ఎస్టీ కమిషన్ చైర్మన్ గా నంద్‌కుమార్
న్యూఢిల్లీ: జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (ఎన్ సీఎస్టీ) చైర్మన్ గా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సీనియర్ గిరిజన నాయకుడు, మాజీ ఎంపీ నంద్‌కుమార్‌సాయి(71) మంగళవారం బాధ్యతలు చేపట్టారు. కేబినెట్ హోదా కలిగిన ఈ పదవిలో ఈయన మూడేళ్లపాటు కొనసాగుతారు.
మారుమూల ప్రాంతాల్లోని గిరిజనుల హక్కుల పరిరక్షణకు పాటుపడతానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. గిరిజనుల హక్కుల సాధనకు, వారి ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ఎన్నో ఉద్యమాలను ముందుండి నడిపించిన ఘనత నంద్‌కుమార్‌ది. నంద్‌కుమార్ 1977, 85, 98ల్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.