వరంగల్: వరంగల్ జిల్లా నల్లబెల్లి వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలతో పొంగిపొర్లుతున్న మద్దెల వాగులో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నట్టు సమాచారం. బ్రిడ్జ్ పై నుంచే వాగు పొంగి పొర్లడంతో డ్రైవర్ రోడ్డును సరిగా అంచనా వేయలేకపోవడంతో ప్రమాదం జరిగింది. ఈ సంఘన జరిగిన సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ ప్రమాదాన్ని వీడియో తీశాడు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తివివరాలు తెలియాల్సిఉంది.