Mv Agusta
-
ఎంవీ అగస్టా ‘బ్రూటల్ 800’
రూ.15.59 లక్షలు న్యూఢిల్లీ: ‘ఎంవీ అగస్టా’ తాజాగా ‘2017 బ్రూటల్ 800’ సూపర్‌బైక్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.15.59 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్)గా ఉంది. ఈ బైక్‌లో 796 సీసీ 3– సిలిండర్ ఇంజిన్, 6 స్పీడ్ ట్రాన్స్మిషన్, క్విక్ స్విఫ్టర్, డీఆర్ఎల్ఎస్తో కూడిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, రేసింగ్ టైప్ రాడికల్ ఫ్రంట్ క్యాలిపెర్స్, 8 లెవెల్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, 3 స్టెప్ ఏబీఎస్ సిస్టమ్, స్లిప్పర్ క్లచ్, ఇంజిన్ బ్రేకింగ్ కంట్రోల్ వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ పేర్కొంది. 2020కి సూపర్ ప్రీమియం బైక్స్ విభాగంలో 20% మార్కెట్‌ను లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ఎంవీ ఆగస్టా ఇండియా ఎండీ అజింక్య ఫిరొడియా తెలిపారు. -
నాగచైతన్యకు సమంత గిఫ్ట్.?
యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య కొండాపూర్ ఆర్టీఏ ఆఫీస్‌లో సందడి చేశాడు. తాను కొత్తగా కొన్న సూపర్ బైక్ రిజిస్ట్రేషన్ కోసం ఆఫీస్‌కు వచ్చిన నాగచైతన్య అభిమానులతో ముచ్చటించాడు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పనులతో పాటు తన నిశ్చితార్థం పనుల్లో బిజీగా ఉన్న చైతన్య 27 లక్షల ఖరీదు చేసే ఎంవీ అగస్టా బైక్‌ను కొనుగోలు చేశాడు. ఈ బైక్ రిజిస్ట్రేషన్ కోసం తానే స్వయంగా హెల్మెట్ ధరించి బైక్ డ్రైవ్ చేస్తూ ఆర్టీఏ ఆఫీస్‌కు వచ్చాడు. రోడ్ ట్యాక్స్ కోసం నాలుగున్నర లక్షల రూపాయలు చెల్లించిన నాగచైతన్య ఫోటో దిగి, సంతకాలు చేసి రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ పూర్తి చేశాడు. ఈ బైక్‌కు టీఎస్ 07 ఎఫ్ఎం 2003 నెంబర్ ను కేటాయించినట్లుగా ఆర్టీఏ అధికారులు తెలిపారు. ఈ బైక్ నాగచైతన్యకు, సమంత ఇచ్చిన గిఫ్ట్ అన్న ప్రచారం కూడా జరుగుతోంది. -
భారత రోడ్లపైకి ఎంవీ అగస్టా బైక్స్
పుణే: ఇటలీకి చెందిన ప్రీమియం హైపర్ఫార్మెన్స్ సూపర్ బైక్స్ తయారీ కంపెనీ ఎంవీ అగస్టా భారత్‌లోకి అడుగుపెట్టింది. కంపెనీ తాజాగా ‘ఎఫ్4’, ‘ఎఫ్3’, ‘బ్రుటలె’ అనే మూడు మోడళ్లను దేశీ మార్కెట్లో ఆవిష్కరించింది. వీటి డిస్ట్రిబ్యూషన్ కోసం కైనటిక్ గ్రూప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. బైక్స్ ధర రూ.16.78 లక్షలు-రూ.35.71 లక్షల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్ పుణే) ఉంది. ఈ ప్రీమియం బైక్స్ విక్రయాల కోసం కైనటిక్ గ్రూప్ ప్రత్యేకంగా ‘మోటొరాయలె’ డీలర్‌షిప్స్‌ను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం ఇవే దేశంలో అత్యంత ఖరీదైన బైక్స్. ఎఫ్4: దీని ప్రారంభ ధర రూ.26.87 లక్షలుగా ఉంది. ఇందులో 998 సీసీ 4 సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. దీని పవర్ 195 హెచ్‌పీ. టార్క్యూ 111 ఎన్ఎం. ఇది 0-100 కిలోమీటర్ల వేగాన్ని 2.4 సెకన్లలో అందుకుంటుంది. ఎఫ్3: దీని ధర రూ.16.78 లక్షలు. ఇందులో 800సీసీ 3 సిలిండర్ ఇంజిన్, మల్టీ రైడింగ్ మోడ్స్, ఏబీఎస్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. బ్రుటలె: దీని ప్రారంభ ధర రూ.20.10 లక్షలు. ఇందులో 1078 సీసీ 4 సిలిండర్ ఇంజిన్‌ను పొందుపరిచారు. దీని పవర్ 144 హెచ్‌పీ.