ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆఫీస్ ఎదుట ఆదివారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. కార్పొరేటర్ టిక్కెట్ ఇస్తానని తనని నమ్మించి మోసం చేశారని ముస్తాక్ షరీఫ్ అనే వ్యక్తి బలవన్మరణానికి యత్నించాడు. అక్కడున్న వారు ముస్తాక్‌ను ఆత్మహత్యకు పాల్పడకుండా అడ్డుకున్నారు.
ఈ విషయంపై ఎమ్మెల్యే గోపీనాథ్‌ను మీడియా సంప్రదించగా... ముస్తాక్ షరీఫ్ టీడీపీకి సంబంధించిన వ్యక్తికాదని వివరణ ఇచ్చారు. కేవలం 15 రోజుల కిందట టీడీపీలో చేరతానని ముస్తాక్ షరీష్ అనే వ్యక్తి తనను కలిశాడని గోపీనాథ్ తెలిపారు.