబై, థానేతోపాటు మొత్తం 10 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటివరకు బీజేపీతో కలిసి పోటీ చేసిన శివసేన అసెంబ్లీ ఎన్నికల అనంతరం తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలో కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో ఈసారి ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో పాగా వేసేందుకు బీజేపీ అన్ని విధాల ప్రయత్నిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో తన పట్టును నిలుపుకునేందుకు శివసేన కూడా ప్రయత్నాలు ప్రారంభించింది. చదవండి: (6 నెలల గరిష్టానికి నిరుద్యోగం) ఇందులో భాగంగానే గుజరాతీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ విధంగా గుజరాతీ బాంధవుల కోసం సమ్మేళనం నిర్వహించాలని శివసేన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమ్మేళనంలో 100 మంది గుజరాతీ బాంధవులు శివసేనలో ప్రవేశించనున్నట్టు ప్రాథమికంగా తెలిసింది. శివసేన పదాధికారి హేమరాజ్ షాకు గుజరాతీలను శివసేన వైపు మళ్లించే బాధ్యతలను అప్పజెప్పింది. ఈ విషయంపై గుజరాతీతోపాటు మరాఠీలో ఓ ప్రకటనను విడుదల చేసింది. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిత్య ఠాక్రే పోటీ చేసిన వర్లీ నియోజకవర్గంలో కూడా ఆ సమయంలో ‘కేమ్ చో వర్లీ’ అనే గుజరాతీ బ్యానర్లతోపాటు తెలుగు, ఇతర భాషల బ్యానర్లు అంటించడం జరిగింది. ఆ సమయంలో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అయితే ఈసారి ఈ బ్యానర్ ఏర్పాటు చేసిన ఫలితం శివసేనకు ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా లభించే అవకాశాలున్నాయి. ఎలాగైన గుజరాతీ ఓటర్లను దక్కించుకుని ముంబైలో తన పట్టును నిలుపుకునేందుకు అన్ని విధాలుగా శివసేన ప్రయత్నించనుంది. మరోవైపు ఈ విషయంపై బీజేపీ మాత్రం ఇది ఎన్నికల స్టంట్‌గా పేర్కొంటోంది. ఎన్నికల సమయంలోనే ఇలాంటివన్నీ శివసేనకు గుర్తుకు వస్తాయంటూ ఆరోపనలు బీజేపీ గుప్పిస్తోంది. ‘‘ముంబై అల్లర్ల సమయంలో శివసేన వ్యవస్థాపకుడు, దివంగత బాలసాహెబ్ ఠాక్రే ఎలా సాయం చేశారో మొత్తం గుజరాతీ సమాజానికి తెలుసు. కొత్త తరానికి దీని గురించి చెప్పాల్సిన అవసరం ఉంది, అందువల్ల మేం ఈ గుజరాతీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ‘అని శివసేన నాయకుడు, సమావేశ నిర్వాహకుడు హేమరాజ్ షా అన్నారు. 2022 ఫిబ్రవరిలో ఎన్నికలు పూర్తిగా భిన్నమైన వాతావరణంలో జరుగుతాయని సేన పేర్కొంది. ఉద్ధవ్ ప్రభుత్వం విఫలం: రామ్ కదం బీజేపీ నాయకుడు రామ్ కదం మాట్లాడుతూ.. కరోనాని సమర్థవంతంగా ఎదుర్కొవడంలో శివసేన నేతృత్వంలోని ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ముంబై, మహారాష్ట్రలు దేశంలోనే అత్యధిక కేసుల్లో అగ్రస్థానంలో ఉన్నాయని మండిపడ్డారు. అత్యధిక మరణాలూ ఇక్కడే ఉన్నాయని అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారనేదానికి దేశం మొత్తం సాక్ష్యంగా ఉందని రామ్ కదం విమర్శలు గుప్పించారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే పెద్ద ప్యాకేజీ ఇస్తానని ప్రకటించారని, కానీ, అది ఎప్పడు ఇస్తారోనని, అసలు అది నిజమసన ప్రకటనా అని ప్రశ్నించారు. కరోనా సమయంలో ప్రజలు ఎలా మనుగడ సాగిస్తారో ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ పంపిన ఆహార ధాన్యాలు ప్రజలకు ఆలస్యంగా పంపించారని మండిపడ్డారు. మహారాష్ట్రలో తుఫానులు సంభవించాయని, అయితే రైతులకు నష్టపరిహారం అందడం లేదని రామ్ కదం ఉద్ధవ్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. -
హైదరాబాద్ ఫలితాలతో నూతనోత్తేజం!
సాక్షి ముంబై: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో లభించిన మంచి ఫలితాలతో ఒక్కసారిగా మహారాష్ట్ర బీజేపీలో కూడా నూతన ఉత్తేజం నిండింది. దీంతో రాబోయే బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల్లో కూడా బీజేపీదే పైచేయి అవుతుందన్న ధీమాను ఆ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే రామ్ కదం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బిహార్‌లో బీజేపీ విజయం సాధించింది. దేశవ్యాప్తంగా చర్చల్లోకెక్కిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 4 సీట్లు ఉన్న బీజేపీ 48 సీట్లను కైవసం చేసుకుని హైదరాబాద్‌లో పాగా వేసింది. అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్తోపాటు ఎంఐఎంకు గట్టి పోటీ నిచ్చి బీజేపీ తన సత్తాను చాటుకుంది. దీంతో ముంబైతోపాటు మహారాష్ట్ర బీజేపీలో నూతన ఉత్తేజం నిండింది. ఇదే ఉత్తేజాన్ని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వరకు కొనసాగుతుందని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో బీజేపీ తన జెండా ఎగురవేస్తుంది’’ అని రామ్ కదం పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఎంసీలో బీజేపీదే అధికారంలోకి వస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. మరోవైపు బీఎంసీని కైవసం చేసుకునేందుకు ‘మిషన్ ముంబై’ ప్రారంభించినట్లు ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ముంబైలోని బీజేపీ కార్యకర్తలు ఇప్పటి నుంచే బీఎంసీ ఎన్నికల కోసం సిద్దమవుతున్నట్టు తెలిసింది. చదవండి: (రజనీ వెనుక కాషాయం!) అధినాయకత్వమే దిగినవేళ.. హైదరాబాద్ ఎన్నికల్లో హిందు–ముస్లిం అంశం ప్రధానంగా ఉండేలా బీజేపీ ప్రయత్నించినట్లు కన్పించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని హామీ ఇవ్వడం, ఎంఐఎం స్పందించడం తదితరాలతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చల్లో కెక్కాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ఎన్నికల్లో ప్రచారం చేసి తన ముద్రను వేసుకున్నారు. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇలా బీజేపీ తన పూర్తి బలాన్ని వినియోగించింది. దీంతో హైదరాబాద్‌లో అధికార పార్టీ తెరాసకు తీవ్ర నష్టం వాటిల్లింది. 48 స్థానాలు దక్కించుకుని హైదరాబాద్‌లో రెండో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ఇదే మాదిరిగా రాబోయే బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ ప్రచారం చేసి మెజార్టీ సీట్లు కైవసం చేసుకునేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు సమాచారం. చదవండి: (హైదరాబాద్ ఫలితాలతో నూతనోత్తేజం!) హిందుత్వ కార్డు పనిచేస్తుందా? హైదరాబాద్‌లో నడిచిన హిందుత్వం కార్డు ముంబైలో ఎంత వరకు ప్రభావం చూపనుందనేది ప్రశ్నార్థకమే. హిందుత్వం అంశంపై శివసేనపై బీజేపీ విమర్శలు గుప్పించవచ్చు కానీ, మిగతా అంశాలను కూడా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. దీంతో మరింత పక్కా ప్రణాళికను రూపొం దించాలని కమలం పార్టీ భావిస్తోంది. అదేవిధంగా ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసేందుకు అన్ని జాగ్రత్తలు ఇప్పటి నుంచి తీసుకుంటోంది. రాష్ట్రంలో జరిగిన పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో బీజేపీకి షాక్ నిస్తూ నాగ్‌పూర్, పుణే, ఔరంగాబాద్ మొదలగు పెట్టనికోటగా ఉన్న స్థానాలను బీజేపీ కోల్పోయింది. మహావికాస్ ఆఘాడీ ఐక్యతతో పోరాడటంతో బీజేపీపై విజయం సాధించగలిగారు. ఇలాటి నేపథ్యంలో బీఎంసీలో కూడా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు ఒక్కటిగా మహావికాస్ ఆఘాడిగానే పోటీ చేయాలని భావిస్తున్నాయి. 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే రెట్టింపు బలంతో బీజేపీకి ఎన్నికల బరిలోకి దిగాల్సి రానుంది. బీఎంసీ ఎన్నికల్లో మహావికాస్ ఆఘాడీని అడ్డుకోవడంలో బీజేపీ ఎంత వరకు సఫలీకృతం కానుందని రాబోయే రోజుల్లో స్పష్టం కానుంది. -
క్యాంపాకోలా కూల్చివేత చిత్రీకరణ
అడ్డుకునేవారిపై చర్యలు తీసుకునేందుకే.. ముంబై: క్యాంపాకోలా విషయంలో ముంబై మహానగర పాలక సంస్థ(ఎంసీజీఎం) మరింత పట్టుదలగా వ్యవహరిస్తోంది. ఈ నెల 20 నుంచి అక్రమ నిర్మాణాల కూల్చివేతను ప్రారంభిస్తామని ఇదివరకే నోటీసులు జారీ చేసిన ఎంసీజీఎం కూల్చివేత సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎలా అధిగమించాలనే విషయంపై దృష్టి సారించింది. తమ నివాసాలను కూల్చివేసేందుకు వస్తే అడ్డుకోవాలని ఇప్పటికే క్యాంపాకోలా వాసులు తీర్మానించుకోవడం తెలిసిందే. అయితే అడ్డుకునేందుకు వారు ప్రయత్నిస్తే అందుకు తగిన సాక్ష్యాధారాలు సేకరించి, అడ్డుకున్నవారిపై చర్యలు తీసుకునేలా ఎంసీజీఎం వ్యూహరచన చేస్తోంది. కూల్చివేత సమయంలో వీడియో ద్వారా చిత్రీకరించాలని, ఒకవేళ ఎవరైనా అడ్డుపడితే అందుకు సాక్ష్యాధారాలు ఉంటాయని, వారిపై చర్య తీసుకోవడం సులభమవుతుందని ఎంసీజీఎం భావిస్తోంది. ఈ విషయమై అదనపు మున్సిపల్ కమిషనర్ మోహన్ అద్తానీ మాట్లాడుతూ... ‘కూల్చివేత ప్రక్రియ మొత్తాన్ని వీడియో కెమెరాలతోచిత్రీకరించాలని నిర్ణయించాం. జూన్ 20 నుంచి కూల్చివేత ప్రక్రియ ప్రారంభం కానుండడంతో సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఎవరైనా అడ్డుపడితే వారు వీడియో కెమెరాలకు చిక్కాల్సిందే. అలా చిక్కినవారిపై కోట్టు ధిక్కారం కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. ముందుగా అక్రమ భవనాలకు విద్యుత్, గ్యాస్, నీటి సరఫరాను నిలిపివేస్తాం. రెండో దశలో భవనంలోపలి ఫ్లాట్ల కూల్చివేత ప్రక్రియను ప్రారంభిస్తాం. ఆ తర్వాత బాల్కనీలను కూల్చివేసే పనులు మొదలు పెడతాం. నిజానికి మంగళవారం నుంచే కూల్చివేత ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంది. అయితే మానవీయ కోణంలో ఆలోచించి మరో రెండ్రోజులు సమయమిచ్చాం. ఈలోగా కూడా ఖాళీ చేయకపోతే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంద’న్నారు.