ఆ స్థలం కొట్టేయడానికేనా?
పీఏసీ కమిటీ చైర్మన్ భూమా ఆగ్రహం
బేపార్కు పూర్తిచేయకపోవడంపై అసంతృప్తి
విశాఖపట్నం : హోటల్ పేరుతో స్థలాన్ని కొట్టేయడానికా? ఏళ్ల గడిచినా నిర్మాణం పూర్తి చేయలేదు? సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా హోట ల్ నిర్వహించాలని స్థలం కేటాయిస్తే.. కోటీశ్వరుల కోసం ప్రణాళిక వేస్తారా..? అంటూ బేపార్కు యాజమాన్యంపై ఏపీ శాసన సభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. శాసన సభ్యుడు భూమా నాగిరెడ్డి చైర్మన్గా ఉన్న ఈ కమిటీ శుక్రవారం నగరంలో పర్యాటక ప్రాంతాల పరిశీలన లో భాగంగా రుషికొండ దరి బేపార్కు ను సందర్శించింది. ఇక్కడ నిర్మాణం ఏ దశలో ఉందో, దీని తీరు పరిశీలించింది. అనంతరం ఈ కమిటీ టూరిజిం అధికారులు, బే పార్కు యాజమాన్యంతో సమావేైశమెంది. 2007లో పూర్తి చేయాల్సిన ఈ నిర్మాణంలో ఎందుకు ఇంత జాప్యం జరిగిందని కమిటీ సభ్యులు యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం తమ వద్ద నిధులు కొరతగా ఉండడం వల్ల జాప్యం జరుగుతోందని బేపార్కు ప్రతినిధి సూరి వివరించారు.
దీనికి స్పందించిన కమిటీ చైర్మన్ భూమా నాగిరెడ్డి మాట్లాడుతూ మీ మాటలు వింటుంటే పార్కు పేరుతో స్థలాన్ని కొట్టేయడానికేనని అర్ధమవుతోందన్నా రు. సుమారు 15 ఏళ్లుగా డబ్బులు చాలవని, రోడ్లు లేవని చెప్పి నిర్మాణం పూర్తి చేయడంలో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపై హో టల్ ఏర్పాటుచేస్తే రోడ్డు నిర్మించాల్సి ఉంటుందని, డబ్బులు ఖర్చుచేయాల్సి ఉంటుందని, సౌకర్యాలు కల్పించాలని అవగాహన లేదా అంటూ ప్రశ్నించారు. కాటేజీలు, సూట్స్, జిమ్, స్విమ్మింగ్ పూల్, విటర్ రైడ్స్, హెల్త్ క్లబ్ లాంటివి సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటాయా? అని ప్రశ్నించారు. ప్రభు త్వ స్థలం తీసుకొని కోటీశ్వరుల కోసం నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ నిలదీశారు. ఎమ్మెల్సీ పమిడి శమంతకమణి కలగుజేసుకొని ఇక్కడ టూరిజం విభాగం అధికారులలో సమర్థత లేదన్నారు.
ఏడేళ్లలో పూర్తి కావల్సిన బేపార్కును 15 ఏళ్లు గడిచినా పూర్తి చేయించుకోలేకపోయారంన్నా రు. ఇక్కడ అధికారుల లోపం వల్లే ఈ పార్కు ఇంతవరకు పూర్తి కాలేదని మండిపడ్డారు. పర్యటనలో పీవీజీఆర్ నాయుడు, పి.విష్ణుకుమార్రాజు, ఎమ్మెల్సీ శర్మ తదితరులు పాల్గొన్నారు.