బోరుబావులను వృథాగా వదిలేస్తే చర్యలు
చందంపేట: ఎవరైనా బోరు వేయించి.. వృథాగా వదిలేస్తే చర్యలు తీసుకుంటామని నల్లగొండ జిల్లా చందంపేట మండలం ఎస్ఐ నాగభూషణ్రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం జిల్లాలోని పెద్దవూరలో ఆడుకుంటూ వెళ్ళిన చిన్నారి బోరుబావిలో పడి మృతి చెందడం బాధాకరమన్నారు.
ఈ సందర్భంగా ఎస్ఐ ఓ ప్రకటన విడుదల చేశారు. నిరుపయోగంగా ఉన్న బోరుబావులను విధిగా పూడ్చనట్లయితే బోర్వెల్స్ నిర్వాహకులపై, పొలంలో వేసిన రైతులపై కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ నాగభూషణరావు ఈ సందర్భంగా హెచ్చరించారు.