పాల్మాకుల (శంషాబాద్ రూరల్), న్యూస్‌లైన్: సంపూర్ణ తెలంగాణ సాధనకే పాదయాత్ర ప్రారంభించినట్టు టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్ పేర్కొన్నారు. శంషాబాద్ మం డలం పాల్మాకులలో శుక్రవారం ‘సంపూర్ణ తెలంగాణ సాధన’ పేరుతో ఆయ న పాదయాత్రను ప్రారంభిం చారు. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్ నాయకుడు, ఎమ్మెల్సీ స్వామిగౌడ్, పార్టీ కేంద్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు కే.కేశవరావు హాజరయ్యారు. పాదయాత్రకు ముందు స్థానిక శ్రీహనుమాన్ ఆలయంలో ప్రత్యే క పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి, పాదయా త్ర చేపట్టారు. ఈ సందర్భంగా నాగేందర్‌గౌడ్ మాట్లాడుతూ ఎలాంటి ఆంక్షలులేని తెలంగాణ సాధనే టీఆర్‌ఎస్ లక్ష్యమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయ వారసత్వాలకు స్వస్తి పలుకుతూ అమరుల కుటుంబాలు, తెలంగాణ ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యం కల్పించాలన్నారు. అమరుల కుటుంబాలకు రూ.10 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి అన్ని విధాలా ఆదుకుం టామని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారని తెలిపారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తున్నట్టు చెప్పారు.
తెలంగాణను అమ్మ ఇచ్చిం దంటూ బస్సు యాత్ర, జైత్రయాత్ర చేపడుతున్న కాంగ్రెస్ నాయకులు ఆనాడు విద్యార్థులపై కేసులు పెట్టినప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. అక్రమ కేసులను ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని పాల్మాకుల నుంచి వట్టినాగులపల్లి వరకు నాలుగు రోజులపాటు 80కి.మీ.పాదయాత్ర కొనసాగుతుందన్నారు. మొదటి రోజు పా ల్మాకుల నుంచి శంషాబాద్ పట్టణం వరకు 18 కి.మీ.యాత్ర పూర్తి చేశారు. యాత్రకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మహిళలు, కార్మికులు మద్ద తు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ చేవె ళ్ల పార్లమెంటు ఇన్‌చార్జి విశ్వేశ్వర్‌రెడ్డి, నాయకులు పురుషోత్తంరావు, స్వప్న, రోహిత్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, ఆంజనేయు లు, మోహన్‌రావు, అశోక్, ఆనంద్, హ రికృష్ణ, రమేష్, శ్రీపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌వీ నాయకులు శ్రీనివాస్ పాల్గొన్నారు.
సంపూర్ణ తెలంగాణ సాధనకే పాదయాత్ర
Published Fri, Jan 17 2014 11:54 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement