Mythili
-
Maithili: 'ఎకో ఫ్రెండ్లీ సస్టెయినబుల్ ఆల్టర్నేటివ్' గా.. వేగాన్ లెదర్!
"ఒక చదరపు మీటరు లెదర్ తయారయ్యే ప్రక్రియలో విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ ఎంతో ఊహించగలరా? అక్షరాలా 17 కిలోలు. లెదర్ బ్యాగ్‌లు, షూస్, బెల్టులు, పర్సులు, వాచ్‌ల మీద మనకున్న మక్కువ తక్కువేమీ కాదు. కానీ పర్యావరణానికి ఇంత చేటు చేస్తుందని తెలిసిన తర్వాత వాటి వాడకాన్ని ప్రోత్సహించలేం, మమకారాన్ని చంపుకోలేం. అన్నింటికీ పర్యావరణహితమైన ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నాం కదా! దీనికి కూడా ఓ మార్గం కనిపించకపోతుందా! సరిగ్గా ఇలాగే ఆలోచించిన మైథిలి పోకచెట్టు బెరడుతో ఓ ప్రత్యామ్నాయాన్ని మన ముందుకు తెచ్చారు. అదే వేగాన్ లెదర్. వేగాన్ లెదర్‌ని ఎకో ఫ్రెండ్లీ సస్టెయినబుల్ ఆల్టర్నేటివ్గా పరిచయం చేస్తున్నారు మైథిలి." తిరిగి ఇచ్చేద్దాం! మైథిలిది కర్నాటకలోని శృంగేరి. ఆమె భర్త సురేశ్‌తో కలిసి ‘భూమి ఆగ్రో వెంచర్స్’ పేరుతో వేగాన్ లెదర్ తయారీ పరిశ్రమను స్థాపించారు. ఈ ప్రయత్నం కేవలం పర్యావరణహితం కోసం, మనుషులను పర్యావరణ హిత జీవనశైలి దిశగా నడిపించడమేనన్నారామె. కంప్యూటర్స్‌తో మొదలు పెట్టిన కెరీర్ వేగాన్ లెదర్ పరిశ్రమ వైపు మలుపు తీసుకోవడాన్ని వివరించారామె. మాది వ్యవసాయ కుటుంబం. కర్నాటకలో లక్షలాది ఎకరాల్లో పోక చెట్లను పెంచుతారు. మేము చదువు పూర్తయిన తర్వాత శివమొగ్గలో కంప్యూటర్ సేల్స్, సర్వీసెస్ వ్యాపారం మొదలుపెట్టాం. పాతికేళ్లపాటు విజయవంతంగా నిర్వహించాం. ఇక మా వంతుగా సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చిందనే అభి్రపాయానికి వచ్చాం. అలాంటి సమయంలో ఓ సారి మా సొంతూరికి వచ్చినప్పుడు పోకచెట్టు బెరళ్లను చూసినప్పుడు ఈ ఆలోచన వచ్చింది. కప్పులే కాదు చెప్పులు కూడా! పర్యావరణ ప్రేమికులు కొందరు పోకచెట్టు బెరడుతో ఫంక్షన్లలో భోజనం వడ్డించే ప్లేట్లు, పాయసం వడ్డించే కప్పుల వంటి వాటిని చేస్తున్నారు. పేపర్ ప్లేట్‌కు బదులు అరెక్కా (పోకచెట్టు) ప్లేట్ వాడడం వల్ల పేపర్ తయారీ సమయంలో జరిగే నీటికాలుష్యాన్ని నివారించిన వారమవుతాం. అయితే పోకచెట్టును ఇంకా విస్తృతంగా వినియోగంలోకి తీసుకు రాగలిగితే పర్యావరణానికి హానికారకంగా మారుతున్న అనేక పరిశ్రమలకు ఇది చక్కటి ప్రత్యామ్నాయం అవుతుందని ఆలోచించాం. అప్పుడు మాకు మొదటగా తోళ్ల పరిశ్రమ గుర్తువచ్చింది. నెదర్లాండ్స్‌కు చెందిన త్జీర్డ్ వీన్హోవెన్ కూడా తోళ్లకు ప్రత్యామ్నాయం కోసం మొక్కలపై ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిసింది. మా పోకచెట్టు బెరడు ఆలోచన వీన్హోవెన్కు కూడా నచ్చింది. ప్రయోగాలు చేయగా చేయగా మా ప్రయత్నం విజయవంతం అయింది. ఇది జంతువులకు ప్రాణహానిని నివారించే లెదర్ కాబట్టి వేగాన్ లెదర్, పామ్ లెదర్ అంటున్నాం. రసాయన రహిత, భూమిలో కలిసిపోయే మెటీరియల్ ఇది. తేలికగా ఉంటుంది కూడా. ఇప్పుడు పెద్ద ఎత్తున వేగాన్ లెదర్‌ను ఎగుమతి చేస్తున్నాం. వీటితో పెన్హోల్డర్లు, చెప్పులు, పుస్తకాల అట్టలు, వ్యానిటీ బ్యాగ్ తదితరాలు తయారవుతున్నాయి. స్వయం సహాయక బృందాల మహిళలు ఇందులో చక్కటి సేవందిస్తున్నారు. గత ఏడాది మే–జూన్ నెలల్లో జీ 20 సదస్సుల సందర్భంగా స్టాల్ నిర్వహించాం. యానిమల్ లెదర్ తయారీలో కార్బన్ డయాక్సైడ్‌తోపాటు నీటి కాలుష్యం కూడా ఎక్కువే. యానిమల్ లెదర్ కోసం పాతిక వేల లీటర్ల నీరు అవసరమయ్యే చోట పామ్ లెదర్ తయారీకి నీటి వాడకం ఆరు వందల లీటర్లకు మించదు. పైగా పామ్ లెదర్ తయారీలో వాడిన నీటిని తిరిగి పంటలకు వినియోగించుకోవచ్చు కూడా. మేము సమాజానికి తిరిగి ఇవ్వాలనే ప్రయత్నంతో చేసిన ఆలోచన నుంచి పర్యావరణానికి మా వంతుగా సేవలందించే అవకాశం వచ్చింది. సంతోషాన్ని వర్ణించడానికి మాటలు చాలవు’’ అన్నారు మైథిలి. ఇవి చదవండి: ‘మనకెందుకమ్మా వ్యాపారం.. పెద్ద రిస్క్’ అని అనుకుంటే..!? ఇప్పుడిలా.. -
ఆ అమ్మాయి కోసం నన్ను కొట్టేవాడు: బుల్లితెర నటి
Mythili Sridhar Reddy: ప్రముఖ టీవీ నటి మైథిలి తన భర్తపై, పోలీసులపై ఆరోపణలు చేసింది. ఆమె ఆత్మహత్యాయత్నానికి ప్రధాన కారణం తన భర్తను భరించలేకపోవడమేనని తెలిపింది. మైథిలి సోమవారం (మే 30) పంజాగుట్ట పోలీసులకు ఫోన్ చేసిన అనంతరం సూసైడ్ అటెంప్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మైథిలి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఈ క్రమంలో తన ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు, తాను అనుభవించిన మనోవేదనను చెప్పుకొచ్చింది. ''నా భర్త సామ శ్రీధర్ రెడ్డి ఓ మహిళ ప్రోగ్రాం డైరెక్టర్. మాది పెద్దలు కుదిర్చిన వివాహం ఇది మా ఇద్దరికీ సెకండ్ మ్యారేజ్. అప్పటికే నాకు ఒక బాబు ఉన్నాడు. పెళ్లికి ముందు చాలా మంచివాడిలా నటించాడు. మనకు ఇక పిల్లలు వద్దు ఈ బాబుని నా కొడుకులాగా చూసుకుంటా అన్నాడు. కానీ పెళ్లైన కొద్ది నెలల్లోనే తన రంగులు ఒక్కోటి చూపించాడు. మహా అలియాస్ రజిత అనే అమ్మాయితో తనకు ముందునుంచే రిలేషన్ ఉంది. తన విషయంలో గొడవలు కూడా జరిగాయి. ఆ అమ్మాయి విషయంలో నన్ను కొట్టే వాడు. కట్నం డబ్బు, కారు, బంగారం ప్రతి విషయంలో అబద్ధాలు చెప్తూ మోసం చేసాడు. సొంత భర్తే 65 తులాల బంగారం దొంగతనం చేస్తే ఇక నేను ఎవరికి చెప్పుకోవాలి. నిత్యం గోడవలు జరిగేవి, కొట్టేవాడు. రజితను ఒక సారి ఫ్రెండ్ అంటాడు. మరోసారి దూరం చుట్టం అంటాడు. రజిత మా ఇంటికొచ్చి మా మధ్య పెత్తనం చేసేది. మోతే పోలీస్ స్టేషన్లో తన మీద ఐపీసీ సెక్షన్ 498 కింద కేసు పెట్టాము. 2021 సెప్టెంబర్‌లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇంకో కేసు పెట్టా. పంజాగుట్ట పోలీస్‌లు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. శ్రీధర్ రెడ్డికి పీసీసీ మహిళా అధ్యక్షురాలు సునీత రావు సపోర్ట్ ఉంది. సొంత భర్తే నన్ను మోసం చేసాడు. దాదాపు రెండేళ్లుగా నాతో ఉండట్లేదు. నాకు తెలీకుండానే డివోర్స్‌కు అప్లై చేసాడు. పిల్లలు ఉన్నారని ఇన్ని రోజులు అన్ని భరించాను. నాకు ఇక మానసికంగా ధైర్యం సరిపోలేదు. ఆ బాధను తట్టుకోలేకే పంజాగుట్ట పోలీసులకు పోన్ చేశాను. తర్వాత సూసైడ్ అటెంప్ట్ చేశాను. నాకు తగిన న్యాయం కావాలి. మోసం చేసిన నా భర్తను శిక్షించాలి.'' అని ఆవేదన వ్యక్తం చేసింది మైథిలి. -
పంజాగుట్టలో టీవీ నటి ఆత్మహత్యాయత్నం, నిమ్స్‌కు తరలింపు
ప్రముఖ టీవీ నటి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. సదరు నటిని మైథిలిగా పోలీసులు గుర్తించారు. సోమవారం సాయంత్రం ఆమె పంజాగుట్ట పోలీసులకు ఫోన్ చేసి తన భర్తపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. అంతేకాదు తన భర్త బండి సీజ్ చేయాలని లేదంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని మైథిలి పోలీసులకు చెప్పినట్లు సమాచారం. చదవండి: తెలుగు చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ లేదు: సుమన్ సంచలన వ్యాఖ్యలు అప్పటికే మైథిలి 8 బ్రీజర్లు, స్లీపింగ్ ట్యాబ్లెటను మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇక ఫోన్ సిగ్నల్స్ ఆధారం పోలీసులు నటి ఇంటికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న మైథిలిని సమీపంలోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతున్నట్లు సమాచారం. కాగా గతంలో కూడా మైథిలి మోతె పీఎస్‌లో తన భర్తపై కేసు పెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
సెంట్రల్ వర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, చెన్నై: తిరువారూర్‌లోని సెంట్రల్ వర్సిటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సమాచారంతో ఆ వర్సిటీ విద్యార్థినుల్లో ఆందోళన మొదలైంది. కాగా కృష్ణగిరి జిల్లా హొసూరుకు చెందిన ఇంజినీరు మురళి, లలిత ప్రియదంపతుల కుమార్తె మైథిలి(19) తిరువారూర్ నీలకుడిలోని తమిళనాడు సెంట్రల్ వర్సిటీలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. అక్కడి హాస్టల్లో బస చేస్తూ, చదువుకుంటున్న మైథిల్ ఆత్మహత్య కలకలం రేపింది. మైథిలితో పాటు హాస్టల్లో నలుగురు విద్యార్థినులు ఉన్నారు. కళాశాలకు సెలవు కావడంతో ఇద్దరు విద్యార్థినులు వారి స్వస్థలాలకు వెళ్లారు. మైథిలితో పాటు రాజశ్రీ అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఉన్నారు. శనివారం రాత్రి టిఫిన్ తినేందుకు రాజశ్రీ మెస్‌కు వెళ్లింది. మైథిలిని పిలవగా, తాను కాసేపటి తర్వాత వస్తానని సమాధానం ఇవ్వడంతో ఆమె మాత్రమే వెళ్లింది. టిఫిన్ ముగించుకుని తొమ్మిదిన్నర గంటలసమయంలో తన గది వద్దకు రాజశ్రీ వచ్చింది. చదవండి: చదువు చావుకొస్తోంది! అయితే, తలుపు లోపల గడియ పెట్టి ఉండడం, ఎంతకు తెరచుకోకపోవడంతో అనుమానం వచ్చి అక్కడి సిబ్బందికి సమాచారం అందించింది. తలుపు పగులగొట్టి చూడగా, ఆ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మైథిలి వేళాడుతుండడంతో అక్కడ కలకలం బయలు దేరింది. హాస్టళ్లో› ఉన్న విద్యార్థినులు అందరూ భయంతో వణికి పోయారు. సమాచారం అందుకున్న నన్నిలం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. రాజశ్రీ వద్ద విచారించారు. ఆ గదిలో ఏదైనా లేఖ ఉందా అని తనిఖీ చేశారు. మృతదేహాన్ని అర్ధరాత్రి పోస్టుమార్టం నిమిత్తం తిరువారూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మైథిలీ కుటుంబం శోక సంద్రంలో మునిగింది. అయితే, ఆమె ఆత్మహత్య కారణాలు తెలియకపోవడంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసి ఉన్నారు. కాగా, ఇదే వర్సిటీలో ఎంఏ మొదటి సంవత్సరం చదువుతున్న కర్ణాటక రాష్ట్రం మైసూర్‌కు చెందిన కరణ్ పటేల్(21) విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా, రెండో సంఘటన చోటుచేసుకోవడం ఆందోళన కల్గిస్తున్నది. ఇక, చెన్నై ఐఐటీలో ఫాతిమా అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే, సెంట్రల్ వర్సిటీలో మైథిలి బలన్మరణానికి పాల్పడడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.