National Institute
-
వైద్య వారసత్వం పునరుద్దరణకు కృషి
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్, హైదరాబాద్ నిర్వహిస్తున్న మాన్యుస్క్రిప్ట్లజీపై రెండురోజుల శిక్షణ కార్యక్రమం 20 జూలై 2024న ముగిసింది. భారతదేశంలోని వివిధ స్క్రిప్ట్‌ల గురించి విజ్ఞానాన్ని అందించడం ద్వారా పండితులకు వైద్య వ్రాత ప్రతులను సులభంగా అనువదించడం దీని లక్ష్యం. మాన్యుస్క్రిప్ట్లజీ లో నిపుణులు మాన్యుస్క్రిప్టులజీ యొక్క వివిధ అంశాలను అనగా వాటిలో ఉన్న వైద్యజ్ఞానాన్ని తెలుసుకోవడం పురాతన లిపి అందులోని అర్థాన్ని తెలుకోవడం మొదలగు వాటి గురించి తెలియజేసారు.వీరిని హైదరాబాద్‌లోని ఎన్ఐఐఎంహెచ్ ఇన్ఛార్జ్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి పి ప్రసాద్ సత్కరించారు. దాదాపు 100 మంది మేధావులు ఇన్స్టిట్యూట్లో జరిగిన మేధోమథన సెషన్లకు మరియు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కూడా హాజరయ్యారు. వారు గ్రంథ, వట్టెఝుత్తు, కన్నడ, నగరి మరియు తెలుగు వంటి ప్రాచీన భారతీయ లిపిల గురించి తెలుసుకున్నారు. ప్రముఖ వక్తలు ప్రొఫెసర్ సినిరుద్ధ దాష్, మాజీ ప్రొఫెసర్ మరియు హెడ్, మద్రాస్ విశ్వవిద్యాలయం, సంస్కృత శాఖ, డాక్టర్ కీర్తికాంత్ శర్మ, మాజీ రీసెర్చ్ ఆఫీసర్, I.G.N.C.A., శ్రీ షాజీ, ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కేరళ మాజీ మాన్యుస్క్రిప్ట్ అసిస్టెంట్, ప్రొఫెసర్ M. A. అల్వార్, మహారాజా సంస్కృత కళాశాల, మైసూర్, డాక్టర్ ఉత్తమ్ సింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, సెంట్రల్ సంస్కృత విశ్వవిద్యాలయం, త్రిపుర, డాక్టర్. V. S. కంచి అసోసియేట్ ప్రొఫెసర్, ముల్జీ జైతా కళాశాల, మహారాష్ట్ర, Mr. N.R.S. నరసింహ, సీనియర్ అసిస్టెంట్, TTD మ్యూజియం, తిరుపతి, ప్రొఫెసర్ డా. రంగనాయకులు, మాజీ డైరెక్టర్ – చరిత్రకారుడు, TTD మ్యూజియం, ఆంధ్రప్రదేశ్, మాన్యుస్క్రిప్ట్లజీపై లోతైన అవగాహన కల్పించారు. డాక్టర్ వి.కె. న్యూ ఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ నుండి డా.లావనియా,RO (Ayu.), డాక్టర్ రాకేష్ నారాయణన్,RO (Ayu.) మరియు డాక్టర్ ముఖేష్ చించోలికర్, RO (Ayu.) మరియు NIIMH అధికారులు డాక్టర్ V. శ్రీదేవి, RO ( ఆయు.), డాక్టర్ అష్ఫాక్ అహ్మద్, RO (యునాని), డాక్టర్ ఖీ .సాకేత్ రామ్, RO (Ayu.), ఈట సంతోష్ మానె, RO (Ayu.) ఈట. బిస్వో రంజన్ దాస్, RO (Hom.) Dr. Chris Antony, RO (Ayu.) వైద్య మాన్యుస్క్రిప్ట్‌లపై పరిశోధనలు చేపట్టడం కోసం పాల్గొనే వారితో వారి అనుభవాలను పంచుకున్నారు. అనంతరం కార్యక్రమానికి ధన్యవాదాలు తెలిపారు. -
COVID-19: ప్రతి 10 మందిలో ఒకరికి లాంగ్ కోవిడ్
వాషింగ్టన్: ఒమిక్రాన్ వేరియెంట్ తర్వాత కరోనా బాధితుల్లోని ప్రతీ 10 మందిలో ఒకరికి లాంగ్ కోవిడ్ బయటపడుతోందని అమెరికా అధ్యయనంలో వెల్లడైంది. కోవిడ్ సోకిన ప్రతీ పది మందిలో ఒకరు ఇప్పటికీ అనునిత్యం ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టుగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం నివేదిక తెలిపింది. చిన్న పనికే అలిసిపోవడం, మెదడుపై ప్రభావం, తల తిరగడం, గ్యాస్ట్రిక్ సమస్యలు, గుండె దడ, సెక్స్‌పై అనాసక్తత, తరచూ దాహం వేయడం, రుచి, వాసన కోల్పోవడం, విపరీతమైన దగ్గు, ఛాతీలో నొప్పి వంటివన్నీ లాంగ్ కోవిడ్ ఉన్నవారిలో కనిపిస్తున్నాయని ఆ నివేదిక వివరించింది. -
హైదరాబాద్ ఎన్ఐఏబీ ఇక సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీ
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్ఐఏబీ)ని సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీగా అప్‌గ్రేడ్ చేసి కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ఈ శాఖ పరిధిలోని బయోటెక్నాలజీ విభాగం ఈమేరకు హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏబీతో పాటు, పుణేలోని నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్సెస్ సంస్థను కూడా అప్‌గ్రేడ్ చేసి సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీగా నోటిఫై చేసినట్లు శనివారం వెల్లడించింది. కోవిడ్–19 వ్యాక్సిన్లను త్వరితగతిన పరీక్షించి ధ్రువీకరణ ఇచ్చి కోవిడ్ మహమ్మారి నివారణ, చికిత్సను వేగవంతం చేసేందుకు ఈ చర్య దోహదపడుతుందని తెలిపింది. ప్రతి నెలా 60 బ్యాచ్‌ల వ్యాక్సిన్లను పరీక్షించే సామర్థ్యం ఈ ల్యాబ్‌లకు ఉన్నట్టు తెలిపింది. -
భారత అథ్లెటిక్స్ కోచ్ అనూహ్య మృతి
పాటియాలా: భారత్ అథ్లెటిక్స్ (మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్) కోచ్ నికొలాయ్ స్నెసరెవ్ శుక్రవారం అనూహ్య పరిస్థితుల్లో మరణించారు. బెలారస్‌కు చెందిన 72 ఏళ్ల స్నెసరెవ్... నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్)లోని తన హాస్టల్ గదిలో శవమై తేలారు. మృతికి కారణాలు ఇంకా తెలియలేదు. పాటియాలాలో శుక్రవారం ఇండియన్ గ్రాండ్‌ప్రి టోర్నీ జరిగింది. సన్నాహాల్లో భాగంగా ఉదయమే అథ్లెట్లతో కలిసి సాధన లో పాల్గొన్న స్నెసరెవ్ మధ్యాహ్నం ప్రధాన ఈవెంట్ జరిగే సమయంలో కనిపించలేదు. దాంతో అధికారులు ఆయన గదికి వెళ్లగా లోపలి నుంచి తాళం వేసి ఉంది. తలుపులు బద్దలు కొట్టి చూస్తే తన మంచంపై కోచ్ పడిఉన్నారు. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ విభాగంలో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అవినాశ్ సాబ్లేతో పాటు ఇతర మిడిల్, లాంగ్ డిస్టెన్స్ రన్నర్లకు ఆయన శిక్షణ ఇస్తున్నారు. 2005లో తొలిసారి భారత కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన స్నెసరెవ్ హయాంలోనే ప్రీజా శ్రీధరన్, కవితా రౌత్, సుధా సింగ్, లలిత తదితరులు అంతర్జాతీయ స్థాయిలో మంచి ఫలితాలు సాధించారు. అయితే భారత అథ్లెటిక్స్ సమాఖ్యతో విభేదాలతో 2019 ఫిబ్రవరిలో తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. అయితే రెండేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ కోచ్‌గా నియమించడంతో మంగళవారమే ఆయన భారతదేశానికి వచ్చారు. -
అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటీ–మద్రాస్
న్యూఢిల్లీ: భారత్‌లోని అత్యున్నత విద్యాసంస్థల్లో ఐఐటీ–మద్రాస్ అగ్రస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఎన్ఐటీ, ఇతర సాంకేతిక విద్యాసంస్థల పనితీరు ఆధారంగా రూపొందించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఐఆర్ఎఫ్)ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం ఢిల్లీలో విడుదల చేశారు. ఈ జాబితాలో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) రెండో స్థానంలో నిలవగా, ఐఐటీ–ఢిల్లీ మూడో స్థానం దక్కించుకుంది. ఈ ర్యాంకింగ్ ప్రక్రియలో 3,127 విద్యా సంస్థలు పాల్గొన్నాయి. విశ్వవిద్యాలయాల విభాగంలో ఐఐఎస్సీ–బెంగళూరు తొలిస్థానంలో నిలవగా, జేఎన్‌యూ, బీహెచ్‌యూ ఆతర్వాతి స్థానాల్లో నిలిచాయి. అలాగే కళాశాల విభాగంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని మిరండా కాలేజీ అగ్రస్థానం దక్కిచుకుంది. మరోవైపు అత్యుత్తమ ఇంజనీరింగ్ కళాశాలల జాబితాలోనూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) విద్యాసంస్థలు సత్తా చాటాయి. టాప్–10లో ఏకంగా 8 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇంజనీరింగ్ కళాశాలల జాబితాలో ఐఐటీ–మద్రాస్, ఐఐటీ–ఢిల్లీ, ఐఐటీ–ముంబై తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. మేనేజ్మెంట్ విద్యాసంస్థల జాబితాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) తొలి 10 స్థానాల్లో ఆరింటిని దక్కించుకున్నాయి. వీటిలో ఐఐఎం–బెంగళూరు అగ్రస్థానంలో నిలవగా, ఐఐఎం–ఢిల్లీ, ఐఐఎం–ముంబై, ఐఐఎం–రూర్కీ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఉన్నతవిద్య విషయంలో అమ్మాయిల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుండటంపై రాష్ట్రపతి కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. -
బులెటిన్ బోర్డ్
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ఫ్యాకల్టీ పోస్టులు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద.. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ప్రొఫెసర్: (శాలక్య తంత్ర, పంచకర్మ, మౌలిక్ సిద్ధాంత, రోగ నిదాన్ అండ్ వికృతి విగ్యాన్, ప్రసూతి తంత్ర అండ్ స్త్రీ రోగ, శరీర రచన, శరీర క్రియ, అగద్ తంత్ర). ఖాళీలు: 8 అసోసియేట్ ప్రొఫెసర్: (కౌమార్ భృత్య, ప్రసూతి తంత్ర అండ్ స్త్రీ రోగ, స్వస్థ వృత్త, శరీర క్రియ, కాయ చికిత్స, ద్రవ్య గుణ, అగద్ తంత్ర, పంచకర్మ) ఖాళీలు: 8 లెక్చరర్: (ప్రసూతి తంత్ర అండ్ స్త్రీ రోగ, ద్రవ్య గుణ, కాయ చికిత్స, పంచకర్మ, రస శాస్త్ర అండ్ బైసాజ్య కల్పన, అగద్ తంత్ర, రోగ నిదాన్ అండ్ వికృతి విగ్యాన్, శల్య తంత్ర, శాలక్య తంత్ర) ఖాళీలు: 9 దరఖాస్తు విధానం: నిర్దేశిత విధానంలో పూర్తిచేసిన దరఖాస్తుతోపాటు సర్టిఫికెట్లను డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, జోరావర్ సింగ్ గేట్, అమీర్ రోడ్, జైపూర్ – 302002కు పంపాలి. దరఖాస్తులకు చివరి తేది: మార్చి 1, 2017 వెబ్సైట్: http://nia.nic.in