శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం
శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సోమవారం ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్ దొరకడం కలకలం సృష్టించింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఈరోజు ఉదయం కువైట్ వెళ్తున్న ముషీర్ అహ్మద్ అనే వ్యక్తిని తనిఖీలు చేయగా బుల్లెట్ బయటపడింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ముషీర్ అహ్మద్ నగరంలోని పాతబస్తీ తలాబ్‌కట్టకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న ఎయిర్పోర్ట్ పోలీసులు విచారణ చేపడుతున్నారు.