MYNAMPALLY hanmanta Rao
-
మల్లారెడ్డి వర్సెస్ మైనంపల్లి.. పేలుతున్న మాటల తూటాలు
సాక్షి, హైదరాబాద్: మైనంపల్లి హన్మంతరావు ఓ రౌడీ అంటూ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మైనంపల్లిని బీఆర్ఎస్లో గెంటేస్తే కాంగ్రెస్‌లోకి వెళ్లాక పిచ్చోడయ్యాడంటూ మండిపడ్డారు. మైనంపల్లి గెలిచేది లేదు.. చేసేది లేదని విమర్శలు గుప్పించారు. ‘‘దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. బస్తీ దవాఖానలతో అందరికీ వైద్యం అందుతోంది. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాయి. ఐటీ రంగం కూడా ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందింది. కాంగ్రెస్ అంటే ఒక స్కాం.. కేసీఆర్ అంటే అభివృద్ధి. మాయమాటలు చెప్పడమే కాంగ్రెస్ పని.. కాంగ్రెస్ పాలనలో కరెంట్ లేక పరిశ్రమలు మూత పడ్డాయి. రేవంత్ రెడ్డి ఎంపీగా మల్కాజ్ గిరికి ఏం చేశాడు?. కనీసం ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి ఏం ఉద్దరిస్తాడు’’ అంటూ మల్లారెడ్డి ధ్వజమెత్తారు. అంతకుముందు కూడా వీరిద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ఒకరిపై మరొకరు తీవ్రంగా విమర్శించారు. హద్దులు దాటి మాటలతో తిట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నేతల మాటాలు విని ప్రజలు షాకవుతున్నారు. చదవండి: ఆసక్తికరంగా ‘అలంపూర్’ రాజకీయం.. బీఫాం ఎవరికో? -
టీఆర్ఎస్కే మూడు ఎమ్మెల్సీ పదవులు
బరిలో ముగ్గురు అభ్యర్థులే ఉండటంతో ఏకగ్రీవం కానున్న ఎన్నిక హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలోని మూడు శాసనమండలి సభ్యుల పదవులు టీఆర్ఎస్ ఖాతాలో చేరనున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, వి.గంగాధర్గౌడ్ల నామినేషన్ పత్రాల పరిశీలన బుధ వారం పూర్తయింది. మూడు స్థానాలకు ముగ్గురు అభ్యర్థులే బరిలో ఉండటంతో వారి ఎన్నిక లాంఛనమే. నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారంతో ముగియనుంది. ఆ తర్వాత వీరి ఏకగ్రీవ ఎన్నికను రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు. మూడు ఎమ్మెల్సీ పదవుల్లో ఒక సీటు చేరికల ద్వారా టీఆర్ఎస్ ఖాతాలోకి వచ్చింది. గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన వి.గంగాధర్‌గౌడ్ ప్రస్తుతం అధికారికంగా టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నిక కానున్నారు. కాంగ్రెస్, ఎంఐఎం చేతిలో ఉన్న ఒక్కో స్థానం కూడా తాజాగా టీఆర్ఎస్ ఖాతాలో చేరుతున్నాయి. -
కొలిక్కి వచ్చిన జిల్లా అధ్యక్షుల ఎంపిక!
రాష్ట్ర కమిటీ, పొలిట్‌బ్యూరో కూర్పుపై టీఆర్ఎస్ కసరత్తు సాక్షి, హైదరాబాద్: అధికార తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షులు, కమిటీల ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వరసగా బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు ఇదే అంశంపై కసరత్తు చేశారని పార్టీ వర్గాల సమాచారం. ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలతోనూ అవసరమైన సందర్భాల్లో సీఎం మాట్లాడి జిల్లా అధ్యక్షుల పేర్లకు తుదిరూపు ఇచ్చారని తెలిసింది. కాగా, రాష్ట్ర కమిటీ, పార్టీ పొలిట్‌బ్యూరో కూర్పుపై ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. 31 జిల్లాల అధ్యక్షుల జాబితాను ఒకేసారి ప్రకటించాలని కూడా నిర్ణయించారని సమాచారం. గతంలో జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన వారిలో కనీసం ఏడెనిమిది మందికి తిరిగి అవకాశం దక్కనుంది. ఐడీసీ చైర్మన్‌గా నామినేటెడ్ పదవి దక్కించుకున్న కరీంనగర్ జిల్లా(పాత) అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, ఫారెస్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితుడైన నల్లగొండ జిల్లా (పాత) అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించనున్నారు. మిగిలిన ఎనిమిది జిల్లాల్లో పాతవారినే కొనసాగిస్తారని భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పార్టీ అధ్యక్షుని ఖరారు కొంత జటిలంగా మారినా, ప్రస్తుత అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు పేరు ఖరారైనట్లేనని చెబుతున్నారు. అనుబంధ సంఘాల కమిటీలపై స్పష్టత.. అనుబంధ సంఘాల రాష్ట్ర కమిటీలు, జిల్లా అనుంబంధ సంఘాల కమిటీలపైనా ఒక స్పష్టత వ చ్చిందని తెలుస్తోంది. అయితే, ముందుగా పార్టీ జిల్లా అధ్యక్షుల వరకు ప్రకటి ంచి, మిగిలిన కమిటీలను తర్వాత ప్రకటించే వీలుందని సమాచారం. మరోవైపు పార్టీ రాష్ట్ర కమిటీ, పొలిట్‌బ్యూరో, రాష్ట్ర స్థాయి అనుబంధ సంఘాల కమిటీలను మరో విడతలో ప్రకటించే వీలు లేకపోలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. కాగా, పార్టీ సంస్థాగత కమిటీల వివరాలను శనివారం ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు పార్టీ జిల్లా కమిటీల ఏర్పాటు నేపథ్యంలో ఆయా జిల్లాలకు చెందిన నేతల్లో అత్యధికులు హైదరాబాద్‌లోనే మకాం వేశారు.