naresh chandra
-
నిష్కళంక దేశభక్తికి నిలువుటద్దం
జాతిహితం భారత్ ప్రమాదకర స్థితిలో ఉండగా క్లింటన్ ప్రభుత్వం అణు కార్యక్రమాన్ని నిలిపి వేయాలని ఒత్తిడి తెచ్చింది. పీవీ అణు పరీక్షను నిర్వహిస్తూ దొరికిపోయినట్టు నటించి, దాన్ని ‘రద్దు చేసి’ క్లింటన్‌ను సంతృప్తి పరచారు. మన అణు శాస్త్రవేత్తలకు అవసరమైన సమయాన్ని సమకూర్చారు. నరేశ్ చంద్ర దీనిలో కీలకమైన ‘గూఢచారి’ పాత్ర ధరించి ఉండవచ్చు. ఇదంతా అత్యంత దేశభక్తియుత కారణంతో జరిగినదే. దీనికి ప్రతిఫలంగా చంద్రకు ముట్టినవి దేశ ద్రోహానికి పాల్పడ్డారన్న అనుమానాలే. ప్రజా జీవితంలోని ఒక ప్రముఖుని మృతికి నివాళి అర్పించేటప్పడు మనం మహా బద్ధకంగా, సురక్షితంగా ఆయన ‘‘దేశభక్తుడు’’ అనేస్తుంటాం. బద్ధ కంగా అనడం ఎందుకంటే, దేశభక్తులు కారని రుజువైన ఎవరో కొందరిని తప్ప తోటి భారతీయులెవరినైనా దేశభక్తులని భావించాల్సిందే. మృతి చెందిన వారి గురించి అలా అనడాన్ని ఎవరూ ప్రశ్నించే అవకాశం ఉండదు. చనిపోయినవారి గురించి చెడుగా మాట్లాడరాదన్నంతగా మనం వినమ్రంగా ఉంటాం. మనం నివాళి అర్పించే వ్యక్తిని ద్రోహి అని సూటిగా అన కున్నా, ఒక సారి కంటే ఎక్కువగానే అలా అనుమానించి ఉన్నప్పుడు ఇది మారుతుంది. భిన్న పార్టీలకు, కూటములకు చెందిన తొమ్మిది మంది ప్రధానుల హయాం లోని రెండు తరాల భారత వ్యూహకర్తలు ఆయనను అతి గొప్ప దేశభక్తులలో ఒకరుగా చూసినప్పుడు కచ్చితంగా అది జరుగుతుంది. వైవిధ్యభరితమైన వివిధ రాజకీయ పక్షాల ప్రభుత్వాలు మూడు దశాబ్దాలకు పైగా అంతగా నమ్మకం ఉంచి, గౌరవం చూపిన వ్యక్తులు అరుదు. నరేష్ చంద్ర అలా అంత సుదీర్ఘ కాలం ‘‘వ్యవస్థలో’’ ప్రభుత్వ అధికారిగా మనగలిగారు. భారత గూఢ చార సంస్థలో చేరి, దానికి అధిపతి అయిన తన అన్న ‘‘గ్యారీ’’ సక్సేనా గోప్యతను కాపాడాలని గామోసు నరేశ్ చంద్ర ఎన్నడూ తన ఇంటి పేరు ‘‘సక్సేనా’’ను వాడేవారు కారు. గ్యారీ ఇటీవలే ఏప్రిల్ 14న మృతి చెందారు. ఆయన విమర్శకులు సహా నరేష్ చంద్రతో పరిచయం ఉన్నవారెవరైనా ఆయన కేవలం ఐఏఎస్ పాసై, అధిష్టించగలిగిన పదవులన్నిటినీ చేపట్టిన సాధారణ ప్రభుత్వాధికారి మాత్రమే కారని అంగీకరిస్తారు. ప్రభుత్వ సర్వీ సుల సోపానాలలో నరేష్జీ ఎక్కని మెట్టు ఏదీ లేదు. ఆయనకు సాటి మరెవరూ లేరు ప్రభుత్వాధికార వ్యవస్థలో అత్యున్నత స్థానానికి చేరిన అధికారులు సాధా రణంగా రెండు రకాలు. ఒకటి, పదవీ విరమణ చేయడం, ఏదో ఒక సంస్థకు నియంత్రణాధికారిగా లేదా మరో పదవిని సంపాదించి విశ్రాంతిగా గడు పుతూ జీతాలు పుచ్చుకునేవారు. సీవీసీ, కాగ్, యూపీఎస్సీ,ఆర్టీఐ తదితర కమిషన్లలో నిజంగానే తమకు ప్రియమైన చట్టబద్ధమైన ఉద్యోగాల్లో చేరే వారు. నిజంగానే పాలకులకు ప్రీతి పాత్రులై ఉంటే సులువైన రాజ్‌భవన్ పని ఉండనే ఉంటుంది. ఇక మరో రకం వారు మరిన్ని సవాళ్ల కోసం అన్వేషిస్తూ, అసలు సిసలైన దేశ సేవలో తమ వృత్తి జీవితాన్ని పొడిగించుకుంటారు. నరేష్ చంద్ర ఈ రెండో కోవలో ఉంచదగినవారు. ఆయన అతి విశిష్టమైన రకం మనిషి. పలు దశాబ్దాలుగా ఎందరో తెలి వైన మంతులను కలుస్తున్నా.. నేను అలాంటి వ్యక్తులను మరిద్దరినైనా కలి శానని కచ్చితంగా చెప్పలేను. కొత్త సవాలు లేదా మరింత సరిగ్గా చెప్పాలంటే సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఆయన వైఖరే వేరు. సమస్యలను పరిష్కరిం చడంలో ఆయన రాణించారు, సంక్షోభంలో మరింత గొప్పగా రాణించారు. అలాంటి సమయాల గురించిన కథనాలను చెప్పడంలో ఆయన మరింత మెరుగు. జిల్లా సర్వీసులో తను నేర్చుకున్న విషయాలు ఎంతటి జటిలమైన సమస్యనైనా పరిష్కరించడంలో ఎలా ఉపయోగపడ్డాయనే దాన్ని అవేవో సరదా కబుర్లన్నట్టుగా చెప్పేవారు. ఆయన అన్ని వాస్తవాలను వెల్లడించేవారు కారు. కానీ మరెక్కడి నుంచైనా మీరు వాటిని తెలుసుకుంటే... మీరు ఆయన నమ్మకంలోకి తీసుకునే వ్యక్తులు అయితే... వాటిని సరిపోల్చి చెప్పేవారు. నేను ఉదయాన్నే లేచే బాపతు కాదు. మన్‌హట్టన్ లెక్సింగ్టన్ హోట ల్లో మోగినట్టుగా, ఉదయం 6 గంటలకే ఫోన్ మోగడాన్ని ఇష్టపడేవాణ్ణి కాను. అది 1997 ఆకురాలు కాలం, ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం జరుగుతోంది. నరేశ్ చంద్ర వాషింగ్ట¯Œ లోని భారత రాయబారి. 1992లోనే ఆయన కేబినెట్ కార్యదర్శిగా ఐఏఎస్ సర్వీసు నుంచి పదవీ విరమణ చేశారు. ‘‘అరె భయ్ మీరు ప్రచురించింది ఏమిటి? నేనిక్కడ రాయబారిని, ఈ పెద్ద మనిషేమో నేను గూఢచారిని అంటున్నాడు’’ అన్నారు నరేశ్ చంద్ర. ఆ రోజునే ఆయన నాటి ప్రధాని గుజ్రాల్‌తో కలసి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ను కలుసుకోవాల్సి ఉంది. తన సహచరులు, అమెరికన్లు ఆ వ్యాసాన్ని చదివాక తను వారి మొహం ఎలా చూడాలి అంటూ ఆయన ఆక్రోశాన్ని ధ్వనిస్తూ విషయం చెప్పారు. మన రాయబారే గూఢచారా? ఆయన ప్రస్తావించిన ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వ్యాసాన్ని రాసినది స్వదేశీ జాగరణ్ మంచ్ కన్వీనర్, నా మిత్రుడు ఎస్. గురుమూర్తి. పీవీ నర సింహారావు పోఖ్రాన్లో అణు పరీక్షను నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లను చేస్తూ చివరి క్షణంలో వెనక్కు తగ్గడంలోని మర్మాన్ని గురించి గురుమూర్తి రాశారు. క్లింటన్ ప్రభుత్వం, పీవీ పథకాలకు సంబంధించి తమ ఉపగ్రహ గూఢచార సమాచార ఆధారాలను చూపడం వల్లనే అలా జరి గిందని, ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వానికి ఒక ‘‘గూఢచారి’’ చేరవేశా డని, అది చంద్రేనని గురుమూర్తి సూచించారు. ఆ వ్యాసం ప్రతితో సహా నరేశ్ చంద్ర లెక్సింగ్టన్లో నేను బసచేసిన హోటల్‌కు వస్తున్నానన్నారు. ఆ వ్యాసం ప్రచురితమైనది నేను సంపాదకునిగా ఉన్న ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కాదని, అదే కుటుంబానికి చెందిన మరో శాఖ నిర్వహిస్తున్న ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అని నేను ఆయనకు వివరించాను. ఇదంతా బాగానే ఉందిగానీ ఇక ప్రపంచానికి నేను మొహం ఎలా చూపించాలి? అనేదే ఆయన సమస్య. ఈ విషయంలో నేను ఆయనకు ఏమీ ఉపయోగపడలేననేది స్పష్టమే. ఆయన కున్న విశిష్టమైన అర్హతలు, సంబం«ధాలు ఎలాంటివో నాకు బాగా తెలుసు. ఏదిఏమైనా కేబినెట్ కార్యదర్శిగా ఆయనకు మన దేశంలో రహస్యంగా ఉంచాల్సిన ప్రతి విషయమూ తెలుసు. పైగా రా సైతం కేబినెట్ సెక్రటేరి యట్ నియంత్రణలోనే ఉంటుంది. అలా అని గురుమూర్తి వ్యాఖ్యలు అంత తేలిగ్గా కొట్టిపారేయగలిగినవి కావు. ఆయనకు విషయ పరిజ్ఞానం, మేధస్సు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల నుంచి విదేశాంగ విధానం వరకు ఆయనతో ఏ విషయం మీదైనా విభేదిస్తూ వాదించవచ్చునే గానీ ఆయన దేశభక్తిని ప్రశ్నించలేం. మరి అసలు నిజం ఏమిటి? దాదాపు ఒక దశాబ్ది పాటూ నేను అదేపనిగా ఈ ప్రశ్నకు సమాధానం కోసం అన్వేషించాను. గుజ్రాల్, వాజ్‌పేయి, నరసింహారావుల వద్ద ఈ విష యాన్ని ప్రస్తావించాను. అందరి నుంచీ నిగూఢమైన నవ్వులూ, ‘‘ఆ విష యాన్ని మీరిక వదిలిపెట్టేయండి’’ అనే లాంటి మాటలే సమాధానమ య్యాయి. కానీ ఏళ్లు గడిచే కొద్దీ చంద్రపై పడ్డ మచ్చను అత్యున్నత అధికార వ్యవస్థలో ఎవరూ నమ్మలేదని సూచించే ఆధారాలు పోగుపడ్డాయి. పీవీ ఆయనను అణు సంబంధమైన, క్షిపణులకు సంబంధించిన సమస్యలపై అమెరికాతో చర్చలు జరిపే కీలక అధికారిగా నియమించారు. గురుమూర్తి అంతటివాడు ఆయనను గూఢచారిగా ఆరోపించినా గుజ్రాల్, ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వాలు ఆయనను అమెరికాలోని భారత రాయబారిగా కొన సాగించాయి. గురుమూర్తికి ఆర్ఎస్ఎస్, బీజేపీ అగ్రనాయకత్వంలో పలుకు బడి ఉండటమే కాదు, వాజ్‌పేయి, అద్వానీల ఇళ్లకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లగలిగేవారు. జశ్వంత్ సింగ్, బ్రజేశ్ మిశ్రాలు సైతం చంద్రను పూర్తిగా విశ్వసించేవారు. నిష్కళంక దేశభక్తికి అవమానాల మకుటం చికాకుపరచే ఈ భ్రమణం పరిపూర్తి అయ్యేట్టుగా 2006లో నరేశ్ చంద్ర ఇతర ప్రముఖ వక్తలతో పాటూ జశ్వంత్ సింగ్ పుస్తకావిష్కరణ సభలో వేదికను అలంకరించారు. తన పుస్తకంలో జశ్వంత్ సింగ్, పీవీ ప్రభుత్వంలోని గూఢచారి గురించి ప్రస్తావించారు. ఏమాత్రం అనుమానం ఉన్నా చంద్రను ఆ పుస్తక ఆవిష్కరణ సభకు జశ్వంత్ పిలిచేవారా? ఈ విషయంపై నేను పీవీని వేధించినప్పుడల్లా ఆయన... దాన్ని అక్కడే ఉండనివ్వండి అన్నట్టుగా తన పొట్టను తట్టుకునేవారు. ఒక ‘వాక్ ద టాక్’ ఇంటర్వ్యూలో నేను, డిసెం బర్ 1995లో ఏం జరిగిందంటూ ఒత్తిడి చేశాను. ‘‘నాతో పాటూ చితిలోకి తీసుకు పోవడానికి కనీసం కొద్దిగానైనా మిVýæలనివ్వు’’ అంటూ నా నోరు కట్టే శారు. 2006లో వెలువడ్డ జశ్వంత్‌సింగ్ పుస్తకం నా అన్వేషణను కొన సాగించడానికి కొత్త ప్రేరణ అయింది. నా ‘జనహితం’లో మూడుసార్లు ఆ అంశంపై రాశాను. ఆ గూఢచారి చంద్ర అని, ఆయనను ప్రయోగించినది పీవీ అని నిర్ధారించాను. చంద్రతో నేను గంటల కొద్దీ గడిపినా, ఆయన నోరు విప్ప లేదు. పీవీ అణు పరీక్ష చేయాలనుకోలేదనే నా నిర్ధారణను ఇంతవరకు ఎవరూ సవాలు చేసింది లేదు. భారత్ ప్రమాదకర స్థితిలో ఉండగా క్లింటన్ ప్రభుత్వం అణు కార్యక్రమాన్ని నిలిపేయాలని ఒత్తిడి తెచ్చింది. పీవీ అమెరికాను తప్పుదారి పట్టించే ఎత్తుగడ వేశారు. అణు పరీక్షను నిర్వహిస్తున్నట్టు, దొరికిపోయినట్టు నటించి... ‘‘రద్దు చేయడం’’ ద్వారా క్లింటన్‌ను సంతృప్తి పరచి, భారత శాస్త్రవేత్తలకు అవసరమైన సమయాన్ని సమకూర్చారు. బహుశా నరేశ్ చంద్ర దీనిలో పాత్రధారి కావచ్చు, ‘‘గూఢ చారి’’ పాత్ర ధరించి ఉండవచ్చు. ఇదంతా సత్సంకల్పంతో, దేశభక్తితో జరిగి నదే. దీనికి ప్రతిఫలంగా ఆయనకు ముట్టినవి పుకార్లు, తీవ్ర విద్రోహానికి పాల్పడ్డారన్న అనుమానాలే. 1989లో రాజీవ్ గాంధీ, చంద్రతో జనాంతి కంగా మాట్లాడుతూ ‘‘పాకిస్తాన్ అణ్వాయుధాల తయారీకి అతి చేరువలో ఉన్నది’’ అని చెప్పారు. మనకు వ్యూహాత్మకంగా కుటుంబ ఖజానాకు సమా నమైన నిధికి తాళాలను చంద్రకు అప్పగించారు. పోఖ్రాన్–2 అణు పరీక్షల వరకు దశాబ్దం పాటూ అతి చాకచక్యంగా ఆడిటర్లకు అనుమానం రాని రీతిలో మన అణు కార్యక్రమానికి ఆయన ఆర్థిక వనరులను సమకూర్చారు. అందువల్లనే ఆ విశిష్ట వ్యక్తికి నివాళులర్పించే సందర్భం ఏదో రివాజుగా సాగేది కాదు. ఎంతగా ఆయన దేశభక్తి సందేహానికి గురవుతున్నా చలించ కుండా మొండిగా నిలిచిన చిత్తశుద్ధితో కూడిన దేశభక్తి ఆయనది. తనపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి, దేశం కోసం తాను చేసినదాన్లో కొంతైనా చెప్పడానికి ఆయన తన జ్ఞాపకాలనైనా రాయలేదు. నేను రాయ గలిగిన దాన్ని ఎవరూ చదవరు అనేవారు. భరత మాతకు ఆయనలా అత్యు త్తమ సేవలందించిన ప్రభుత్వాధికారిని ఎవరినీ మనం చూడలేదు. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
పాతికేళ్ళ సంస్కరణల గుణపాఠాలు
ప్రపంచంలోని పేదలలో సగానికి పైగా ఇండియాలోనే. ప్రాథమిక ఆరోగ్యం, వైద్యరంగాల నుంచి ప్రభుత్వం పూర్తిగా వైదొలుగుతోంది. నిరుద్యోగం యువతను పీడిస్తూనే ఉంది. ఆర్థిక సంస్కరణలలో మానవీయకోణం కనిపించడం లేదని పదవీ విరమణ చేసిన తర్వాత పీవీ అంటూ ఉండే వారు. ‘రిఫార్మ్స్ విత్ హ్యూమన్ ఫేస్’ అంటూ ఆయన ప్రతిపాదించిన సూత్రం ఎక్కడో ఆగిపోయింది. ‘పరిస్థితి ఇంత దారుణంగా ఉందా?’ కేబినెట్ సెక్రటరీ నరేశ్‌చంద్ర ఇచ్చిన నోట్ చదివిన మీదట ప్రధాని పీవీ నరసింహారావు ప్రశ్న. ‘లేదు సర్. అంతకంటే అధ్వానంగా ఉంది’ అని రమేశ్చంద్ర జవాబు. ఆ నోటు చదివిన తర్వాత కొన్ని గంటలలోనే ఆర్థిక సంస్కరణలు అమలు చేయాలని పీవీ నిర్ణయించారు. కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ రాసిన గ్రంథం ‘టు ది బ్రింక్ అండ్ బ్యాక్-ఇండియాస్ 1991 స్టోరీ’లో ఈ ఉదంతం వివ రంగా ఉంది. ఆర్థిక సంస్కరణల అమలు జరిగిన విధంపైన మొట్టమొదట వచ్చిన పుస్తకం గురుచరణ్‌దాస్ రచించిన ‘ఇండియా అన్బౌండ్’. తాజా పుస్తకం వినయ్ సీతాపతి రచన ’పీవీ నరసింహారావు-హాఫ్ లయన్’. నాటి ప్రధాని కార్యాలయంలో ప్రత్యేకాధికారిగా పనిచేసిన జైరాం ఆర్థిక సంస్కరణ లకు ప్రత్యక్ష సాక్షి. సరిగ్గా పాతికేళ్ళ కిందట ఇదే రోజు (జూలై 24, 1991) కేంద్ర ఆర్థికమంత్రి మన్మోహన్సింగ్ తొలి సంస్కరణల బడ్జెట్ ప్రతిపాదనలను లోక్ సభలో ప్రవేశపెట్టారు. మన్మోహన్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలోనే ‘సమయం ఆసన్నమైన ఆలోచనను ప్రపంచంలో ఏ శక్తీ నిలువరించలేదు’ అంటూ విక్టర్ హ్యూగోని ఉటంకించారు. ‘ఆర్థికశక్తిగా భారత్ ఎదగాలన్నది అటువంటి ఆలో చనలలో ఒకటి’ అని ప్రకటించారు. (’Victor Hugo said no power on earth can stop an idea whose time has come. I suggest to this August House that emergence of India as a major economic power in the world happens to be one such idea. Let the whole world hear loud and clear. India is now wide awake. We shall prevail. We shall overcome!’). ఈ చారిత్రక ఘట్టం తర్వాత పాతి కేళ్ళు కాలగర్భంలో కలసిపోయాయి. పీవీ-మన్మోహన్ ద్వయం ఆశించినట్టు ఇండియా ఆర్థికశక్తిగా ఎదిగే క్రమంలో వేగంగా ముందుకు పోతోంది. ఆర్థిక సంస్కరణలు అనివార్యమైన పరిస్థితి దాపురించిన పాడురోజులను తలచు కుంటే సంస్కరణలు దేశానికి చేసిన మేలు అర్థం అవుతుంది. దిగుమతులకు విదేశీ మారకద్రవ్యం చెల్లించలేని దుస్థితిలో దేశం ఉన్నప్పుడు అంతర్జాతీయ ద్రవ్యసంస్థ (ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్-ఐఎంఎఫ్)తో చేసుకున్న ఒప్పందం ప్రకారం చంద్రశేఖర్ ప్రభుత్వం యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జ ర్లాండ్‌లో, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లో బంగారం కుదువపెట్టవలసి వచ్చింది. అప్పటికి రెండు, మూడు వారాలకే బొటాబొటి సరిపోను విదేశీమారకద్రవ్యం నిల్వలు ఉన్నాయి. నిజానికి నరేశ్‌చంద్ర పీవీకి చూపించిన నోటు చంద్రశేఖర్ ప్రభుత్వ పరిశీలన కోసం మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా తయారుచేసింది. కాంగ్రెస్ మద్దతు ఉపసంహరణతో చంద్రశేఖర్ ప్రభుత్వం కూలిపోయింది. ఆ నోట్లోని అంశాలను అమలు చేసే అవకాశం లేకపోయింది. 1991 ఎన్నికలు మొదటి దశ ముగిసి రెండవ దశకు ప్రచారంలో ఉండగా శ్రీపెరంబుదూరులో ఎల్టీటీఈ ప్రయోగించిన మానవబాంబు విస్ఫోటనంలో రాజీవ్ మరణిం చారు. సన్యాసం స్వీకరించి కుర్తాళం పీఠాధిపతిగా బాధ్యతలు నిర్వహించేందుకు సిద్ధమైన పీవీకి ఆ విధంగా రాజయోగం పట్టింది. ఆర్థిక సంస్కరణలు అమలు చేసి చరిత్రలో చిరస్థాయిగా నిలిచే అపూర్వమైన అవకాశం దక్కింది. అందరిదీ అదే బాట సంస్కరణల బాటలో రెండున్నర దశాబ్దాలు నిర్నిరోధంగా ప్రయాణం చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. పరిస్థితిని సమీక్షించుకోవాలి. పీవీ హయాంలో ప్రారంభమైన సంస్కరణలనే వాజ్‌పేయి, మన్మోహన్సింగ్ కొనసాగించారు. నరేంద్రమోదీ సమధికోత్సాహంతో సంస్కర ణలను వేగవంతం చేస్తున్నారు. ఆర్థిక విధానంలో రెండు జాతీయ పక్షాలకూ భావసామ్యం ఉండటం వల్ల సంస్కరణలకు విఘాతం కలగలేదు. నాటి ఇండియా అభివృద్ధి చెందిన దేశాల బృందం జి-77 కి నాయకత్వం వహించింది. నేడు అభివృద్ధి చెందిన దేశాల సరసన జి-20లో కూర్చున్నది. ఈ రోజు చైనా కంటే వేగంగా పెరుగుతున్న ఆర్థికవ్యవస్థగా ముందు వరుసలో ఉంది. నాడు తలసరి ఆదాయం 375 డాలర్లు ఉండగా ఇప్పుడు 1,700 డాలర్లు. కొనుగోలు శక్తిని ప్రాతిపదికగా తీసుకుంటే చైనా, అమెరికాల తర్వాత స్థానం ఇండియాదే. 2004 నుంచి 2011 వరకూ దేశంలో 13.8 కోట్ల మంది దారిద్య్ర రేఖ దాటుకొని పైకి వచ్చారు. పేదరికం నిర్మూలన చైనాలో కంటే వేగంగా ఇండియాలో జరిగిందని లెక్కలు చెబుతున్నాయి. నాడు భారతదేశంలోని కంపె నీలు బహుళజాతి కంపెనీలు వస్తే తమను మింగేస్తాయని బెదిరిపోయేవి. ఇప్పుడు భారతీయ కంపెనీలు బహుళజాతి సంస్థలుగా వర్థిల్లుతున్నాయి. వాణిజ్యంలో సంస్కరణలకు పూర్వం కొన్ని కుటుంబాలదే హవా. 1940లో ఏ కుటుంబాలు (టాటా, బిర్లా వగైరా) వాణిజ్య, పారిశ్రామిక రంగాలలో ముందు న్నాయో 1990లో కూడా అవే కుటుంబాలు ఉన్నాయి- ధీరూభాయ్ అంబానీ మినహా. సంస్కరణల పుణ్యమా అని ప్రేమ్‌జీ, నారాయణమూర్తి వంటి ప్రతిభా వంతులు మెగా ఐటీ సంస్థలను నిర్మించగలిగారు. నెహ్రూ, పీసీ మహలనొ బిస్ల ఆలోచనల ఫలితంగా పంచవర్ష ప్రణాళికలతో, మిశ్రమ ఆర్థిక విధానా లతో, సోషలిస్టు భావాలతో ప్రారంభమైన ప్రయాణం ఇందిరాగాంధీ హయాంలో సోషలిజాన్ని రాజ్యాంగ పీఠికలో చేర్చే వరకూ వెళ్ళింది. 1950 లలోనే మన ఆర్థికవ్యవస్థను ‘లెసైన్స్రాజ్’ అంటూ చక్రవర్తుల రాజగోపాలా చారి ఎద్దేవా చేశారు. ఇది అవినీతికీ, అసమర్థతకూ దారితీస్తుందంటూ జోస్యం కూడా చెప్పారు. ప్రముఖ ఆర్థికవేత్త, నెహ్రూ అభిమాని రాజ్‌కృష్ణ దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న తీరును ‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’ అంటూ అభివర్ణించారు. హిందూ ఆచారాలకూ, సంప్రదాయాలకూ తగినట్టు సాదా సీదాగా అభివృద్ధి ఉన్నదనీ, దేశం నెహ్రూని విఫలం చేసింది కానీ నెహ్రూ దేశాన్ని విఫలం చేయలేదనీ ఆయన వాదన. నెహ్రూ హయాంలో స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) అభివృద్ధి రేటు 4.8 శాతం ఉండేది. ఇందిర పాలనలో ఆత్యయిక పరిస్థితి వరకూ (1965-1975) అది 3.4 శాతానికి తగ్గింది. 1975 నుంచి 1984 వరకూ 4.2కు పెరిగింది. 1984 నుంచి 1995 వరకూ 5.9 శాతానికీ, 1995 నుంచి 2005 వరకూ 7.1 శాతానికీ, 2004-05 నుంచి 2013-14 వరకూ 8.3 శాతానికీ పెరిగింది. ఈ లెక్కల ప్రకారం ఆర్థిక సంస్కరణలు దేశానికి గొప్ప మేలు చేశాయనే చెప్పాలి. చైనాతో పోటీయా? ఇప్పుడు చైనాతో పోటీపడాలనీ, ప్రపంచంలోనే మూడవ ఆర్థికశక్తిగా ఎదగాలనీ కలలు కంటున్నాం. ఈ అభివృద్ధి కథ యావత్తూ నాణేనికి ఒక వైపు మాత్రమే. ఇది చాలా ఆశాజనకం, ఆనందదాయకం. కానీ, నాణేనికి మరోవైపున ఏము న్నదో తెలుసుకుంటే ఆవేశం తగ్గి ఆలోచన మొదలవుతుంది. చైనా ఆర్థిక వ్యవస్థలో మన ఆర్థికవ్యవస్థ విలువ అయిదింట ఒక వంతు మాత్రమే. చైనాను అందుకోవడం అంత తేలిక కాదు. ప్రగతి రేటూ, విదేశీమారకద్ర వ్యం నిల్వలూ పెరగడాన్ని అభివృద్ధికి సంకేతంగా పరిగణిస్తున్నాం. నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్ అనే సంస్థ అభివృద్ధి రేటును లెక్కించడానికి ప్రాతిపదికగా తీసుకునే సంవత్సరాన్ని 2011-12కు జరపడం వల్లనే ఎక్కువ రేటు కనిపిస్తున్నదంటూ దేశంలోనూ, విదేశాలలోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విదేశీమారక ద్రవ్యం నిల్వలు పెరుగుతున్నది మనం దిగుమతులకు ఖర్చు చేసే నిధులకంటే ఎగుమతుల ద్వారా ఎక్కువ సంపాదిస్తున్నందువల్ల కాదు. నిజానికి, ఇప్పటికీ మన దిగుమతుల విలువ ఎగుమతుల విలువ కంటే అధికం. అంటే విదేశీ మారకద్ర వ్యం సంక్షోభంలో దేశం ఉండాలి. కానీ నిల్వలు ఉన్నాయి. కారణం ఏమిటి? మన దేశంలో పెట్టుబడి పెడుతున్నవారు విదేశీమారకద్రవ్యం కుప్పలు తెప్పలుగా తెస్తున్నారు. 2004కు పూర్వం విదేశీమారకద్రవ్యం విదేశాల నుంచి 800 కోట్ల నుంచి 1,500 కోట్ల డాలర్లు వచ్చింది. 2007-08 నాటికి అది 6000 కోట్ల డాలర్లకు పెరిగింది. ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ నిల్వలు ఉన్నాయి. అంటే నిల్వలు మనం సంపాదించుకున్నవి కావు. అరువు తెచ్చుకున్నవి. 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడు విదేశీమారకద్రవ్యం గురించీ, అభివృద్ధి గురించే ఆలోచించారు కానీ వ్యవసాయరంగంపైన దృష్టి పెట్టలేదు. పత్తి పంట 1998 నుంచి తెలంగాణలో, విదర్భలో లక్షల ప్రాణాలు బలి తీసుకున్నది. ఉత్పాదకరంగంలో స్తబ్దత సంస్కరణలు భేషంటూ ప్రశంసించినవారు ప్రగతిపథంలో పరిశ్రమలూ, ఉత్పా దకరంగం ముందుంటాయని నమ్మబలికారు. లెసైన్స్-పర్మిట్‌రాజ్‌ను రద్దు చేసిన తర్వాత పరిశ్రమలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయని భావించారు. నిజానికి అభివృద్ధి చెందిన ఇతర దేశాలలో అదే జరిగింది. 2010లో చైనా జీడీపీలో ఉత్పాదక రంగానికి 47శాతం, ఇండొనేషియాలో 47 శాతం, దక్షిణ కొరి యాలో 39 శాతం, మలేసియాలో 44 శాతం, థాయ్‌ల్యాండ్‌లో 45 శాతం ఉంటే ఇండియాలో 27 శాతం. రెండు దశాబ్దాలుగా పారిశ్రామికరంగంలో ఎదుగూ బొదుగూ లేదు. నేరుగా విదేశీ పెట్టుబడులు (ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్-ఎఫ్‌డీఐ) రూపంలో 2000 నుంచి 2015 వరకూ దేశంలోకి వచ్చిన 25,800 కోట్ల డాలర్లలో 49 శాతం ఫిలిప్పీన్స్, సింగపూర్ మార్గంలో వచ్చినవేనని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ పరిశోధనలో తేలింది. పన్ను ఎగగొట్టడానికి ఈ మార్గం ఎంచు కున్నవారు విదేశీయులు కావచ్చు. మన దేశానికి చెందిన పెట్టుబడిదారులు కావచ్చు. అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సింగపూర్‌ను ఆకాశానికి ఎత్తు తుంటే ఆందోళన కలుగుతోంది. ఎఫ్డీఐలో కూడా ఉత్పాదక రంగంలోకి వెడుతున్నది 30 శాతం మాత్రమే. ప్రాథమిక సౌకర్యాల (ఇన్ఫ్రాస్ట్రక్చర్) రంగా నికీ, బడావ్యాపార సంస్థలకే ప్రభుత్వ రంగంలోని వాణిజ్య బ్యాంకులు సైతం ఉదారంగా రుణాలు ఇస్తున్నాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణ సౌకర్యం లేదు. ప్రధాని నరేంద్రమోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదం తర్వాత కూడా పరిస్థితి మారలేదు. ప్రపంచంలోని పేదలలో సగానికి పైగా ఇండియాలోనే. ప్రాథమిక ఆరోగ్యం, వైద్య రంగాల నుంచి ప్రభుత్వం పూర్తిగా వైదొలుగుతోంది. నిరు ద్యోగం యువతను పీడిస్తూనే ఉంది. ఆర్థిక సంస్కరణలలో మానవీయకోణం కనిపించడం లేదని పదవీ విరమణ చేసిన తర్వాత పీవీ అంటూ ఉండే వారు.‘రిఫార్మ్స్ విత్ హ్యూమన్ ఫేస్’ అంటూ ఆయన ప్రతిపాదించిన సూత్రం ఎక్కడో ఆగిపోయింది. ఆర్థికంగా పెరిగాం. మానవీయ కోణంలో ఎదగలేదు. ఆర్థికాభివృద్ధి ఫలితాలు పేదలకు అందడం లేదు. సమాజంలో అంతరాలు భయంకరంగా పెరుగుతున్నాయి. నేర ప్రవృత్తి హెచ్చుతోంది. ఈ పరిస్థితులు మారే వరకూ ఆర్థిక సంస్కరణల వల్ల ప్రయోజనం ఉండదు. - కె.రామచంద్రమూర్తి సాక్షి, ఎడిటోరియల్ డైరెక్టర్