Nandanam area
-
మదర్ ఫెయిర్
‘మనసు ఉంటే మార్గమూ ఉంటుంది’. చెన్నై బుక్ ఫెయిర్ ఈ నానుడిని నిజం చేస్తోంది. కోవిడ్ కారణంగా ఇల్లు కదలని వాళ్లు కూడా బుక్ ఫెయిర్‌కు వస్తున్నారు. ఫిబ్రవరి 24వ తేదీ మొదలైన ఈ బుక్ ఫెయిర్ మార్చి తొమ్మిది వరకు కొనసాగుతుంది. చెన్నైలోని నందనం, వైఎమ్‌సీఏలో ఏడు వందల స్టాళ్లతో మొదలైన ఈ బుక్ ఫెయిర్‌లో వేలాది పుస్తకాలున్నాయి. సాధారణంగా బుక్ ఫెయిర్‌లో పుస్తకప్రియులతోపాటు రచయిత లు ఎక్కువగా కనిపిస్తుంటారు. ఈ దఫా కూడా రచయితలు తమ పుస్తకాల పట్ల పాఠకుల రెస్పాన్స్ తెలుసుకోవడం కోసం రోజూ బుక్ ఫెయిర్ కు వస్తున్నారు. అయితే ఈ ఏడాది ప్రత్యేకం ఏమిటంటే... పేరెంట్స్ తమ పిల్లలను బుక్ ఫెయిర్‌కు తీసుకురావడం. పేరెంట్స్‌లో కూడా తల్లులే అధికంగా కనిపిస్తున్నారు. కోవిడ్ కారణంగా ఏడాది నుంచి గడపదాటలేదు. ఆన్లైన్ క్లాసుల్లో పాఠాలతో పిల్లలు విసిగిపోతున్నారు. వాళ్లకు నచ్చే పుస్తకాలు కొనిద్దామని తీసుకువచ్చామని చెబుతున్నారు బుక్ ఫెయిర్‌కి పిల్లలతో వచ్చిన తల్లులు. ‘ఈ కోవిడ్ విరామం పిల్లలకు ఇష్టమైన పుస్తకాలు చదువుకోవడానికి బాగా ఉపకరిస్తుంది. మనకు నచ్చినవి కొనుక్కుని వెళ్లి వీటిని చదవండి అంటే పిల్లలకు చదవాలనే ఆసక్తి కలగదు. వాళ్లనే తీసుకు వచ్చి చూపించినట్లయితే తమకు ఇష్టమైన వాటినే ఎంచుకుంటారు, ఇష్టంగా చదువుతారు కూడా’ అన్నారు తన ఇద్దరు పిల్లలతో బుక్ ఫెయిర్ కొచ్చిన రాజి. బుక్ ఫెయిర్‌లో జనసమ్మర్ధం విపరీతంగా ఉంటుందేమోనని రావడానికి కొంచెం భయపడ్డాం. కానీ ఇక్కడ ఎప్పుడూ ఉండే రష్ లేదు. మాస్కు లేకుండా వచ్చిన వాళ్లను వెనక్కి పంపించకుండా ఇక్కడ మాస్కు ఇస్తున్నారు. శానిటైజర్ కూడా అందుబాటులో ఉంచారు. నిర్వహకులు కోవిడ్ ప్రోటోకాల్ కచ్చితంగా పాటిస్తున్నారు. దాంతో ధైర్యంగా ఎక్కువ సమయం ఉండగలుగుతున్నాం. కొత్త పుస్తకాలను కూడా డిస్కౌంట్లో ఇస్తున్నారు. దాంతో నాలుగు కొనాలనుకున్న వాళ్లు కూడా మరో రెండు ఎక్కువగా తీసుకుంటున్నాం’ అన్నారామె. చెన్నై బుక్ ఫెయిర్‌లో షాపింగ్ -
బైకులు ఢీ; బస్సు కిందపడి ఇద్దరమ్మాయిల దుర్మరణం
సాక్షి, చెన్నై : నగరంలోని నందనంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థినులు ప్రాణాలు విడిచారు. వివరాలు.. రాజమండ్రికి చెందిన భవానీ, నాగలక్ష్మీ, శివ ఇంజనీరింగ్ చదువుతున్నారు. మంగళవారం ముగ్గురూ ఒకే బైక్‌పై తాంబారంలోని కాలేజీకి వెళ్తున్న క్రమంలో వెనుకనుంచి మరో బైక్ బలంగా ఢీకొట్టింది. బైక్‌తో సహా ముగ్గరూ వెనకే వస్తున్న బస్సు కిందపడిపోయారు. బస్సు చక్రాలకింద నలిగి భవానీ, నాగలక్ష్మీ అక్కడికక్కడే ప్రాణాలో కోల్పోగా శివకు తీవ్రగాయాలయ్యారు. వీరి బైక్‌ను ఢీకొట్టిన వ్యక్తి కూడా గాయాలపాలయ్యాడు. ఇద్దరినీ తాంబారం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. శివ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. సమీపంలో ఉన్న సీసీటీవీలో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. -
వణుకుతున్న చెన్నై వాసులు
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో వరుస హత్యలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇన్ఫోసిస్ ఉద్యోగి స్వాతి దారుణ హత్యాకాండను మరవకముందే మరో కిరాతకం చోటు చేసుకుంది. నందనం ప్రాంతంలో వేలు అనే రౌడీషీటర్ ను దుండగులు సోమవారం నరికి చంపారు. ప్రత్యర్థి గ్రూపు అతడిని హతమార్చి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నందనం ప్రాంతంలో నెల రోజుల వ్యవధిలో ఆరు హత్యలు జరగడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. వరుస హత్యల నేపథ్యంలో పోలీసులు రాత్రిపూట గస్తీని ముమ్మరం చేశారు. చెన్నైలో పేరుమోసిన రౌడీషీటర్ సీడీ మణి అనుచరులతో సహా 161 మంది నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు స్వాతి హత్య కేసులో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తు్న్నారు. నుంగంబాక్కమ్ రైల్వే స్టేషన్ లో సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను పరిశీలించారు. హంతకుడు నీలం రంగు చొక్క ధరించివున్నాడని, హత్య చేసిన తర్వాత రైల్వే పట్టాలు దాటి పారిపోయినట్టు గుర్తించారు. రైల్వే స్టేషన్ సమీపంలోని ఇళ్లలోని సీసీ కెమెరా ఫుటేజీ కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.