ముంబైలోని లోఖండ్ వాలాలో అగ్నిప్రమాదం
ముంబయి: వరుసగా ముంబైలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్న ముంబయిలోని భీవాండి ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదం మరిచిపోక ముందే ఇవాళ లోఖండ్ వాలా ప్రాంతంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. 13అంతస్తుల నివాస సముదాయం రహేజా క్లాసిక్ భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. నాలుగు ఫైర్ ఇంజిన్లతో పాటు మూడు వాటర్ ట్యాంకర్లతో మంటలను ఆర్పుతున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.