బరిలో ముగ్గురు అభ్యర్థులే ఉండటంతో ఏకగ్రీవం కానున్న ఎన్నిక
హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలోని మూడు శాసనమండలి సభ్యుల పదవులు టీఆర్‌ఎస్ ఖాతాలో చేరనున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, వి.గంగాధర్‌గౌడ్‌ల నామినేషన్ పత్రాల పరిశీలన బుధ వారం పూర్తయింది. మూడు స్థానాలకు ముగ్గురు అభ్యర్థులే బరిలో ఉండటంతో వారి ఎన్నిక లాంఛనమే.
నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారంతో ముగియనుంది. ఆ తర్వాత వీరి ఏకగ్రీవ ఎన్నికను రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు. మూడు ఎమ్మెల్సీ పదవుల్లో ఒక సీటు చేరికల ద్వారా టీఆర్‌ఎస్ ఖాతాలోకి వచ్చింది. గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన వి.గంగాధర్‌గౌడ్ ప్రస్తుతం అధికారికంగా టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎన్నిక కానున్నారు. కాంగ్రెస్, ఎంఐఎం చేతిలో ఉన్న ఒక్కో స్థానం కూడా తాజాగా టీఆర్‌ఎస్ ఖాతాలో చేరుతున్నాయి.
టీఆర్‌ఎస్‌కే మూడు ఎమ్మెల్సీ పదవులు
Published Thu, Mar 9 2017 2:00 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement