Narsimha Rao
-
బీజేపీ సీనియర్ నాయకుడి మృతి
జనగామ : మృధుస్వభావి, మాజీ ప్రధాని, దివంగత వాజ్‌పేయి శిశ్యుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లుట్ల నర్సింహారావు ఆదివారం తెల్లవారు జాము గుండె పోటుతో మృతి చెందారు. జనగామ నియోజక వర్గ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న నెల్లుట్ల 2004లో ఎమ్మెల్యేగా పోటీచేశారు. పార్టీలో అందరినీ కలుపుకుని పోతూ ఏకతాటిపై నడిపించే ప్రయత్నం చేశాడు. నియోజకవర్గం నుంచి రాష్ట్రం, జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నర్సింహ్మారావుకు కొద్దిరోజుల్లో నామినేటెడ్ పోస్టు వరించనున్న నేపథ్యంలో హఠార్మరణం అభిమానులను కలచివేసింది. ఆయన మరణవార్త తెలుసుకున్న వందలాది మంది హుటాహుటిన హైదరాబాద్‌కు తరలివెళ్లారు. బీజేపీ సీనియర్ నాయకులు నర్సింహ్మారావు జిల్లాకేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కేవీఎల్‌ఎన్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, కౌన్సిలర్ మహంకాళి హరిశ్చంద్రగుప్త, నాయకులు కొంతం శ్రీనివాస్, వెంకట్, ఉడుగుల రమేష్, బొమ్మకంటి అనిల్, ఆగయ్య, సౌడ రమేష్, దేవరాయ ఎల్లయ్య, బొక్క ప్రభాకర్, జగదీష్, మహిపాల్, ఉపేందర్, పిట్టల సత్యం, సంపత్, వినోద్, తిరుపతి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ మండలకమిటీ ఆధ్వర్యంలో ఆర్అండ్డీ అతిథి గృహం ఆవరణలో నెల్లుట్ల చిత్రపటానికి మండల అధ్యక్షులు తిరుపతి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు మహిపాల్, మార్క ఉపేందర్, మహేష్, నిమ్మల మధు, ముక్క స్వామి, రాజశేఖర్, కాంగ్రెస్ నాయకులు గుండ శ్రీధర్‌రెడ్డి నివాళులర్పించారు. -
విద్యుత్ తీగలు తెగిపడి..
బొల్లపల్లి: విద్యుత్ తీగలు తెగిపడి ఓ వ్యక్తి మృతి చెందగా..మరో వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గుంటూరు జిల్లా బొల్లపల్లి మండలం పెరువూరుపాడు గ్రామంలో మంగళవారం జంపర్ తెగిపడి రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు వ్యక్తులపై పడటంతో.. ఓ వ్యక్తి మరణించాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికంగా నివాసముంటున్న పెద నర్సింహారావు(64) కూలి పనులకు వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ తీగలు తెగిపడ్డాయి. అపస్మారక స్థితిలోకి వెళ్లిన మరో వ్యక్తని ఆస్పత్రికి తరలించారు. -
పురుగులమందు తాగి రైతు ఆత్మహత్య
బూర్గంపాడు: అప్పులు తీర్చే దారి కానరాక ఓ రైతు బలవన్మరణం చెందాడు. ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు మదమంచి నర్సింహారావు(43) ఆదివారం రాత్రి పొలానికి వెళ్లి అక్కడే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం చుట్టుపక్కల వారు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పంటలు సరిగా పండకపోవటంతో అప్పుల బాధ తాళలేకనే అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబసభ్యులు తెలిపారు. -
ఏడి‘పింఛన్’
పింఛన్ రాకుంటే ఎట్టా బతికేది ? మా ఆయన నర్సింహారావు పదేళ్ల క్రితం పోయారు. అప్పటి నుంచి నాకు పింఛన్ వస్తనే ఉంది. గీ మధ్య కొత్త పింఛన్లతో పాటు పాత పింఛనోళ్లూ దరఖాస్తు చేసుకోవాలంటే..దరఖాస్తు చేసిన. కానీ జాబితాలో నాపేరు లేదు. బీఎస్ఆర్ నగర్లో అద్దె ఇంట్లె ఉంటున్న. పామాయిల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న. గీ మధ్య గా పనిలో నుంచి కూడా తప్పించిండ్రు. అటు కూలి లేక..ఇటు పింఛన్ రాకపోతే నేనెట్ట బతికేది!. -కండరాతి లక్ష్మి, గత లబ్ధిదారు, పేరాయిగూడెం, అశ్వారావుపేట సాక్షి, ఖమ్మం: లబ్ధిదారులు అనుకున్నట్లే ఆసరా ఆందోళన కలిగిస్తోంది. అన్ని అర్హతలున్నా అధికారులు, సిబ్బంది సర్వే తప్పుల తడకగా చేయడంతో గతంలోని అర్హులు ఇప్పుడు అనర్హులయ్యారు. జిల్లా వ్యాప్తంగా గత పింఛన్లలో 20 వేల వరకు ఈ సారి అధికారులు తొలగించారు. దీనిపై తహశీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల ఎదుట బాధితులు ఆందోళనకు దిగుతున్నా సమాధానం చెప్పేవారే లేకపోయారు. తాజాగా సోమవారం తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో నల్లగుట్టు లచ్చమ్మ (80) అనే వృద్ధురాలు పింఛన్ రాలేదనే బెంగతో మృతి చెందింది. గత ఏడాది జిల్లాలో అన్ని రకాల పింఛన్లు మొత్తంగా 2,27,426 వరకు ఉన్నాయి. ఇందులో వృద్ధాప్య పింఛన్లు 1,11,552, వితంతు 87,341, వికలాంగులు 26,296, నేత కార్మికులు 868, గీత కార్మికుల పింఛన్లు 1,369 ఉన్నాయి. లబ్ధిదారులందరికీ పింఛన్లు వస్తాయని సర్వేతో ఆందోళన చెందవద్దని ప్రభుత్వం ప్రకటనలిచ్చింది. కానీ అసలైన అర్హుల పేర్లు జాబితాలో లేకపోవడంతో జిల్లాలో ఎక్కడికక్కడ ఆందోళనలు కొనసాగుతున్నాయి. వికలాంగుల పింఛన్లు మినహా మిగతా కేటగిరీ పింఛన్లకు కోత పడింది. సర్వే సమయంలో జిల్లా వ్యాప్తంగా 3,13,831 దరఖాస్తులు వచ్చాయి. ధ్రువీకరణ పత్రాలు సరిగా లేవంటూ వేల సంఖ్యలో వీటిని తిరస్కరించారు. అర్హులైన వారికి ఈనెల 10 నుంచి జిల్లాలో పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్లు 92,561, వితంతు 85,696, వికలాంగులు 26,711, నేత కార్మికులు 1,469, గీత కార్మికులు 1,222 మంది అర్హులుగా అధికారులు తేల్చారు. వీరి జాబితా గ్రామ పంచాయతీల్లో ప్రకటించడం, ఇందులో కొంతమంది అర్హుల పేర్లే లేకపోవడంతో ఆందోళనకు దిగుతున్నారు. పభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారులు.. ‘మీ దరఖాస్తులు మళ్లీ పరిశీలన చేస్తాం’ అని చెబుతున్నారే తప్ప.. తమకు ఎందుకు పింఛన్ రాలేదో చెప్పడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని ధ్రువీకరణ పత్రాలు సర్వే సమయంలో ఇచ్చినా తమ పేర్లు తొలగిం చారని, గ్రామాల్లో వందలాది పింఛన్లు లేకుం డా పోయాయని దరఖాస్తుదారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా అధికారులకు విన్నవిస్తున్నా ఫలితం లేకుండాపోతోంది. ఉన్నతాధికారులు మాత్రం పింఛన్లు అర్హుందరికీ ఇస్తామని చెబుతున్నా క్షేత్ర స్థాయిలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యపు సమాధానంతో పింఛన్లురాని వారు ఆందోళన చెందుతున్నారు. కొన్ని దరఖాస్తులను అసలు అధికారులు సర్వే చేయలేదని ఆరోపణలు వస్తుండడంతో కొంతమంది లబ్ధిదారులు మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆందోళనతో పరుగులు ప్రభుత్వం వృద్ధాప్య, వికలాంగులు, వితంతు పింఛన్లు పెంచడంతో లబ్ధిదారులు తమకు ఇళ్లు గడుస్తుందన్న సంతోషంలో ఉన్నారు. అయితే జాబితాలో పేర్లు లేకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ విసిగివేసారారు. చేసేదీ లేక రోడ్డెక్కి రాస్తారోకోలు, ధర్నాలు చేస్తున్నారు. కూసుమంచి, తిరుమలాయపాలెం, వైరా, కొణిజర్ల, దుమ్ముగూడెం, సత్తుపల్లి, పెనుబల్లి, వేంసూరు మండలాల్లో ఇంకా లబ్ధిదారుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఖమ్మం కార్పొరేషన్‌కు నిత్యం వందలాది మంది వస్తూ తమ పేర్లే ఎందుకు తొలగించారని అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని పత్రాలు ఉన్నా అనర్హులుగా మిగిల్చారని మనోవేదనకు గురువుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రతి మండల కేంద్రంలో మాత్రం అధికారులు ప్రత్యేకంగా కనీసం హెల్ప్‌లైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. వచ్చేనెల నుంచి బ్యాంకు ఖాతా.. ప్రస్తుతం జిల్లాలో అర్హులైన వారికి ఈ రెండు నెలల పింఛన్ చేతికి ఇచ్చారు. నూతన సంవత్సరం వచ్చే నెల నుంచి అర్హులకు బ్యాంకు ఖాతాలో పింఛన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనర్హులుగా ఉన్నవారిలో ఆందోళన ఎక్కువైంది. తొలుత చేతికే పింఛన్ రాలేదంటే తమకు అర్హత కల్పించి బ్యాంకు ఖాతాలో వేయడానికి ఎన్ని నెలలు పడుతుందోనని ఆర్జిదారుల్లో ఆందోళన నెలకొంది. అర్హులైన వారు తమకు అర్హత లేదని ఆవేదనతో ఈ గ్రీవెన్స్‌లోనూ కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. ఉన్నతాధికారులు మాత్రం మలి విడతలో అర్హులందరికీ పింఛన్లు వేస్తాయని చెబుతున్నారే కానీ క్షేత్రస్థాయిలో మాత్రం లబ్ధిదారుల ఆందోళనకు ఊరటగా అధికారుల నుంచి ప్రకటన రావడం లేదు. -
పోలీసు కాల్పుల్లో గిరిజనుడి మృతి
చర్ల: చర్ల మండలం దోశిళ్లపల్లికి చెందిన ఇద్దరు యువకులపై పోలీసులు శనివారం రాత్రి కాల్పులు జరిపిన ఘటనలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుంజా నర్సింహరావు అనే గిరిజనుడు ఆదివారం రాత్రి మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి.. దోశిళ్లపల్లికి చెందిన యువకులు కుంజా నర్సింహారావు, కనితి సత్తిబాబు శనివారం రాత్రి పది గంటల సమయంలో దోశిళ్లపల్లి నుంచి ద్విచక్ర వాహనంపై చర్లకు బయల్దేరారు. దోశిళ్లపల్లి శివారులో వీరి వాహనాన్ని అటుగా నడుచుకుంటూ వెళుతున్న పోలీసులు గమనించి ఆగాలని హెచ్చరించారు. అది గమనించని యువకులు ద్విచక్ర వాహనాన్ని ఆపకుండా వెళ్లడంతో పోలీసులు అనుమానించి, వారిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వాహనాన్ని నడుపుతున్ననర్సింహారావు పొట్టలోకి రెండు బుల్లెట్లు దిగారుు. వెనుక కూర్చున్న కనితి సత్తిబాబు సురక్షితంగా బయటపడ్డాడు. బుల్లెట్ల గాయాలతో కుప్పకూలిన నర్సింహారావును పోలీసులు అర్ధరాత్రి వేళ హుటాహుటిన భద్రాచలంలోని ప్రయివేటు వైద్యశాలకు తరలించారు. అప్పటికే అతడి పరిస్థితి విషమించడంతో ఆదివారం హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. కాగా, సురక్షితంగా బయటపడిన కనితి సత్తిబాబు ప్రస్తుతం ఎక్కడున్నదీ తెలియడం లేదు. పోలీసులేమంటున్నారంటే... కాల్పుల ఘటనపై వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ అల్లం నరేందర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. సరిహద్దు ప్రాంతంలో ఇటీవల మావోయిస్టుల కార్యాకలాపాలు ఉధృతమయ్యూయని, పెదమిడిసిలేరు-తిప్పాపురం రోడ్డు నిర్మాణానికి మావోయిస్టులు అడ్డంకులు కల్పించకుండా చూసేందుకుగాను ఆ ప్రాంతానికి పోలీసు బలగాలు వెళ్లాయని చెప్పారు. అక్కడ కూంబింగ్ చేస్తున్న పోలీసు బలగాలపై దోశిళ్లపల్లి శివారులో మావోయిస్టులు కాల్పులు జరిపారని, పోలీసులు తేరుకుని ఎదురుకాల్పులు జరపడంతో మావోయిస్టులు పారిపోయారని తెలిపారు. తర్వాత ఆ ప్రాంతాన్ని పరిశీలించగా.. రక్తపు మడుగులో ఓ వ్యక్తి కనిపించాడని, అతడిని ఆసుపత్రికి తరలించామని వివరించారు. రెండేళ్లలో మూడోసారి.. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలపై పోలీసుల కాల్పులు జరపడం ఇది మూడోసారి. ప్రతిసారీ పోలీసులు కాకమ్మ కబుర్లతో తప్పించుకునేందుకు యత్నిస్తున్నారని ఆదివాసీలు, గిరిజన సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నారుు. రెండేళ్ల క్రితం వెంకటాపురం మండలం బోదాపురంలో గిరిజన సాంప్రదాయ వేటకు వెళ్తున్న మడకం బాబూరావుపై పోలీసులు కాల్పులు జరిపారు. గత నెల 7న చర్ల మండలం దోశిళ్లపల్లికి చెందిన కుంజా రమేష్ రాత్రి పూట ద్విచక్ర వాహనంపై వెళుతుండగా పోలీసులు కాల్పులు జరిపారు. దోశిళ్లపల్లికి చెందిన కుంజా నర్సింహారావు, కనితి సత్తిబాబుపై శనివారం రాత్రి కాల్పులు జరిపారు. -
ఇది సర్కారు ‘కిక్’!
త్వరలో 94చోట్ల ప్రభుత్వ మద్యం దుకాణాలు అనుమతివ్వడమే తరువాయి గాజువాక, అనకాపల్లి పరిధిలో ఎక్సయిజ్ శాఖ సన్నాహాలు విశాఖపట్నం : జిల్లాలో 94 చోట్ల ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు జారీ అయిన వెంటనే ఈ దుకాణాలకు తెరవాలని ఎక్సైజ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. అనకాపల్లి, గాజువాక పరిధిలోనే ఈ దుకాణాలు ఉండడంతో త్వరలోనే వీటిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగో విడత మద్యం దుకాణాల ఏర్పాటుకు 97 చోట్ల దరఖాస్తులు ఆహ్వానిస్తే ముగ్గురే ముందుకొచ్చారు. దీంతో శుక్రవారం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో అసిస్టెంట్ జాయింట్ కలెక్టర్ నర్సింహారావు సమక్షంలో ఆ ముగ్గురికీ దుకాణాలను కేటాయించారు. 94 మద్యం దుకాణాలకు ఒక్కరూ ముందుకు రాలేదు. ఖాళీగా ఉన్న 94 చోట్ల ప్రభుత్వ మద్యం ఔట్లెట్లు పెట్టేందుకు ప్రభుత్వానికి సిఫారసు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు.