వాళ్ల నోళ్లు ఎందుకు మూతబడ్డాయి?
సోనియా, రాహుల్‌పై దత్తాత్రేయ ఫైర్
సాక్షి, హైదరాబాద్: దేశద్రోహులకు మద్దతిచ్చిన విషయమై.. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ పార్లమెంటులో నోరెందుకు విప్పలేదని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన బీజేపీ నేతలు చింతా సాంబమూర్తి, ఎస్.మల్లారెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, దాసరి మల్లేశంతో కలసి విలేకరులతో మాట్లాడారు. పార్లమెంటులో దేశాన్ని, ప్రజల్ని, అంతర్గత భద్రతను కూడా పణంగా పెట్టిన కాంగ్రెస్‌పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నదని ఆరోపించారు.
రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రయోజనం కోసం దేశ ద్రోహులకు, టైజానికి కాంగ్రెస్ మద్దతిస్తోందని విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతల్లో కనీసం పశ్చాత్తాపం కూడా కనిపించలేదన్నారు. అధికార పక్షాన్ని పార్లమెంటులో నిలదీస్తామని బీరాలు పలికిన రాహుల్.. ఇపుడెందుకు మాట్లాడలేదని దత్తాత్రేయ ప్రశ్నించారు. దేశంలోని సమస్యల పరిష్కారానికి పార్లమెంటులో నిర్మాణాత్మక చర్చ జరగాలని, దీనికి ప్రతిపక్షాలు సహకరించాలని, జీఎస్‌టీ బిల్లును అడ్డుకోవద్దని కోరారు.