అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు
నల్లగొండ :నక్కలగండి ప్రాజెక్టు పనులకు అం తరాయం కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నక్కల గండి తండాను ముంపు ప్రాం తంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, భూ సేకరణలో భాగంగా నిర్వాసితులకు ప్రభు త్వ నియమ నిబంధనల మేరకు పరిహారం అం దించినట్లు తెలిపారు. ఇంకా మిగిలిన నిర్వాసితులకు కూడా పరి హారం అందిస్తామన్నారు. మంగళవారం తన చాంబర్లో నక్కలగండి ప్రాజెక్టు పనులపై దేవరకొండ శాసనసభ్యులు రవీంద్రనాయక్, ఇరిగేషన్, భూసేకరణ, రెవె న్యూ అధికారులతో చర్చించారు.
పెద్ద అడిశర్లపల్లి మండలం అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద భూ సేకరణ చేసిన పెద్ద అడిశర్లపల్లి, అక్కంపల్లి నిర్వాసితులకు ఇంకా చెల్లించాల్సిన పరి హారం గురించి స్థానిక ఎమ్మెల్యే సం బంధిత బాధితులను జేసీ వద్దకు తీసుకొని వచ్చారు. దాంతో నక్కలగండి ప్రాజెక్టుకు సం బంధించి కావాల్సిన మొత్తం విస్తీర్ణం, ఇప్పటి వరకు చేసిన భూసేకరణ, అవసరమైన వివరాలను సమగ్రంగా సమర్పించాలని ఆర్డీఓ, భూసేకరణ అధికారులకు జేసీ ఆదేశిం చారు. పెద్దఅడిశర్లపల్లి మండలం దుగ్యాల గ్రామంలోని ప్రభుత్వ భూ ముల వివరాలను వెంటనే సమర్పించాలని ఇరిగేషన్ ఎస్ఈని ఆదేశించారు.
సమస్యల ఏకరువు..
ఈ సందర్భంగా శాసనసభ్యుడు రవీంద్రకుమార్ పెద్దఅడిశర్లపల్లి, అక్కంపల్లి, సింగరాజుపల్లి, గొట్టిముక్కల గ్రామాల్లోని ప్రజల సమస్యలను జేసీ దృష్టికి తెచ్చారు. శ్మశానవాటిక, దేవాలయ నిర్మాణం, బీసీ కాలనీ ప్రజలకు మౌలిక వసతుల కల్పన, మత్య్సకారుల సమస్యలు, కమ్యూనిటీహాలు నిర్మాణం పనులు సాధ్యమైనంత త్వరలో పూర్తి చేయించాలని ఎమ్మెల్యే కోరారు. దీనిపై జాయింట్ కలెక్టర్ స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో పెద్దఅడిశర్లపల్లి జెడ్పీటీసీ స్పందనారెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రభాకర్ శ్రీనివాస్, దేవరకొండ ఆర్డీఓ కె.గంగాధర్, ఇరిగేషన్ ఎస్ఈ సాయిబాబా, డీఈలు నర్సింగ్‌రాజ్, చక్రపాణి, ఈఈ కరుణాకర్‌రెడ్డి, లాండ్‌సర్వే ఏడీ శ్రీనివాస్, దేవరకొండ, చందంపేట తహసీల్దార్లు డి.గణేష్, యాకూబ్, పెద్ద అడిశర్లపల్లి డిప్యూటీ తహసీల్దార్లు ఎండీ అర్షద్, జ్యోతి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
వారంలోగా నివేదిక పంపాలి
భూ నిర్వాసితులకు సంబంధించి ఎంత మందికి స్థలాలు ఇచ్చారు, ఇంకా ఎంత మందికి ఇవ్వాలి, కేటాయించని వారిలో అర్హతలున్నవారు ఎంత మంది ఉన్నారు అనేది పరిశీలించి వారం రోజుల్లో నివేదికను సమర్పించాలని జేసీ ఆదేశించారు. నిర్వాసితులతో ఆయన మాట్లాడుతూ 129 సర్వే నంబర్ నోటీపై చేసిన దానితో పాటు ఇంకా గుర్తించాల్సి ఉందని, ఇప్పటికే గుర్తించిన దాంట్లో బత్తాయి తోటలు కోల్పోయిన వారి బోర్లు, పైపులైనులకు పరిహారం అందించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఎవ్వరూ చట్టాన్ని ఉల్లంఘించరాదని, న్యాయబద్ధంగాతమ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ప్రాజెక్టు భూసేకరణకుసంబంధించిఇంకా పెండింగ్‌లో ఉన్న పరిహారం చెల్లింపునకు ఉన్నతాధికారుల అనుమతులకు ప్రతిపాదనలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పునరావాసం కింద ఇచ్చిన ప్లాటుతో పాటు అదనంగా మరో స్థలంకబ్జాకు గురైందని, ఇప్పటివరకు అసలు పునరావాసం పొందనివారికి ప్రాధాన్యతనివ్వాలని సంబంధిత అధికారులకు జాయింట్‌కలెక్టర్ ఆదేశించారు.