National Adventure Awards
-
బాలికల అక్రమ రవాణా కట్టడికి పట్టం
జాతీయ సాహస పురస్కారాల ప్రకటన న్యూఢిల్లీ: 2017వ సంవత్సరానికి జాతీయ సాహస పురస్కారాలను ప్రకటించారు. బాలికల అక్రమ రవాణాను అరికట్టేందుకు సహాయం చేసిన పశ్చిమ బెంగాల్ అమ్మాయిలు తేజస్వితా (18), శివాని(17)లు ఈ ఏడాదికి గీతా చోప్రా అవార్డును అందుకోనున్నారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్‌లో పచిన్ నదిలో కొట్టుకుపోతున్న ఇద్దరు పిల్లలను కాపాడుతుండగా మరణించిన తార్హ్ పీజుకు భారత్ అవార్డు ప్రకటించారు. ఉత్తరాఖండ్‌లో తన సోదరుడిని కాపాడేందుకు చిరుతపులితో పోరాడిన సుమిత్‌కు సంజయ్ చోప్రా పురస్కారం ప్రదానం చేయనున్నారు. మొత్తం 25 మంది పిల్లల(13 మంది బాలురు, 12 మంది బాలికలు)ను ఈ ఏడాది సాహస పురస్కారాలకు ఎంపిక చేశారు. జనవరి 23న వీరంతా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకుంటారు. -
సాహస బాల రుచితకు గీతా చోప్రా అవార్డు
సాయికృష్ణ అఖిల్‌కూ జాతీయ అవార్డు న్యూఢిల్లీ: 25 మంది చిన్నారులకు కేంద్రం జాతీయ సాహస పురస్కారాలను ప్రకటించింది. ఇందులో 22 మంది బాలురు, ముగ్గురు బాలికలు ఉన్నారు. ఈ ముగ్గురిలో ఒకరు శివ్వంపేట్ రుచిత. 8 ఏళ్ల ఈ చిన్నారి తెలంగాణలో స్కూల్ బస్సును రైలు ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు చిన్నారుల ఊపిరి నిలబెట్టడంలో ప్రదర్శించిన సాహసానికి ప్రతిష్టాత్మక గీతా చోప్రా అవార్డును దక్కించుకుంది. తెలంగాణకు చెందిన మరో చిన్నారి సాయికృష్ణ అఖిల్ కిలాంబికి కూడా జాతీయ సాహస బాలల పురస్కారం దక్కింది. మొత్తం 25 మందిలో ఇద్దరికి మరణానంతరం ఈ పురస్కారం లభించింది. తన నలుగురు మిత్రులను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన మహారాష్ట్రకు చెందిన గౌరవ్ సహస్రబుద్దెకు ప్రతిష్టాత్మక సాహస భారత్ అవార్డు దక్కింది. పురస్కారాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 24న అందజేస్తారు. అవార్డులు అందుకున్న బాలలు భారత గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొంటారు.