భిక్షగాడిగా మారిన శాండల్‌వుడ్ హీరో!
బెంగళూరు: ప్రముఖ కన్నడ హాస్య నటుడు శరణ్ మారువేషంలో బెంగళూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో భిక్షాటన చేశాడు. కానీ ఇది నిజంగా కాదు తను నటిస్తున్న కొత్త చిత్రం ప్రమోషన్లో భాగంగా ఆయన భిక్షాటనకు దిగాడు. పవన్ ఒడయార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నటరాజ సర్వీస్ అనే కొత్త సినిమా కోసం ఆయన ఈ ఫీట్ చేశాడు. తనను ఎవరూ గుర్తు పడ్డకుండా కళ్లకు నల్లద్దాలు తదితర దుస్తులను ధరించి నగరంలోని గాంధీబజార్, హనుమంతనగర్ ప్రాంతాల్లో పాట పాడుతూ భిక్షాటన చేశాడు.
అనంతరం ఈ విషయన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోకు అనూహ్యమైన స్పందన వస్తోంది. ఈ విషయంపై చిత్ర హీరో శరణ్, డైరెక్టర్ పవన్ ఒడయార్లు స్పందిస్తూ శరణను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండడానికి అలా చేశామని ప్రజలు కూడా తాము నిజంగానే భిక్షాటన చేస్తున్నట్లు భావించారని తెలిపారు. భిక్షాటనలో రూ. 128లు వచ్చాయని హీరో శరణ్ సరదాగా తెలిపాడు.