సాక్షి, హైదరాబాద్: నేషనల్ కేడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ)గా ఎయిర్ కమాండర్ వి.ఎం.రెడ్డి నియమితులయ్యారు. ఆయన శుక్రవారం సికింద్రాబాద్‌లోని ఎన్‌సీసీ డైరెక్టరేట్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎన్‌సీసీ కేడెట్ల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించి బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వి.ఎం.రెడ్డి 1989లో భారత వైమానిక దళంలో చేరారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో 35 ఏళ్లుగా పలు హోదాల్లో సేవలందిస్తున్నారు. ఎల్రక్టానిక్ వార్ ఫేర్ రేంజ్, ఫ్రంట్‌లైన్ ఫైటర్ బేస్‌లో పైలట్ రహిత విమాన స్క్వాడ్రన్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. న్యూఢిల్లీలోని ఏరోస్పేస్ సేఫ్టీ ఇన్‌స్టిట్యూట్, సికింద్రాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్‌ఫేర్‌లో ఆయన శిక్షకుడిగా పనిచేశారు. కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్‌ఫేర్‌లో ప్రతిష్టాత్మక హయ్యర్ ఎయిర్ కమాండ్ కోర్సును పూర్తి చేశారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీసీ)లో జాతీయ భద్రత, వ్యూహ సంబంధిత కోర్సును కూడా పూర్తి చేశారు. యుద్ధవిమాన పైలట్లకు శిక్షకుడిగా 2 వేల గంటలకు పైగా ఆయన గగనతలంలో పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment