Nagender Goud
-
సంపూర్ణ తెలంగాణ సాధనకే పాదయాత్ర
పాల్మాకుల (శంషాబాద్ రూరల్), న్యూస్‌లైన్: సంపూర్ణ తెలంగాణ సాధనకే పాదయాత్ర ప్రారంభించినట్టు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్ పేర్కొన్నారు. శంషాబాద్ మం డలం పాల్మాకులలో శుక్రవారం ‘సంపూర్ణ తెలంగాణ సాధన’ పేరుతో ఆయ న పాదయాత్రను ప్రారంభిం చారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ నాయకుడు, ఎమ్మెల్సీ స్వామిగౌడ్, పార్టీ కేంద్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు కే.కేశవరావు హాజరయ్యారు. పాదయాత్రకు ముందు స్థానిక శ్రీహనుమాన్ ఆలయంలో ప్రత్యే క పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి, పాదయా త్ర చేపట్టారు. ఈ సందర్భంగా నాగేందర్‌గౌడ్ మాట్లాడుతూ ఎలాంటి ఆంక్షలులేని తెలంగాణ సాధనే టీఆర్ఎస్ లక్ష్యమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయ వారసత్వాలకు స్వస్తి పలుకుతూ అమరుల కుటుంబాలు, తెలంగాణ ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యం కల్పించాలన్నారు. అమరుల కుటుంబాలకు రూ.10 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి అన్ని విధాలా ఆదుకుం టామని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారని తెలిపారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణను అమ్మ ఇచ్చిం దంటూ బస్సు యాత్ర, జైత్రయాత్ర చేపడుతున్న కాంగ్రెస్ నాయకులు ఆనాడు విద్యార్థులపై కేసులు పెట్టినప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. అక్రమ కేసులను ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని పాల్మాకుల నుంచి వట్టినాగులపల్లి వరకు నాలుగు రోజులపాటు 80కి.మీ.పాదయాత్ర కొనసాగుతుందన్నారు. మొదటి రోజు పా ల్మాకుల నుంచి శంషాబాద్ పట్టణం వరకు 18 కి.మీ.యాత్ర పూర్తి చేశారు. యాత్రకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మహిళలు, కార్మికులు మద్ద తు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ చేవె ళ్ల పార్లమెంటు ఇన్చార్జి విశ్వేశ్వర్‌రెడ్డి, నాయకులు పురుషోత్తంరావు, స్వప్న, రోహిత్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, ఆంజనేయు లు, మోహన్‌రావు, అశోక్, ఆనంద్, హ రికృష్ణ, రమేష్, శ్రీపాల్‌రెడ్డి, టీఆర్ఎస్వీ నాయకులు శ్రీనివాస్ పాల్గొన్నారు. -
యాత్రల కాలం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సార్వత్రిక పోరు దగ్గర పడుతుండడంతో జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీకి ఉవ్విళ్లూరుతున్న ఆశావహులు... త మ భవిష్యత్తును పదిలం చేసుకునే దిశగా పాదయాత్రలకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే చేవెళ్ల పార్లమెంటరీ సీటును ఆశిస్తున్న అధికార పార్టీ యువనేత కార్తీక్‌రెడ్డి ఐదు రోజులపాటు పాదయాత్ర నిర్వహించడం ద్వారా జిల్లా రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్‌కు తెరలేపారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రాజేంద్రనగర్ అసెంబ్లీ సీటు రేసులో ఉన్న టీఆర్ఎస్ జిల్లా సారథి నాగేందర్‌గౌడ్ శుక్రవారం పాల్మాకుల నుంచి పాదయాత్రను మొదలు పెట్టారు. ఈ యాత్ర నాలుగు రోజులపాటు నియోజకవర్గంలో కొనసాగుతుంది. యాత్ర ఉద్దేశం సంపూర్ణ తెలంగాణ సాధన కోసమేనని చెబుతున్నప్పటికీ, అంతర్లీనంగా మాత్రం తమ పట్టును నిలుపుకునేందుకేనని తెలుస్తోంది. మరోవైపు ఇదే పార్టీకి చెందిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా త్వరలోనే పాదయాత్ర నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను చేపట్టాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల రెండో వారంలో యాత్ర మొదలు పెట్టే దిశగా ఆలోచన చేస్తున్నారు. సుమారు పది లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే ఈ ప్రాజెక్టు రంగారెడ్డి జిల్లా రైతాంగానికి జీవధారగా మారుతుందని ఆయన అంటున్నారు. ఈ నేపథ్యంలోనే జూరాల నుంచి జిల్లా సరిహద్దు వరకు యాత్ర నిర్వహణకు సన్నిహితులతో తర్జనభర్జనలు పడుతున్నారు. ఇదిలావుండగా మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా మహేశ్వరం నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టనున్నట్లు సూత్రప్రాయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యుడు దేప భాస్కర్‌రెడ్డి కూడా మహేశ్వరం సెగ్మెంట్లో పాదయాత్ర నిర్వహణకు ప్లాన్ చేస్తున్నారు. సాధారణ ఎన్నికలకు గడువు ముంచుకొస్తున్న తరుణంలో రాజకీయ నేతలు యాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆశావహులు యాత్రలను వేదికగా మలుచుకుంటున్నారు. -
రాయల తెలంగాణను అంగీకరించం
చేవెళ్ల, న్యూస్‌లైన్: రాయల తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని, ఆ ప్రతిపాదనకు వ్యతిరేకంగా గురువారం నిర్వహిస్తున్న బంద్‌లో ప్రతిఒక్కరూ పాల్గొనాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, ఆ పార్టీ చేవెళ్ల పార్లమెంటు ఇన్చార్జి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం చేవెళ్లలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణే కావాలని, అది తప్ప ఏ ప్రతిపాదననూ ఒప్పుకునేది లేదని పేర్కొన్నారు. రాయల తెలంగాణను ఎవరూ అడగలేదని, రాజకీయ లబ్ధికోసమే కాంగ్రెస్ పార్టీ నాటకం ఆడుతోందని దుయ్యబట్టారు. ఎవరి ప్రయోజనాల కోసం రాయల తెలంగాణ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారన్నారు. భద్రాచలం, మునగాలలను వదులుకునే ప్రసక్తేలేదని, ఆంక్షలు లేని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆంకాంక్షకు విరుద్ధంగా రాయల తెలంగాణను ఏర్పాటుచేస్తే మరోమారు ఉద్యమం తప్పదన్నారు. సకలజనుల సమ్మె, మిలియన్ మార్చ్ పునరావృతం అవుతాయన్నారు. నేటి బంద్‌కు వ్యాపార, విద్యాసంస్థల యాజమానులు సహకరించాలన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రౌతు కనకయ్య, ఆ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి డి.ఆంజనేయులు, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు సామ మాణిక్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, పాండు, శర్వలింగం, నర్సింహులు పాల్గొన్నారు. హోరెత్తిన నినాదాలు రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్య తిరేకిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీకి వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు భారీగా తరలివచ్చారు. స్థానిక హైదరాబాద్- బీజాపూర్ ప్రధాన రహదారి గుండా ర్యాలీ కొనసాగింది. విద్యార్థులు ‘జై తెలంగాణ.. జైజై తెలంగాణ’ నినాదాలతో హోరెత్తించారు. విద్యార్థి జేఏసీ నాయకులు రాఘవేందర్‌రెడ్డి, ఫయాజ్, నరేందర్ ర్యాలీకి ప్రాతినిథ్యం వహించారు. -
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యం: నాగేందర్ గౌడ్
తాండూరు టౌన్ : సీమాంధ్ర ప్రాంత నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా, అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటవడం తథ్యమని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2009 నవంబర్ 29వ తేదీన ఆమరణ నిరాహార దీక్షను చేపట్టిన రోజును పురస్కరించుకుని శుక్రవారం పార్టీ ఆధ్వర్యంలో దీక్షా దివస్ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నాగేందర్‌గౌడ్ మాట్లాడుతూ నాటి కేసీఆర్ ఆమరణ దీక్ష ఫలితమే నేడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడమే మిగిలిందని, ఇక సీమాంధ్రుల కుట్రలు సాగవని అన్నారు. టీఆర్ఎస్ జిల్లా సలహాదారు రంగారావు మాట్లాడుతూ యువత బలిదానం, కేసీఆర్ రాజీలేని పోరాటం, ప్రజల అండదండలతో తెలంగాణ రాష్ట్రం సాధించుకోబోతున్నామన్నారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు జిల్లా ప్రభుత్వాస్పత్రికి వెళ్లి రోగులకు పండ్లు, బ్రెడ్లు అందజేశారు. -
పంచాయతీల విలీనాన్ని నిరసిస్తూ 24 గంటల దీక్ష
అనంతగిరి, న్యూస్‌లైన్: జిల్లాలోని శివారు పంచాయతీలను గ్రేటర్లో విలీనానికి నిరసనగా ఈ నెల 20న (శుక్రవారం) నార్సింగిలోని అంబేద్కర్ చౌరస్తాలో ఉదయం 8 గంటలకు 24 గంటల నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్ గౌడ్ తెలిపారు. బుధవారం ఆయన వికారాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. జిల్లా ఉనికి లేకుండా చేయాలనే కుట్రలో భాగంగానే సీఎం కిరణ్ 36 గ్రామ పంచాయతీలను గ్రేటర్ కలిపారని ఆరోపించారు. గ్రేటర్‌కు సమీపంలోని మణికొండను విలీనం చేయకుండా వదిలేయడంలో ఆంతర్యమేంటని ఆయన ప్రశ్నించారు. ఆ ప్రాంతంలో లగ డపాటి ల్యాంకో హిల్స్, రాయపాటి ఆస్తులుండడమే కారణమన్నారు. తమకు నష్టం వాటిల్లుతుందనే వీరంతా కుమ్మక్కయ్యారన్నారు. విలీన జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో జరిగే పరిణామాలకు జిల్లాకు చెందిన కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. 20నజరిగే నిరసన కార్యక్రమానికి తెలంగాణ వాదులు వేలాదిగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.