నాగచైతన్యకు సమంత గిఫ్ట్.?
యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య కొండాపూర్ ఆర్టీఏ ఆఫీస్లో సందడి చేశాడు. తాను కొత్తగా కొన్న సూపర్ బైక్ రిజిస్ట్రేషన్ కోసం ఆఫీస్కు వచ్చిన నాగచైతన్య అభిమానులతో ముచ్చటించాడు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పనులతో పాటు తన నిశ్చితార్థం పనుల్లో బిజీగా ఉన్న చైతన్య 27 లక్షల ఖరీదు చేసే ఎంవీ అగస్టా బైక్ను కొనుగోలు చేశాడు.
ఈ బైక్ రిజిస్ట్రేషన్ కోసం తానే స్వయంగా హెల్మెట్ ధరించి బైక్ డ్రైవ్ చేస్తూ ఆర్టీఏ ఆఫీస్కు వచ్చాడు. రోడ్ ట్యాక్స్ కోసం నాలుగున్నర లక్షల రూపాయలు చెల్లించిన నాగచైతన్య ఫోటో దిగి, సంతకాలు చేసి రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ పూర్తి చేశాడు. ఈ బైక్కు టీఎస్ 07 ఎఫ్ఎం 2003 నెంబర్ ను కేటాయించినట్లుగా ఆర్టీఏ అధికారులు తెలిపారు. ఈ బైక్ నాగచైతన్యకు, సమంత ఇచ్చిన గిఫ్ట్ అన్న ప్రచారం కూడా జరుగుతోంది.