హోం మంత్రికి ఉప ముఖ్యమంత్రి పరామర్శ
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్ సన్‌షైన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని శనివారం ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ పరామర్శించారు. హజ్ యాత్ర పూర్తి చేసుకొని ఉదయం హైదరాబాద్ చేరుకున్న ఆయన ఆస్పత్రికి వెళ్లి హోంమంత్రిని కలిశారు. సంబంధిత వైద్యులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ కూడా హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డిని శనివారం కలుసుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
హోంగార్డులు...
హైదరాబాద్: హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని తెలంగాణ హోంగార్డుల సంక్షేమ అసోసియేషన్ ప్రతినిధులు ఆస్పత్రిలో కలిసి పరామర్శించా రు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాం క్షించారు. ఆస్పత్రికి వెళ్లిన వారిలో తెలంగాణ హోం గార్డుల సంక్షేమ సంఘ ప్రతినిధులు రాజేందర్‌రెడ్డి, ఏడుకొండలు, రఘుపతిరాజు ఉన్నారు.