ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారు..
మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ మహాధర్నా
హిందూపురం అర్బన్ :
అభ్యదయవాదినని చెప్పుకొంటున్న ముఖ్యమంత్రి చంద్రాబాబునాయుడు తన బావమరిది బాలకృష్ణ ప్రాతి నిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ప్రజాప్రతినిధుల హక్కులను కాలరాస్తున్నా పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీ పీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ మండిపడ్డారు. ప్రజాసమస్యల పరిష్కారంలో వివక్ష చూపుతూ, ప్రోటోకాల్ ను విస్మరించిన అధికార పార్టీ తీరుపై వైఎస్సార్సీపీ నేతలు నిరసన వ్యక్తం చేశా రు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ నాయకత్వంలో వైఎస్సాఆర్సీపీ కౌన్సిలర్లు, ఆయా వార్డుప్రజలతో కలిసి భారీ ర్యాలీగా తరలివచ్చి మున్సిప ల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. శంకర్‌నారాయణ మాట్లాడుతూ పురం నియోజకవర్గంలో ధృతరాష్ట్ర పాలన సాగుతోందన్నారు. టీడీపీ ప్రభుత్వం అరాచకపాలన సాగిస్తోందన్నారు. సంక్షే మ పథకాలన్నీ పచ్చ చొక్కాల పరమవుతున్నాయన్నారు. చౌకదుకాణాలు, మ ధ్యాహ్న భోజన ఏజెన్సీలు, రేషన్‌కార్డు లు, పింఛన్లు, తదితర సంక్షేమ పథకాలు తెలుగుతమ్ముళ్లకు పంపిణీ చేస్తున్నారన్నా రు. అధికారులు కూడా అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా కాకుండా ప్రజ ల పక్షాన నిలవాలన్నారు. నిష్పక్షపాతం గా ఉన్న అధికారులకు వైఎస్సాఆర్సీపీ అండగా నిలుస్తుందన్నారు. సమన్వయక ర్త నవీన్‌నిశ్చల్ మాట్లాడుతూ ప్రజా తీ ర్పుపై తమకు ఎంతో గౌరవముందన్నా రు. మున్సిపల్ చైర్పర్సన్ రెవెళ్ల లక్ష్మి ఆదర్శవంతంగా ఉన్నా, ఆమె భర్త నాగరాజు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారన్నారని ఆరోపించారు. ప్రోటోకాల్ పాటించకుండా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ఆయ న అవమానపరచడం ఏమిటని నవీన్‌నిశ్చల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్య అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెత్తనం చెలాయించాలనుకోవడం సిగ్గుచేటన్నారు. దు కాణంలో పనిచేస్తూ అశ్లీల చిత్రాల క్యాసె ట్లు విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ డం, కోర్టు రిమాండ్ విధించడం ఆయన మరచిపోయినా ప్రజలు మరచిపోలేదన్నారు. గత చరిత్రను మరచి పోయి అధికారం ఉందని కక్ష్యలు, వర్గ,రాజకీయ వి బేధాలకు ఆయన అజ్యంపోస్తున్నారన్నా రు. వీటిని అడ్డుకోడానికి ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నామన్నారు. అయినా ప్రవర్తన మార్చుకోకపో తే ప్రజాందోళనలు ఉధృతం చేసి కార్యాలయాలను, ఇళ్లను ముట్టడిస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సాఆర్సీపీ కౌన్సిల ర్లు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.