Muslim Clerics
-
శివుడి పాట.. ఫర్మానీ నాజ్‌పై ముస్లిం పెద్దల నారజ్
Farmani Naaz Har Har Shambhu:: యూట్యూబ్ సెన్సేషన్, ఇండియన్ ఐడల్ ఫేమ్ ఫర్మానీ నాజ్‌పై ముస్లిం మతపెద్దలు మండిపడుతున్నారు. ఆమె పాడిన హర్ హర్ శంభూ పాట వైరల్ కావడం ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువు అయ్యింది. హిందూ దైవం శివుడి మీద పాట పాడిన కారణంతో ముస్లిం సంఘాలు ఫర్మానీ నాజ్‌పై ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. ఇది ఇస్లాం వ్యతిరేక చర్య అంటూ ఫత్వా జారీ చేశాయి. ఆమె తన యూట్యూబ్‌లో ఛానెల్లో పాటను పోస్ట్ చేయగా.. వ్యూస్‌తో పాటు విమర్శలూ వెల్లువెత్తున్నాయి. ఈ చేష్టను ఇస్లాం వ్యతిరేక చర్యగా ఆరోపిస్తున్నాయి మతపెద్దలు.. ఇస్లాంలో, అందునా మహిళలు ఇలాంటి పనులు చేయడం మత విరుద్ధమేనని అంటున్నారు. ఉత్తర ప్రదేశ్ దియోబంద్ను చెందిన మతపెద్ద అసద్ ఖ్వాస్మీ దీన్నొక ‘పాపం’గా, ఘోరమైన నేరంగా అభివర్ణిస్తున్నారు. సంగీతానికి ఆమె దూరంగా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే.. స్టూడియోలో రికార్డింగ్ వెర్షన్‌ను ఆమె యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. శ్రావణ మాసం సందర్భంగా పాటను రిలీజ్ చేయగా.. హిందూ సంఘాలు, మరికొందరు అభినందిస్తుండగా, మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఫర్మానీ నాజ్ ఎవరంటే.. ఉత్తర ప్రదేశ్ ముజఫర్‌నగర్‌కు చెందిన ఫర్మానీ నాజ్.. ప్రైవేట్ ఆల్బమ్స్‌తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె యూట్యూబ్‌కు 3.84 మిలియన్లకు పైగా సబ్ స్క్రయిబర్స్ ఉన్నారు. ఇండియన్ ఐడల్ సీజన్ 12లో పాల్గొనడం ద్వారా ఆమెకు ఒక స్టార్ డమ్ దక్కింది. ఆమె వివాహిత. 2017లో ఆమెకు వివాహం అయ్యింది. అయితే కొడుకు పుట్టడం, ఆ కొడుక్కి జబ్బు చేయడంతో భర్త కుటుంబం ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించింది. దీంతో బిడ్డను తీసుకుని ఆమె తన పుట్టింటికి వెళ్లి.. కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆమె గొంతు బాగుండడంతో స్థానికంగా ఉండే ఓ కుర్రాడు.. ఆమె పాటల్ని యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు. అలా యూట్యూబ్ సెన్సేషన్‌గా, ఇ-సెలబ్రిటీగా గుర్తింపు పొందిన ఆమె, ఆపై ఇండియన్ఐడల్లో పాల్గొన్నారు. అయితే కొడుకు ఆరోగ్యం క్షీణించడంతో ఇండియన్ ఐడల్ మధ్యలోనే ఆమె వెనక్కి వచ్చేశారు. అయినా కూడా ఆమె కెరీర్ ముందుకు సాగిపోతూ వచ్చింది. ఏనాడైనా సాయం చేశారా? విమర్శలపై స్పందించిన ఫర్మానీ.. తనది పేద కుటుంబం అని, ఆపదలో ఉన్నప్పుడు ఎవరూ సాయానికి ముందుకు రాలేదని, తన మానాన తాను బతుకుతుంటే.. ఇప్పుడు అడ్డుకోవాలని చూడడం, విమర్శించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు ఆమె. అన్నింటికి మించి కళాకారులకు మతంతో సంబంధం ఉండదని గుర్తించాలంటూ ఆమె చెబుతున్నారు. అలా అనుకుంటే.. సలీం మోహమ్మద్ రఫీ లాంటి వాళ్లు భజన, హిందూ భక్తి పాటలు ఆలపించేవాళ్లు కాదు కదా.. దయచేసి హిందూ మతానికి, సంగీతానికి ముడిపెట్టొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారామె. అంతేకాదు తనకున్న రెండు చానెల్స్‌లో ఒకటి భక్తి గీతాల చానెల్ అని, అందులో కచ్చితంగా అన్ని మతాలకు సంబంధించిన ఆల్బమ్స్ అప్లోడ్ చేసి తీరతానని, అల్లా ఆశీస్సులు తనపై ఉంటాయని అంటున్నారామె. హిందూ సంఘాల మద్దతు ఇక తాజాగా శివుడి మీద పాట వైరల్ కావడంతో.. ఆమె మీద పలువురి అభినందలు సైతం కురుస్తున్నాయి. బీజేపీ నేత సంజీవ్ బాల్యన్.. ఆమె కొడుకు ట్రీట్మెంట్కు అవసరమయ్యే సాయం అందిస్తానని మాటిచ్చారు. మరోవైపు ముస్లిం సంఘాలు ఫర్మానీకి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేయడంపై వీహెచ్‌పీ మండిపడింది. వాళ్లు(ముస్లిం సంఘాలు) పేదలు, నిస్సహాయులకు మాత్రమే ఫత్వా జారీ చేస్తారు. ఇంతకాలం ఆమె యూట్యూబ్ ద్వారా పాడిన సంగతి మరిచిపోయినట్లు ఉన్నారు అంటూ ముస్లిం మత పెద్దలపై విమర్శలు గుప్పిస్తోంది. -
గాయపడిన పోలీస్ ప్రాణం కాపాడిన ముస్లిం
ఆగ్రా: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశమంతటా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ముస్లిం మత గురువు మానవత్వం ప్రదర్శించాడు. కోపంతో రాళ్లు విసురుతున్న నిరసనకారుల నుంచి గాయపడిన ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను కాపాడాడు. ఉత్తరప్రదేశ్‌లో ఫిరోజాబాద్ జిల్లాలోని ఓ మసీదులో గత వారం ప్రార్థనలు ముగించుకుని వస్తున్న 52 ఏళ్ల హాజీ ఖాదిర్‌కు కానిస్టేబుల్ అజయ్ కుమార్ గాయాలతో కనిపించాడు. నిరసనకారులు అజయ్‌పై దాడికి ప్రయత్నించగా ముందు తనను చంపి కానిస్టేబుల్‌పై దాడి చేయమని ఆందోళనకారులకు అడ్డు నిలిచాడు. అజయ్‌ను దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. పోలీసులు అజయ్‌ను ఆగ్రాలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఖాదిర్ ప్రదర్శించిన తెగువ, మానవత్వాలను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. -
యువ స్టార్ గాయనికి ఫత్వా షాక్!
-
'నేను పాడటం ఆపడం చాలా కష్టం'
-
'నేను పాడటం ఆపడం చాలా కష్టం'
ముంబై :రియాల్టీ సింగర్ నహీద్ అఫ్రిన్ పై ముస్లిం మత గురువులు ఫత్వా జారీచేశారు. బహిరంగ వేదికలపై ముస్లిం బాలికలు పాటలు పాడటం ఇస్లాం విశ్వాసాలకు విరుద్దమంటూ 46 మంది మతగురువులు ఆమెకు వ్యతిరేకంగా ఈ ఆదేశాలు జారీచేశారు. అయితే దేశమంతా తన వెన్నంటే ఉందని, ముస్లిం మత బోధకుల ఫత్వాకు తాను భయపడేది లేదని అఫ్రిన్ స్పష్టంచేసింది. తనను పాడటం ఆపడం చాలా కష్టమని అఫ్రిన్ పేర్కొంది. అస్సాం ప్రభుత్వం సైతం ఆమెకు మద్దతుగా నిలిచింది. ఆమె రక్షణకు తాము గ్యారెంటీ ఇస్తున్నట్టు పేర్కొంది. కొన్ని ఆర్గనైజేషన్లు ఎంతో ప్రతిభకలిగిన గాయని నహీద్ అఫ్రిన్ ప్రదర్శన ఇవ్వకుండా ఆంక్షలు విధించడాన్ని తాము పూర్తిగా ఖండిస్తున్నామని బీజేపీ ప్రభుత్వ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ట్విట్టర్ ద్వారా నహీద్ కు మద్దతుగా నిలిచారు. నహీద్ తో మాట్లాడతామని, ఆర్టిస్టులకు రక్షణ, భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సోనోవాల్ పునరుద్ఘాటించారు. ముస్లిం మతగురువులు తనపై ఫత్వా జారీచేశారని విన్న తర్వాత తాను చాలా షాక్ కు గురయ్యాయని, కానీ చాలామంది ముస్లిం గాయకులు తనకు మద్దతుగా నిలిచి పాడేందుకు ప్రోత్సహించారని నహీద్ చెప్పింది. ''పాడటం నాకు దేవుడిచ్చిన వరం, ఇది సరైన మార్గంలో ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నా. ఎలాంటి హెచ్చరికలకు నేను భయపడను. తుది శ్వాస వరకు నేను పాడుతూనే ఉంటా'' అని నహీద్ తెలిపారు. మసీదు, శ్మశాన సమీపంలో, బహిరంగ వేదికల్లో పాటలు పాడటాన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం మతగురువులు ఆమెపై ఫత్వా జారీచేశారు. టెర్రరిజం, ఐఎస్ఐఎస్ కు వ్యతిరేకంగా నహీద్ ఎక్కువగా పాటలు పాడుతూ ఫేమస్ అయింది. ఆమె తర్వాత ఈవెంట్ మార్చి 25న జరుగబోతుంది. -
'మీ పిల్లలను ఆ వైపుగా వెళ్లకుండా చూడండి'
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అరుదైన ఘట్టానికి తెర తీశారు. ప్రలోభాలకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ముస్లిం యువకులను తమ సంస్థలోకి చేర్చుకుంటుండటాన్ని నివారించేందుకు ఆయన ముస్లింమత పెద్దలతో మంగళవారం సాయంత్రం ఢిల్లీలో సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారి అజిత్ దోవల్, ఇతర హోంశాఖ ముఖ్య అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ వారితో మాట్లాడుతూ ముస్లిం యువకులు ఉగ్రవాద సంస్థతల ప్రలోభాలకు తలొగ్గకుండా ఉంచేందుకు తమకు సహకరించాలని ముస్లిం పెద్దలను కోరారు. జమైతే ఉలేమా ఈ హింద్ కు చెందిన నేతలు మౌలానా అర్షద్ మదానీ, అజ్మీర్ షరీఫ్ మౌలానా అబ్దుల్ వహీద్ హుస్సేన్‌తోపాటు పలు ముస్లిం సంస్థల సహాయాన్ని కూడా రాజ్ నాథ్ కోరారు. మిగితా దేశాలతో పోలిస్తే భారత్ చాలా సురక్షితమైన దేశమని, ఇప్పుడిప్పుడే ఉగ్రవాద ముంపు ముంచుకొస్తున్నందున దాని భారిన పడకుండా ఉండేందుకు యువకులను వారి కుటుంబాలే చూడాలని చెప్పారు. మన దేశ కుటుంబ వ్యవస్థ గొప్పదని, అసాంఘిక చర్యలవైపు భారతీయ నైతికత వెళ్లనీయదని, యువకుల ఆలోచన కట్టడికి కుటుంబాలదే ప్రధాన పాత్ర అని కూడా ఆయన వారితో చెప్పినట్లు సమాచారం.