ఎస్టీ కమిషన్ చైర్మన్ గా నంద్‌కుమార్‌ | Nandkumar as ST Commission chairman | Sakshi
Sakshi News home page

ఎస్టీ కమిషన్ చైర్మన్ గా నంద్‌కుమార్‌

Published Wed, Mar 1 2017 1:40 AM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM

Nandkumar as ST Commission  chairman

న్యూఢిల్లీ: జాతీయ షెడ్యూల్డ్‌ తెగల కమిషన్  (ఎన్ సీఎస్‌టీ) చైర్మన్ గా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సీనియర్‌ గిరిజన నాయకుడు, మాజీ ఎంపీ నంద్‌కుమార్‌సాయి(71) మంగళవారం బాధ్యతలు చేపట్టారు. కేబినెట్‌ హోదా కలిగిన ఈ పదవిలో ఈయన మూడేళ్లపాటు కొనసాగుతారు.

మారుమూల ప్రాంతాల్లోని గిరిజనుల హక్కుల పరిరక్షణకు పాటుపడతానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.  గిరిజనుల హక్కుల సాధనకు, వారి ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ఎన్నో ఉద్యమాలను ముందుండి నడిపించిన ఘనత నంద్‌కుమార్‌ది. నంద్‌కుమార్‌ 1977, 85, 98ల్లో మధ్యప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement