National Herald Newspaper
-
అయోధ్య తీర్పు : నేషనల్ హెరాల్డ్ క్షమాపణలు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పత్రిక నేషనల్ హెరాల్డ్ క్షమాపణలు చెప్పింది. అయోధ్య వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కించపరుస్తూ ఆ పత్రిక ఎడిటోరియల్ ప్రచురించడంతో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ‘అయోధ్యలో హిందువులు ఎప్పటికీ పూజలు చేయలేరు’ అనే టైటిల్‌తో నేషనల్ హెరాల్డ్ ఎడిటోరియల్ ప్రచురించింది. దాంతోపాటు 1992 నాటి అయోధ్య, 2019 లో సుప్రీంకోర్టుగా అవతరించిందని చూపుతూ కార్టూన్ కూడా వేసింది. ‘బెత్తం ఎవరి చేతిలో ఉంటే వారిదే ఎద్దు’ అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చింది. ‘ఒత్తిడి.. హింస.. రక్తపాతంతో నిర్మించిన గుడిలో దేవుడు ఉంటాడా..? అలాంటి చోట ఎవరైనా పూజలు చేయగలరా..? అని క్యాప్షన్ కూడా పెట్టింది. ఈ వివాదాస్పద ఎడిటోరియల్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది పక్కా పాకిస్తాన్ నిధులతో నడిచే పత్రిక అని కామెంట్లు చేశారు. అపెక్స్ కోర్టు తీర్పును అవమాని పరిచిన నేషనల్ హెరాల్డ్ యాజమాన్యం శిక్షించాలని కొందరు వ్యాఖ్యానించారు. దీంతో దిగొచ్చిన పత్రికా యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఎవరి మనోభావాలైన దెబ్బతింటే క్షమించాలని పేర్కొంటూ ఓ ఆర్టికల్ ప్రచురించింది. వివాదాస్పద ఆర్టికల్‌కు సంబంధించిన ఉద్దేశాలు ఆ రచయిత వ్యక్తిగతమని వెల్లడించింది. సుప్రీం కోర్టు తీర్పు హర్షించదగ్గదని చెప్తూనే.. తన పత్రికలో కాంగ్రెస్ అక్కసు వెళ్లగక్కిందని బీజేపీ ధ్వజమెత్తింది. కాంగ్రెస్ ద్వంద్వ విధానాలు తెలుస్తూనే ఉన్నాయని ఎద్దేవా చేసింది. నేషనల్ హెరాల్డ్‌ను భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1938లో స్థాపించారు. -
‘నేషనల్ హెరాల్డ్’ ఖాళీ చేయాల్సిందే..!
సాక్షి, న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ వార్తా సంస్థకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సెంట్రల్ ఢిల్లీలోని ఆఫీస్‌ను ఖాళీ చేయాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టు డిసెంబరులో ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ అసోషియేట్ జర్నల్స్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం కొట్టివేసింది. దేశ రాజధాని ప్రాంతంలో గల ఢిలీ-ఐటీవో భవనంలో హెరాల్డ్ సంస్థ గత 56 ఏళ్లుగా కొనసాగుతోంది. కాగా, ఐటీవో ప్రాంతంలో ఎలాంటి వార్తా సంస్థలు కొనసాగరాదంటూ కేంద్రం గతంలోనే కోర్టుకు విన్నవించింది. గత పదేళ్లుగా ఐటీవో ప్రాంతంలో వార్తా సంస్థల నిర్వహణకు అనుమతివ్వడం లేదని తెలిపింది. 56 ఏళ్ల క్రితం అసోషియేట్ జర్నల్స్ లిమిటెడ్‌కు ఇచ్చిన లీజును ఈ మేరకు కేంద్రం రద్దు చేసింది. దీంతో ఐటీవో భవనంలో కొనసాగుతున్న నేషనల్ హెరాల్డ్ ఆఫీస్‌ను ఖాళీ చేయాలని డిసెంబరులో కోర్టు ఉత్తర్వులిచ్చింది. -
నేషనల్ హెరాల్డ్ ఎడిటర్ కన్నుమూత
సాక్షి, చెన్నై: సీనియర్ జర్నలిస్ట్, నేషనల్ హెరాల్డ్ ఎడిటర్ ఇన్ చీఫ్ నీలబ్ మిశ్రా మృతిచెందారు. కొంత కాలంగా నీలబ్ కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న ఆయన శనివారం తుది శ్వాస విడిచారు. నీలబ్ విశ్రా వయసు 57 ఏళ్లు. నేషనల్ హెరాల్డ్ పత్రిక రీలాంచ్ సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఎడిటర్ నీలబ్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు. An Editor's Editor. A man who spoke truth to power. An institution builder. On Neelabh Mishra's tragic passing away this morning, my deepest condolences to his family, friends, colleagues and admirers. #NationalHerald — Office of RG (@OfficeOfRG) February 24, 2018 -
సోనియ, రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ
► నేషనల్ హెరాల్డ్ కేసులో ఆదాయ విచారణ కొనసాగింపుకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఎదురు దెబ్బ తగిలింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక నిధుల దుర్వినియోగం కేసులో సోనియా, రాహుల్ తో పాటు స్టాక్ హోల్డర్లను ఆదాయ విచారణ చేయాలని ఆదాయపన్ను శాఖను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక(కొన్నేళ్ల కిందటే మూతపడింది) ప్రచురణ సంస్థ అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్)కు కాంగ్రెస్ 2010లో రూ.90 కోట్ల రుణం ఇచ్చింది. తర్వాత ఆ రుణాన్ని వసూలు చేసే హక్కును రూ.50 లక్షలకే యంగ్ ఇండియా లిమిటెడ్(వైఐఎల్)కు కట్టబెట్టింది. ఈ తతంగంలో కాంగ్రెస్ నిధులు మళ్లించి మోసానికి పాల్పడిందని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
సోనియ, రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ
-
సోనియా, రాహుల్ లబ్ధి పొందలేదు
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ జవాబులు న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ పత్రిక ఉదంతంపై ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ సమాధానాలు ఇచ్చింది. తరచూ అడిగే ప్రశ్న(ఎఫ్ఏక్యూ)లకు జవాబులంటూ తన వెబ్సైట్లో వీటిని పొందుపరచింది. యంగ్ ఇండియన్ లిమిటెడ్(వైఐ) నుంచి పార్టీ చీఫ్ సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు ఆర్థికంగా ఎలాంటి లబ్ధీ పొందలేదని స్పష్టం చేసింది. నేషనల్ హెరాల్డ్ ప్రచురణ సంస్థ అసోసియేట్ జర్నల్స్ ఆఫ్ ఇండియా(ఏజేఎల్)లో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఏర్పాటైన వైఐ రియల్ ఎస్టేట్ కంపెనీ కాదని స్పష్టం చేసింది. పార్టీలు రుణాలు ఇవ్వడంపై ఆంక్షలు లేవని ఎన్నికల కమిషన్ ఉత్తర్వును ఉదహరించింది. లాభాపేక్ష లేని కంపెనీ అయిన వైఐ డెరైక్టర్లు లేదా వాటాదారులుగా సోనియా, రాహుల్‌లు కంపెనీ నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందలేరంది. ఏజేఎల్ ఆస్తుల్లో ఒక్కపైసా కూడా వైఐకి బదిలీకాలేదని పేర్కొంది. ‘ఏజేఎల్ ఆస్తులను దక్కించుకోవడానికే వైఐని ఏర్పాటు చేశారనడం నిజం కాదు. ఏజేఎల్‌లో భారీ వాటాదారైన వైఐ.. ఆ కంపెనీ ఆస్తుల రక్షణ పెంచింది’ అని పేర్కొంది. ఏజేఎల్, వైఐ రెండూ వేరువేరు సంస్థలని, ఏజేఎల్ ఆస్తులు ఆ కంపెనీవిగానే కొనసాగుతాయని స్పష్టం చేసింది. కుదేలైన ఏజేఎల్‌కు తమ పార్టీ రూ.90 కోట్ల రుణమివ్వడం సమంజసమేనంది. -
స్వచ్ఛంద సంస్థగా ఏజేఎల్
లక్నో: కోర్టు కేసులను ఎదుర్కొంటున్న నేషనల్ హెరాల్డ్ దినపత్రిక యాజమాన్య సంస్థ అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్).. ఇకపై వాణిజ్య సంస్థ కాదు. అది ఇక స్వచ్ఛంద సంస్థ. చాలా కాలం కిందట నిలిచిపోయిన వార్తా పత్రికల ప్రచురణను పునఃప్రారంభించాలని కూడా ఆ సంస్థ భాగస్వాములు నిర్ణయించారు. గురువారం లక్నోలో ఏజేఎల్ భాగస్వాముల అసాధారణ సర్వసభ్య సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కంపెనీల చట్టం 2013 కింద.. లాభార్జన కోసం కాని సెక్షన్ 8 సంస్థగా మార్చేందుకు ఉద్దేశించిన పలు ప్రతిపాదనలను వాటాదారులు పరిశీలించి ఆమోదించారని ఏజేఎల్ మేనేజింగ్ డెరైక్టర్ మోతీలాల్ ఓరా విలేకరులకు తెలిపారు. మూడు గంటలకు పైగా కొనసాగిన భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంస్థ ప్రచురణలను కూడా పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఏజేఎల్ భాగస్వాములైన కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌గాంధీలు కూడా పరోక్షంగా తమ ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. ఏజేఎల్‌ను 2010లో యంగ్ ఇండియన్ కంపెనీకి అప్పగించటంలో అవినీతి చోటు చేసుకుందంటూ.. సోనియా, ఆమె కుమారుడు రాహుల్ లతో పాటు మరో ఐదుగురిపై బీజేపీ నేత సుబ్రమణ్యంస్వామి క్రిమినల్ కేసు దాఖలు చేయటం, ఢిల్లీ కోర్టు వారికి సమన్లు జారీ చేయటం, వారు కోర్టుకు హాజరవ్వాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పటం, వారు గత నెలలో కోర్టుకు హాజరవటం.. ఈ కేసుపై రాజకీయ దుమారం రేగటం తెలిసిందే. ఏజేఎల్‌ను స్వచ్ఛంద సంస్థగా మార్చిన నిర్ణయాల ప్రభావం కేసుపై ఎలా ఉంటుందని విలేకరులు ప్రశ్నించగా.. కేసు కోర్టులో ఉందని, తమ నిర్ణయాల ప్రభావం కేసుపై ఉండబోదని ఓరా బదులిచ్చారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు గులాంనబీ ఆజాద్, శ్యాంపిట్రోడా, ఆస్కార్ ఫెర్నాండెజ్, షీలాదీక్షిత్, సలీమ్షేర్వాణి, రత్నాసింగ్, జితిన్‌ప్రసాద, సయ్యద్సిబ్తేరజీ తదితరులు హాజరయ్యారు. -
సోనియా, రాహుల్‌కు చుక్కెదురు
‘హెరాల్డ్’ కేసులో సమన్లు రద్దు చేయాలన్న పిటిషన్ల కొట్టివేత ఢిల్లీ హైకోర్టు తీర్పు న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. కేసులో తమకు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలంటూ వారు వేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలన్న అభ్యర్థననూ కొట్టివేసింది. దీంతో సోనియా, రాహుల్‌తోపాటు ఈ కేసులో నిందితులుగా సుమన్ దూబే, మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, శ్యాం పిట్రోడా, యంగ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ప్రతినిధి మంగళవారం విచారణ కోర్టుకు హాజరుకావాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక(కొన్నేళ్ల కిందటే మూతపడింది) ప్రచురణ సంస్థ అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్)కు కాంగ్రెస్ 2010లో రూ.90 కోట్ల రుణం ఇచ్చింది. తర్వాత ఆ రుణాన్ని వసూలు చేసే హక్కును రూ.50 లక్షలకే యంగ్ ఇండియా లిమిటెడ్(వైఐఎల్)కు కట్టబెట్టింది. ఈ తతంగంలో కాంగ్రెస్ నిధులు మళ్లించి మోసానికి పాల్పడిందని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఫిర్యాదు చే శారు. విచారించిన ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు వారికి సమన్లు ఇచ్చింది. నిందితులు వాటిని ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. జస్టిస్ సునీల్ గౌర్ వారి పిటిషన్‌పై విచారణ చేపట్టారు. నేర ఉద్దేశం కనిపిస్తోంది.. నిందితుల్లో నేర ఉద్దేశం కనిపిస్తోందంటూ విచారణ సందర్భంగా జడ్జి వ్యాఖ్యానించారు. ‘ఈ కేసును పూర్తిగా పరిశీలించాక.. వైఐఎల్ ద్వారా ఏజేఎల్‌ను తమ నియంత్రణలోకి తెచ్చుకునేందుకు అనుసరించిన పద్ధతులను బట్టి చూస్తే పిటిషనర్లలో నేర ఉద్దేశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఏజేఎల్, వైఐఎల్ రెండూ ఒకటే. దీన్ని మోసం అనాలో, నేరపూరిత మోసం అనాలో ఈ దశలో చెప్పలేం. పిటిషనర్ల వైఖరి సందేహాస్పదం. నిజాలు తేలాలంటే సరైన దిశలో దర్యాప్తు జరగాలి. విచారణ ప్రాథమిక దశలో ఉన్నందున జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు’ అని జడ్జి తన 27 పేజీల తీర్పులో పేర్కొన్నారు. పిటిషనర్లపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. శ్యాంపిట్రోడా, ఫెర్నాండెజ్ విచారణ కోర్టు పరిధిలో నివసించడం లేదని, అందువల్ల వారికి సమన్లు జారీ చేసే అధికారం కోర్టుకు లేదన్న వాదననూ హైకోర్టు తోసిపుచ్చింది. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు: బీజేపీ హైకోర్టు తీర్పును బీజేపీ స్వాగతించింది. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని పార్టీ ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ అన్నారు. తీర్పు లోపభూయిష్టంగా ఉందని, మంగళవారం సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని కాంగ్రెస్ తెలిపింది. అసలేం జరిగింది? ►నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రచురణ సంస్థ అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్‌కు కాంగ్రెస్ రూ. 90.25 కోట్ల రుణాన్ని ఇచ్చింది. 2010 డిసెంబర్ 10న ఈ రుణాన్ని వసూలు చేసే బాధ్యతను యంగ్ ఇండియా లిమిటెడ్(వైఐఎల్) అనే చారిటీ సంస్థకు పార్టీ రూ. 50 లక్షలకు అప్పగించింది. ► ఇంత పెద్ద మొత్తాన్ని వసూలు చేసే హక్కును వైఐఎల్‌కు రూ.50 లక్షలకే అప్పగించాల్సిన అవసరం ఏమొచ్చిందని కోర్టు ప్రశ్నించింది. దీని వెనుక ఉద్దేశాలపై కోర్టు సందేహాలు వ్యక్తం చేసింది. ► వైఐఎల్‌లో సోనియా, రాహుల్ గాంధీలకు చెరో 38శాతం వాటా ఉన్నట్లు బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆరోపిస్తున్నారు. ► హెరాల్డ్‌కు ఉన్న ఆస్తులను కేవలం రూ. 50లక్షలకు చట్టబద్ధంగా సోనియా కుటుంబం సొంతం చేసుకుందని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపిస్తున్నారు. ► నేషనల్ హెరాల్డ్ పత్రికకు దేశ వ్యాప్తంగా రూ. 5వేల కోట్లు ఆస్తులు ఉన్నట్లు అంచనా. -
'సోనియా, రాహుల్ లకు బెయిల్ రాకుండా పోరాటం'
నేషనల్ హెరాల్డ్ నిధుల దుర్వినియోగం కేసులో ఆగస్టు 7 తేదిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కోర్టుకు హాజరైతే చూడాలని ఉందని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి అన్నారు. సోషల్ మీడియా బృందంతో సమావేశమైన బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి మాట్లాడుతూ.. సోనియా, రాహుల్ లకు బెయిల్ రాకుండా పోరాటం చేస్తాను అని అన్నారు. సెప్టెంబర్ 14న ఢిల్లీలో జాతీయ సోషల్ మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. సోషల్ మీడియా జాతీయ దృక్పథంతో పనిచేయాలని ఆయన సూచించారు. కొన్నేళ్ల కింద మూతపడిన నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి నిధుల దుర్వినియోగం కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలకు ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 7న స్వయంగా తమ ఎదుట హాజరుకావాలంటూ సోనియా, రాహుల్‌తోపాటు ఏఐసీసీ కోశాధికారి మోతీలాల్ వోరా, ప్రధాన కార్యదర్శి ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్దూబే, శామ్ పిట్రోడా, యంగ్ ఇండియన్ లిమిటెడ్ సంస్థ డెరైక్టర్లను మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ గోమతి మనోచా ఆదేశించిన సంగతి తెలిసిందే.