nagamangalam
-
ఆర్టీసీ బస్సు - లారీ ఢీ: 30 మందికి గాయాలు
చిత్తూరు: చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నాగమంగళం వద్ద శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్ణాటక ఆర్టీసీకి చెందిన బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను పలమనేరు ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
చిత్తూరు జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం
-
చిత్తూరు జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. మానవత్వం మంటగలిసింది. తల్లి చేసిన అప్పు తీర్చలేదని అయిదేళ్ల కూతురిని పదిరోజుల పాటు నిర్బంధించి అత్యాచారం చేశాడో కామాంధుడు. పదిరోజులుగా గుండెల నిండా భయంతో ఈ విషయాన్ని మౌనంగానే భరించిన ఆ తల్లి .... కూతురు ఎంతకూ తిరిగి రాకపోవడంతో విషయం ఇరుగు పొరుగు వాళ్లకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ముబారక్ ఇంటిపై దాడి చేసి చిన్నారిని విడిపించారు. వివరాల్లోకి వెళ్లితే చిత్తూరు జిల్లా పలమనేరు శివార్లలోని దాబా హోటల్లో ఓ మహిళ కూలీగా పని చేస్తోంది. నాలుగు నెలల క్రితం తన తల్లి వైద్యం కోసం ముబారక్ అనే వ్యక్తి నుంచి 2 వేల రూపాయలు అప్పు తీసుకుంది. అదే పాపమైంది. అప్పు తీర్చలేదని పది రోజుల క్రితం ఆమె 5 ఏళ్ల కూతుర్ని ముబారక్ తనతోపాటు తీసుకెళ్లిపోయాడు. తీసుకున్న అప్పుకు వడ్డీతో సహా ముట్టజెప్పి బిడ్డను తీసుకెళ్లాలని బెదిరించాడు. దాంతో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన తల్లి ఇక తన కూతురి కోసం ఇరుగు పొరుగును ఆశ్రయించటంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘాతుకానికి పాల్పడిన కామాంధుడు ముబారక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.