National Cadet Corps rally
-
ఎన్సీసీ డీడీజీగా ఎయిర్ కమాండర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: నేషనల్ కేడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ)గా ఎయిర్ కమాండర్ వి.ఎం.రెడ్డి నియమితులయ్యారు. ఆయన శుక్రవారం సికింద్రాబాద్‌లోని ఎన్సీసీ డైరెక్టరేట్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ కేడెట్ల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించి బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వి.ఎం.రెడ్డి 1989లో భారత వైమానిక దళంలో చేరారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో 35 ఏళ్లుగా పలు హోదాల్లో సేవలందిస్తున్నారు. ఎల్రక్టానిక్ వార్ ఫేర్ రేంజ్, ఫ్రంట్‌లైన్ ఫైటర్ బేస్‌లో పైలట్ రహిత విమాన స్క్వాడ్రన్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. న్యూఢిల్లీలోని ఏరోస్పేస్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్, సికింద్రాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్లో ఆయన శిక్షకుడిగా పనిచేశారు. కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్లో ప్రతిష్టాత్మక హయ్యర్ ఎయిర్ కమాండ్ కోర్సును పూర్తి చేశారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీసీ)లో జాతీయ భద్రత, వ్యూహ సంబంధిత కోర్సును కూడా పూర్తి చేశారు. యుద్ధవిమాన పైలట్లకు శిక్షకుడిగా 2 వేల గంటలకు పైగా ఆయన గగనతలంలో పనిచేశారు. -
ఏ సవాలునైనా ఎదుర్కోగలం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ అయినా, సరిహద్దు వివాదం అయినా.. ఎలాంటి సవాలునైనా భారత్ ఎదుర్కోగలదని గత సంవత్సరం నిరూపితమైందని ప్రధాని మోదీ అన్నారు. కరోనా మహమ్మారి వల్ల మన ఆర్థిక వ్యవస్థపై పడిన దుష్ప్రభావాలను కూడా అదే విధంగా, అదే దృఢ నిశ్చయంతో పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. నేషనల్ కేడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) ర్యాలీనుద్దేశించి గురువారం ఆయన ప్రసంగించారు. తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా, భారత్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితి గత సంవత్సరం నుంచి కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ విషయంలో స్వావలంబన సాధించిన విధంగానే, సాయుధ దళాలను ఆధునీకరించే విషయంలోనూ ముందుకు వెళ్తామన్నారు. అన్ని సాయుధ దళాలను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని తెలిపారు. ఫ్రాన్స్ నుంచి భారత్‌కు తాజాగా వచ్చిన మూడు రఫేల్ యుద్ధ విమానాలకు యూఏఈ, సౌదీ అరేబియాల్లో ఆకాశంలోనే ఇంధనం నింపారని, ఈ విషయంలో ఆ రెండు దేశాలతో పాటు గ్రీస్ కూడా సాయం చేసిందని ప్రధాని తెలిపారు. భారత్‌తో గల్ఫ్ దేశాలకు ఉన్న సత్సంబంధాలను ఇది రుజువు చేస్తుందని వ్యాఖ్యానించారు. రక్షణ ఉత్పత్తుల అతిపెద్ద సరఫరాదారుగా భారత్ మారనుందన్నారు. ప్రపంచానికి భారత్ టీకా సాయం కోవిడ్‌పై పోరులో ప్రపంచదేశాలకు భారత్ సహకారం అందిస్తుందని మోదీ అన్నారు. వరల్డ్ఎకనమిక్ఫోరం దావోస్ అజెండా సమిట్‌పై మాట్లాడారు. ‘చాలా దేశాలకు కోవిడ్ టీకాలు పంపించాం. 150పైగా దేశాలకు మందులు అందజేశాం. దేశంలో తయారైన రెండు టీకాలను ప్రపంచ దేశాలకు పంపిస్తున్నాం. మరికొన్ని టీకాలను కూడా అందజేయనున్నాం’ అని ప్రధాని అన్నారు. ఎన్సీసీ క్యాడెట్ల నుంచి గౌరవవందనం స్వీకరిస్తున్న మోదీ -
ఓటమిని ఒప్పుకున్నాయి
విపక్షాలపై గోవా ఎన్నికల ప్రచారంలో మోదీ వ్యాఖ్య పణజి: కేంద్ర బడ్జెట్, ఎన్నికల తేదీలు వంటి చిన్న అంశాలపై కాకుండా అభివృద్ధి అంశంపై ఎన్నికల్లో పోరాడాలని ప్రధాని మోదీ విపక్షాలకు సవాల్ విసిరారు. విపక్షాలు ఇప్పటికే ఓటమిని అంగీకరించాయన్నారు. శనివారం పణజీలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ‘బడ్జెట్‌ను ముందుకు జరపటంపై విపక్షాలు విమర్శించడానికి.. బడ్జెట్ కోసం ఆర్థిక మంత్రి చేస్తున్న కృషికంటే ఎక్కువ కష్టపడుతున్నాయి. బడ్జెట్‌కు వ్యతిరేకంగా పత్రాలను రాసివ్వాలని ఆర్థికవేత్తలను అడుగుతున్నాయి. ఎన్నికల్లో అవి ఓటమిని అంగీకరించాయనేందుకు ఇదో సంకేతం. గోవా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను ఓకే రోజు(ఫిబ్రవరి 4)న నిర్వహించాలని ప్రధానమంత్రి కార్యాలయం ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చినట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి.. అంటే ఓడిపోయాక ఎన్నికల సంఘం తగిన రోజున ఎన్నికలు జరపలేదని ఆరోపిస్తాయి. ఇలాంటి వాటిపైనా ఎన్నికల్లో పోరాడాల్సింది?’ అని ప్రశ్నించారు. ప్రజలు తెలివైనవారని, అందుకే కాంగ్రెస్ అన్నిచోట్లా ఓడిపోతోందని, తెలివైన గోవా ప్రజలు బీజేపీకి ఓటేసి గెలిపించాలన్నారు. తమను తగినంత మెజారిటీతో గెలిపిస్తే రాష్ట్రాన్ని దేశంలోకెల్లా సౌకర్యవంతమైన రాష్ట్రంగా మారుస్తామన్నారు. గోవాకు కేంద్ర ప్రభుత్వం గత 50 ఏళ్లలో ఇచ్చినదానికంటే గత 25 నెలల్లో తమ ప్రభుత్వమే ఎక్కువగా ఇచ్చిందన్నారు. దృఢమైన రక్షణ మంత్రి పరీకర్‌ను అందించిన గోవాకు ధన్యవాదాలన్నారు. ప్రపంచమంతా సర్జికల్ దాడుల గురించే చర్చ అన్నారు. యువశక్తిని చూసి గర్వపడుతున్నా న్యూఢిల్లీ: దేశాభివృద్ధికి యువశక్తే మూలమని, భారతీయ యువశక్తిని చూసి గర్వపడుతున్నా నన్నారు. శనివారం నేషనల్ కేడెట్ కోర్ (ఎన్ సీసీ) ర్యాలీలో మాట్లాడుతూ.. ఐకమత్యమే భారతీ యుల బలానికి పునాదిరాయి అని పేర్కొన్నారు. విభిన్న ప్రాంతాలూ, అనేక భాషలు, మాండలికాలు, భిన్న ఆచారాలు ఉన్నప్పటికీ భారతీయులు ఎలా ఐక్యంగా ఉండగలుగుతు న్నారని ప్రపంచం అచ్చెరు వొందుతోందన్నారు.