ముగ్గురు మట్కాబీటర్ల అరెస్ట్
పట్టణంలోని పోర్టర్స్ లైన్లో మట్కా నిర్వహిస్తున్న ముగ్గురు బీటర్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రూ. 2.22 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వన్ టౌన్ ఎస్ఐ నగేష్ బాబూ తెలిపారు.
మంగళవారం సాయంత్రం గుంతకల్లుకి చెందిన కెఆర్. కృష్ణమూర్తి, బళ్లారికి చెందిన షాకీర్, కర్నూల్ జిల్లా ప్యాపిలికి చెందిన సుధాకర్ రెడ్డిలు మట్కా నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడులు జరిపారు.