Nallabelli
-
దొంగనుకుని సర్పంచ్‌కు దేహశుద్ధి
సాక్షి, వరంగల్: దొంగగా భావించిన గ్రామస్తులు సర్పంచ్‌కు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మామిండ్లవీరయ్యపల్లిలో శుక్రవారంరాత్రి చోటుచేసుకుంది. మామిండ్లవీరయ్యపల్లిలో పెంతల సాంబరెడ్డి, యార రవి మధ్య ఇంటిస్థలం విషయమై కొద్దిరోజులుగా వివాదం నడుస్తోంది. దీనిపై గ్రామపెద్దల సమక్షంలో శుక్రవారం పంచాయితీ పెట్టారు. అనంతరం రాత్రిపూట ఇరువర్గాల పెద్దమనుషులు వేర్వేరుగా దావత్ చేసుకున్నారు. సర్పంచ్ అమరేందర్‌తోపాటు పలువురు మాటుకాసి సాంబరెడ్డి పెద్దమనుషుల దావత్ దృశ్యాలను మొబైల్లో రికార్డు చేస్తుండగా పలువురు గమనించారు. ‘దొంగ, దొంగా’అని అరుస్తూ సర్పంచ్‌పై దాడి చేసి గాయపరిచారు. ఈ మేరకు శనివారం స్థానిక పోలీసులకు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. -
రిజిస్ట్రేషన్ చేయకుంటే పెట్రోల్ పోస్తాం.. తహసీల్దార్‌కు బెందిరింపులు..
సాక్షి, వరంగల్: ‘భూమి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు స్లాట్ బుక్ చేసుకున్నాం.. రిజిస్ట్రేషన్ చేయండి.. లేదంటే నీపై పెట్రోల్‌పోసి చంపుతాం’ అని పోలీసుల సాక్షిగా కొందరు తహసీల్దార్‌ను బెదిరించారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగింది. బాధిత తహసీల్దార్ దూలం మంజుల తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బిల్‌నాయక్‌తండాకు గుగులోత్ పద్మ అనే మహిళ భూమి రిజిస్ట్రేషన్ చేయాలని స్లాట్ బుక్ చేసుకుంది. ఈ భూమిపై బ్యాంకు లోన్ తీసుకున్నట్లు గుర్తించారు. అంతే కాకుండా పేపర్లు సక్రమంగా లేకపోవడంతో రిజిస్ట్రేషన్ చేసేందుకు నిరాకరిస్తూ బ్యాంక్ నుంచి నోడ్యూస్ సర్ఠిఫికెట్ తీసుకురావాలని సూచించారు. ఈ విషయాన్ని పద్మ వారి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో బిల్‌నాయక్‌తండాకు చెందిన కొందరు వ్యక్తులు సోమవారం సాయంత్రం తహసీల్దార్ కార్యాలయంలోకి ప్రవేశించి ‘స్లాట్ బుక్ చేసుకున్నాం..రిజిస్ట్రేషన్ చేయండి.. నోడ్యూస్ ఎందుకు తీసుకురావాలి’అంటూ నిలదీశారు. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కార్యాలయానికి చేరుకోగా, వారి ముందే రిజిస్ట్రేషన్ చేయకపోతే నీపై పెట్రోల్ పోసి చంపేస్తామని తహసీల్దార్‌ను నానా దుర్భాషలాడారు. నల్లబెల్లి నుంచి నువ్వు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని, లేకుంటే నిన్ను చంపి జైలుకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని భయభ్రాంతులకు గురిచేసినట్లు తహసీల్దార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె తెలిపారు. చదవండి: రేవంత్‌కు సిట్ నోటీసులు.. మరోసారి కౌంటర్ -
సూర్యం దళాన్ని చుట్టుముట్టిన పోలీసులు..!
-
సూర్యం దళాన్ని చుట్టుముట్టిన పోలీసులు..!
సాక్షి, వరంగల్ : సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీకి చెందిన మావోయిస్టు సూర్యం దళాన్ని నల్లబెల్లి మండలం కొండాపూర్ శివారు గణేశ్(మురళి)నగర్ వద్ద పోలీసులు గురువారం ఉదయం చుట్టుముట్టారు. దళ సభ్యుడు లక్ష్మణ్, మరో ఇద్దరు సానుభూతి పరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనున్న సమాచారం మేరకు మిగతా దళ సభ్యుల కోసం గాలింపు చేపట్టారు. ఏసీపీ సునీతామోహన్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. కాగా, మావోయిస్టులను చుట్టుముట్టే క్రమంలో పోలీసులను గ్రామస్తులు అడ్డుకున్నట్లు తెలిసింది. (ఇన్ఫార్మర్ నెపంతో రైతు హత్య) -
వరద ఉధృతితో వాగులో పడ్డ ఆర్టీసీ బస్సు
-
అదుపుతప్పి వాగులో పడ్డ ఆర్టీసీ బస్సు
వరంగల్: వరంగల్ జిల్లా నల్లబెల్లి వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలతో పొంగిపొర్లుతున్న మద్దెల వాగులో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నట్టు సమాచారం. బ్రిడ్జ్ పై నుంచే వాగు పొంగి పొర్లడంతో డ్రైవర్ రోడ్డును సరిగా అంచనా వేయలేకపోవడంతో ప్రమాదం జరిగింది. ఈ సంఘన జరిగిన సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ ప్రమాదాన్ని వీడియో తీశాడు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తివివరాలు తెలియాల్సిఉంది. -
ఒకేరోజు రెండు ఇళ్లలో చోరీ
మరో రెండిళ్లలో విఫలయత్నం సీసీ కెమెరాలు, డీవీఎల్ ధ్వంసం ద్విచక్ర వాహనం అపహరణ నల్లబెల్లి : మండల కేంద్రంలో రెండు ఇళ్లలో దొంగతనం చేయడంతో పాటు మరో రెండిళ్లలో చోరీకి విఫలయత్నం చేసిన ఘటన బుధవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలో నివాసం ఉంటున్న ఉపాధ్యాయుడు పొగాకు అచ్చయ్య వారం రోజుల క్రితం తన స్వగ్రామం నందిగామకు కుటుంబ సభ్యులతోSకలిసి వెళ్లారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక దుండగులు తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. తమను గుర్తించకుండా సీసీ కెమెరాలు, డీవీఎల్, హార్డ్‌డిస్క్, ఎల్ఈడీ మానిటర్లను ధ్వంసం చేశారు. బీరువా తాళాలు తీసి బట్టలు చిందరవందరడగా పడేసి, అందులోని మూడుజతల పట్టా గొలుసులు, మూడు వెండి బిల్లలను ఎత్తుకెళ్లారు. ఇంట్లోని వస్తువులను చెల్లాచెదురుగా పడేశారు. ఆ తర్వాత స్థానిక ఫొటో స్టుడియో యజమాని జనగాం నాగేశ్వర్, బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు గుమ్మడి వేణు ఇళ్ల ఆవరణలో ఉన్న రెండు ద్విచక్ర వాహనాలను తీసుకెళ్లారు. కొద్దిదూరం వెళ్లాక వేణు బైక్(హీరోహోండా గ్లామర్) స్టార్ట్ కాకపోవడంతో అక్కడే వదిలేసి నాగేశ్వర్రావు బైక్ (హోండా శైన్) అపహరించారు. బొద్దుల కృష్ణ, పెద్ది రామన్న ఇళ్లలోనూ చోరీకి విఫలయత్నం చేశారు. బుధవారం ఉదయం చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించిన ఎస్సై రాజమౌళి బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించారు. నాగేశ్వర్రావు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ముదిరిన ‘కరెంట్ పంచారుుతీ’
గ్రామ పంచాయతీ కరెంటు బిల్లు చెల్లించలేదని కరెంటోళ్లు 15 రోజుల క్రితం గుండ్లపహాడ్‌లోని మంచి నీళ్ల బావులకు కరెంట్ కట్ చేశారు. అప్పటి నుంచి స్థానికులు చేతి పంపు నుంచి వస్తున్న చిలుం నీళ్లు తాగి బతుకుతున్నారు. నల్లబెల్లి మండలంలో 18 గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రజల పరిస్థితి ఇలానే ఉంది. గుండ్లపహాడ్తోపాటు శివారులోని పెద్దతండా, గాంధీనగర్ పరిధిలోని ప్రజలు మంచినీటికి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. - నల్లబెల్లి హన్మకొండ అర్బన్ : గ్రామ పంచాయతీ(జీపీ)లకు సంబంధించి విద్యుత్ బిల్లుల పంచారుుతీ ముదిరి పాకాన పడింది. విద్యుత్, పంచాయతీ శాఖ అధికారుల పంతాలతో లొల్లి తారాస్థారుుకి చేరింది. ఇరు శాఖల పట్టింపులతో పలు గ్రామాల ప్రజలు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారు. మంచినీటికి తండ్లాడుతున్నారు. రూ.కోట్లలో బకారుులు పేరుకుపోవడంతో కరెంట్ అధికారులు.. పంచాయతీల పరిధిలోని తాగునీటి వనరులు, వీధిలైట్ల కనెక్షన్లను నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. వీధిలైట్లకూ సరఫరా నిలిపివేస్తుండడంతో గ్రామాలు చీకట్లో మగ్గుతున్నారుు. 2009లో రూ.6.50 లక్షలతో మొదలైన బకాయిల పరంపర నానాటికి పెరుగుతూ 2014 అక్టోబర్ వరకు రూ.66.78 కోట్లకు చేరింది. బకాయిల చెల్లింపు విషయంలో నిధుల లేమితో పంచాయతీ అధికారులు వారుుదాలు వేస్తూ రావడం.. సమస్య తీవ్రమైనప్పుడు కలెక్టర్ జోక్యం చేసుకుని సర్దిచెప్పడం ఇంతకాలం జరిగింది. కానీ.. ఇటీవల విద్యుత్ శాఖ అధికారులు కఠినంగా వ్యహరిస్తున్నారు. పలు గ్రామ పంచాయతీల్లో వీధిలైట్లు, నీటి వనరులకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేశారు. దీంతో పల్లె ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే గ్రామాల్లో తాగునీటికి కష్టాలు తీవ్ర రూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వానికి నివేదిక అందజేత జిల్లాలోని 962 గ్రామ పంచాయతీల పరిధిలో తాగునీటి అవసరాలు, వీధి దీపాలకు సంబంధించి ఏడాదికి రూ.30 కోట్లు ఖర్చు అవుతాయిని పంచాయతీ అధికారుల అంచనా. 2009 నుంచి 2014 అక్టోబర్ వరకు పాత బకాయిలు రూ.9.36 కోట్లతో కలుపుకుని పంచాయతీల బకాయిలు రూ.98.16 కోట్లు కాగా.. ఇటీవల సుమారు రూ.31.38 కోట్లు చెల్లించారు. ఇంకా రూ.66.78 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నారుు. ప్రస్తుతం పంచాయతీల్లో ఎస్ఎఫ్సీ, టీఎఫ్సీ నిధులు అందుబాటులో ఉన్నాయి. కానీ.. పలు సమస్యలతో చెల్లించకపోవడంతో విద్యుత్ శాఖ అధికారులు కనెక్షన్లను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. అరుుతే పంచాయతీలకు సంబంధించి కరెంట్ బిల్లులపై డీపీఓ ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు సమాచారం. బిల్లుల చెల్లింపులో ఇబ్బందులను పంచాయతీలవారీగా సేకరించి సర్కారుకు అందజేశారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో మోటార్లు, వీధిలైట్ల వాడకానికి సంబంధించి కరెంట్ మీటర్లు బిగించ లేదని, వీటికి విద్యుత్ అధికారులు సరాసరి బిల్లులు వేశారని, కాకిలెక్కలతో పంచాయతీలకు వాడకం కన్నా బిల్లు ఎక్కువగా వచ్చిందని, అదనపు వసూళ్లు కూడా బిల్లులో ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో సర్కారు ఆదేశాల కోసం జిల్లా పంచాయతీ అధికారులు వేచిచూస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వమే చెల్లించడమా.. పంచాయతీలకు సంబంధించి బకారుులను విడతలవారీగా చెల్లింపులు చేసేలా ఉత్తర్వులు జారీ చేయడమా.. విద్యుత్ శాఖ దూకుడుకు కళ్లెం వేసేందుకు పంచాయతీ శాఖ ప్రభుత్వాన్ని ఆశ్రరుుంచినట్లు పంచాయతీ రాజ్ ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మీటర్లు లేని వాటికి విద్యుత్ సిబ్బంది అడ్డగోలు బిల్లులు వేయడం వల్లే పంచాయతీ శాఖ వెంట వెంటనే చెల్లించకపోవడానికి ఓ కారణమని వారు చెబుతున్నారు. వైఎస్ హయాంలో ప్రభుత్వమే.. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పంచాయతీల విద్యుత్ బకాయిలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరిగింది. అప్పట్లో సర్పంచ్ల విజ్ఞప్తి మేరకు పంచాయతీలకు వచ్చే 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి మొత్తం విద్యుత్ బకాయిలు చెల్లించడంతో సమస్య పరిష్కారమైంది. అయితే.. ఆ తర్వాత పంచాయతీకు పరోక్షంగా ఇబ్బందులు వస్తాయని భావించారు. దీంతో నిధులను పంచాయతీలకే పంపిణీ చేసి.. వాటి నుంచి బిల్లులు కట్టుకోవాలని ఆదేశాలిచ్చారు.