'సోనియా, రాహుల్ లకు బెయిల్ రాకుండా పోరాటం'
'సోనియా, రాహుల్ లకు బెయిల్ రాకుండా పోరాటం'
Published Sun, Jul 20 2014 12:17 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
నేషనల్ హెరాల్డ్ నిధుల దుర్వినియోగం కేసులో ఆగస్టు 7 తేదిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కోర్టుకు హాజరైతే చూడాలని ఉందని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి అన్నారు. సోషల్ మీడియా బృందంతో సమావేశమైన బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి మాట్లాడుతూ.. సోనియా, రాహుల్ లకు బెయిల్ రాకుండా పోరాటం చేస్తాను అని అన్నారు. సెప్టెంబర్ 14న ఢిల్లీలో జాతీయ సోషల్ మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. సోషల్ మీడియా జాతీయ దృక్పథంతో పనిచేయాలని ఆయన సూచించారు.
కొన్నేళ్ల కింద మూతపడిన నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి నిధుల దుర్వినియోగం కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలకు ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 7న స్వయంగా తమ ఎదుట హాజరుకావాలంటూ సోనియా, రాహుల్‌తోపాటు ఏఐసీసీ కోశాధికారి మోతీలాల్ వోరా, ప్రధాన కార్యదర్శి ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్‌దూబే, శామ్ పిట్రోడా, యంగ్ ఇండియన్ లిమిటెడ్ సంస్థ డెరైక్టర్లను మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ గోమతి మనోచా ఆదేశించిన సంగతి తెలిసిందే.
Advertisement