Munnam abphayap
-
ఎంటర్టైనింగ్.. ఎంగేజింగ్
కార్తీక్ ఆనంద్, డింపుల్, షాలినీ, మున్నా, అపూర్వ ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘యురేక’. కార్తీక్ ఆనంద్ దర్శకత్వంలో ప్రశాంత్ తాత, లలితకుమారి నిర్మిస్తోన్న ఈ సినిమా చివరి షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు కార్తీక్ ఆనంద్ మాట్లాడుతూ –‘‘ఈ చిత్రానికి కథే బలం. యూత్‌ఫుల్ ఎంటర్టైనింగ్, ఎంగేజింగ్ థ్రిల్లర్‌గా ఉంటుంది. కాలేజ్ ఫెస్ట్ నేపథ్యంలో జరిగే కథ ఇది. యురేక అంటే ఓ కొత్త విషయాన్ని కనిపెట్టడం ద్వారా వచ్చే హ్యాపీనెస్.మా సినిమాలో అదేంటన్నది సస్పెన్స్’’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ –‘‘మా చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అవుట్‌పుట్ చాలా బాగా వస్తోంది. ప్రేక్షకులందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం. జులై ఫస్ట్ వీక్‌లో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘హీరోయిన్గా ఇది నా రెండో చిత్రం. ఇందులో నా పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంటుంది’’ అన్నారు డింపుల్. ఈ చిత్రానికి సంగీతం: నరేష్ కుమరన్, కెమెరా: విశ్వ. -
యాంకర్ దంపతులపై విదేశీయుడి దాడి
స్నిగ్నల్ పడ్డాక వెళ్లొచ్చుకదా అంటే దాష్టీకం నిందితుడి రిమాండ్ చిక్కడపల్లి: సిగ్నల్ పడ్డాక వెళ్లొచ్చు కదా... అన్న పాపానికి టీవీ యాంకర్ ఆమె భర్తపై ఓ విదేశీయుడు దాడి చేశాడు. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ఎం.సుదర్శన్ కథనం ప్రకారం... ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వెళ్లే మార్గంలోని అశోక్‌నగర్ సిగ్నల్ వద్ద మంగళవారం ఉదయం 9.30 గంటలకు ఓ చానల్లో యాంకర్/న్యూస్ రీడర్‌గా పనిచేస్తున్న శివజ్యోతి తన భర్త ముత్యంతో కలిసి బైక్‌పై ఆర్టీసీ క్రాస్‌రోడ్డు నుంచి చానల్ ఆఫీసుకు వెళ్తోంది. మార్గం మధ్యలో అశోక్‌నగర్ చౌరస్తాలో రెడ్ సిగ్నల్ పడటంతో ఆగారు. వెనుకే వాహనంపై వచ్చిన సిరియా దేశస్తుడు సాద్ అబ్దుల్ మున్నమ్ అబ్‌ఫాయప్(25) యాంకర్ శివజ్యోతి బైక్‌ను పక్కకు జరపమన్నాడు. రెడ్ సిగ్నల్ ఉంది కదా... కొద్ది సెకన్లు ఆగితే వెళ్లిపోవచ్చు కదా అని అంది. దీంతో ఆగ్రహానికి గురైన అబ్దుల్ మున్నమ్.. శివజ్యోతి చెంపపై కొట్టాడు. ఎందుకు కొడుతున్నావని ఆమె భర్త ప్రశ్నించగా.. ఆయనపై కూడా చెయ్యి చేసుకొని తీవ్రంగా గాయపర్చాడు. స్థానికులు అబ్దుల్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధిత దంపతుల ఫిర్యాదు మేరకు అబ్దుల్పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.