సోనియ, రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ
► నేషనల్ హెరాల్డ్ కేసులో ఆదాయ విచారణ కొనసాగింపుకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఎదురు దెబ్బ తగిలింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక నిధుల దుర్వినియోగం కేసులో సోనియా, రాహుల్ తో పాటు స్టాక్ హోల్డర్లను ఆదాయ విచారణ చేయాలని ఆదాయపన్ను శాఖను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది.
నేషనల్ హెరాల్డ్ పత్రిక(కొన్నేళ్ల కిందటే మూతపడింది) ప్రచురణ సంస్థ అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్)కు కాంగ్రెస్ 2010లో రూ.90 కోట్ల రుణం ఇచ్చింది. తర్వాత ఆ రుణాన్ని వసూలు చేసే హక్కును రూ.50 లక్షలకే యంగ్ ఇండియా లిమిటెడ్(వైఐఎల్)కు కట్టబెట్టింది. ఈ తతంగంలో కాంగ్రెస్ నిధులు మళ్లించి మోసానికి పాల్పడిందని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.