పురుగులమందు తాగి రైతు ఆత్మహత్య
Published Mon, Feb 29 2016 11:23 AM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM
బూర్గంపాడు: అప్పులు తీర్చే దారి కానరాక ఓ రైతు బలవన్మరణం చెందాడు. ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు మదమంచి నర్సింహారావు(43) ఆదివారం రాత్రి పొలానికి వెళ్లి అక్కడే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం చుట్టుపక్కల వారు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పంటలు సరిగా పండకపోవటంతో అప్పుల బాధ తాళలేకనే అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబసభ్యులు తెలిపారు.
Advertisement
Advertisement