ముదిరిన ‘కరెంట్ పంచారుుతీ’ | current problems | Sakshi
Sakshi News home page

ముదిరిన ‘కరెంట్ పంచారుుతీ’

Published Thu, Dec 4 2014 2:57 AM | Last Updated on Wed, Sep 5 2018 3:44 PM

ముదిరిన ‘కరెంట్ పంచారుుతీ’ - Sakshi

ముదిరిన ‘కరెంట్ పంచారుుతీ’

గ్రామ పంచాయతీ కరెంటు బిల్లు చెల్లించలేదని కరెంటోళ్లు 15 రోజుల క్రితం గుండ్లపహాడ్‌లోని మంచి నీళ్ల బావులకు కరెంట్ కట్ చేశారు. అప్పటి నుంచి స్థానికులు చేతి పంపు నుంచి వస్తున్న చిలుం నీళ్లు తాగి బతుకుతున్నారు. నల్లబెల్లి మండలంలో 18 గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రజల పరిస్థితి ఇలానే ఉంది.  గుండ్లపహాడ్‌తోపాటు శివారులోని పెద్దతండా, గాంధీనగర్ పరిధిలోని ప్రజలు మంచినీటికి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.        
  - నల్లబెల్లి
 
 హన్మకొండ అర్బన్ : గ్రామ పంచాయతీ(జీపీ)లకు సంబంధించి విద్యుత్ బిల్లుల పంచారుుతీ ముదిరి పాకాన పడింది. విద్యుత్, పంచాయతీ శాఖ అధికారుల పంతాలతో లొల్లి తారాస్థారుుకి చేరింది. ఇరు శాఖల పట్టింపులతో పలు గ్రామాల ప్రజలు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారు. మంచినీటికి తండ్లాడుతున్నారు. రూ.కోట్లలో బకారుులు పేరుకుపోవడంతో కరెంట్ అధికారులు.. పంచాయతీల పరిధిలోని తాగునీటి వనరులు, వీధిలైట్ల కనెక్షన్లను నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. వీధిలైట్లకూ సరఫరా నిలిపివేస్తుండడంతో గ్రామాలు చీకట్లో మగ్గుతున్నారుు. 2009లో రూ.6.50 లక్షలతో   మొదలైన బకాయిల పరంపర నానాటికి పెరుగుతూ 2014 అక్టోబర్ వరకు రూ.66.78 కోట్లకు చేరింది. బకాయిల చెల్లింపు విషయంలో నిధుల లేమితో పంచాయతీ అధికారులు వారుుదాలు వేస్తూ రావడం.. సమస్య తీవ్రమైనప్పుడు కలెక్టర్ జోక్యం చేసుకుని సర్దిచెప్పడం ఇంతకాలం జరిగింది. కానీ.. ఇటీవల విద్యుత్ శాఖ అధికారులు కఠినంగా వ్యహరిస్తున్నారు. పలు గ్రామ పంచాయతీల్లో వీధిలైట్లు, నీటి వనరులకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేశారు. దీంతో పల్లె ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే గ్రామాల్లో తాగునీటికి కష్టాలు తీవ్ర రూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
ప్రభుత్వానికి నివేదిక అందజేత

జిల్లాలోని 962 గ్రామ పంచాయతీల పరిధిలో తాగునీటి అవసరాలు, వీధి దీపాలకు సంబంధించి ఏడాదికి రూ.30 కోట్లు ఖర్చు అవుతాయిని పంచాయతీ అధికారుల అంచనా. 2009 నుంచి 2014 అక్టోబర్ వరకు పాత బకాయిలు రూ.9.36 కోట్లతో కలుపుకుని పంచాయతీల బకాయిలు రూ.98.16 కోట్లు కాగా.. ఇటీవల సుమారు రూ.31.38 కోట్లు చెల్లించారు. ఇంకా రూ.66.78 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నారుు. ప్రస్తుతం పంచాయతీల్లో ఎస్‌ఎఫ్‌సీ, టీఎఫ్‌సీ నిధులు అందుబాటులో ఉన్నాయి. కానీ.. పలు సమస్యలతో చెల్లించకపోవడంతో విద్యుత్ శాఖ అధికారులు కనెక్షన్లను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. అరుుతే పంచాయతీలకు సంబంధించి కరెంట్ బిల్లులపై డీపీఓ ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు సమాచారం. బిల్లుల చెల్లింపులో ఇబ్బందులను పంచాయతీలవారీగా సేకరించి సర్కారుకు అందజేశారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో మోటార్లు, వీధిలైట్ల వాడకానికి సంబంధించి కరెంట్ మీటర్లు బిగించ లేదని, వీటికి విద్యుత్ అధికారులు సరాసరి బిల్లులు వేశారని, కాకిలెక్కలతో పంచాయతీలకు వాడకం కన్నా బిల్లు ఎక్కువగా వచ్చిందని, అదనపు వసూళ్లు కూడా బిల్లులో ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో సర్కారు ఆదేశాల కోసం జిల్లా పంచాయతీ అధికారులు వేచిచూస్తున్నట్లు సమాచారం.

ప్రభుత్వమే చెల్లించడమా.. పంచాయతీలకు సంబంధించి బకారుులను విడతలవారీగా చెల్లింపులు చేసేలా ఉత్తర్వులు జారీ చేయడమా.. విద్యుత్ శాఖ దూకుడుకు కళ్లెం వేసేందుకు పంచాయతీ శాఖ ప్రభుత్వాన్ని ఆశ్రరుుంచినట్లు పంచాయతీ రాజ్ ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మీటర్లు లేని వాటికి విద్యుత్ సిబ్బంది అడ్డగోలు బిల్లులు వేయడం వల్లే పంచాయతీ శాఖ వెంట వెంటనే చెల్లించకపోవడానికి ఓ కారణమని వారు చెబుతున్నారు.

వైఎస్ హయాంలో ప్రభుత్వమే..

అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పంచాయతీల విద్యుత్ బకాయిలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరిగింది. అప్పట్లో సర్పంచ్‌ల విజ్ఞప్తి మేరకు పంచాయతీలకు వచ్చే 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి మొత్తం విద్యుత్ బకాయిలు చెల్లించడంతో సమస్య పరిష్కారమైంది. అయితే.. ఆ తర్వాత పంచాయతీకు పరోక్షంగా ఇబ్బందులు వస్తాయని భావించారు. దీంతో నిధులను పంచాయతీలకే పంపిణీ చేసి.. వాటి నుంచి బిల్లులు కట్టుకోవాలని ఆదేశాలిచ్చారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement