National investigation agencey
-
రామేశ్వరం కెఫే ఘటనలో పాక్ ముష్కరుడి హస్తం
బనశంకరి: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బెంగళూరులోని రామేశ్వరం కెఫే బాంబు పేలుడు ఘటన వెనుక పాక్ ఉగ్రవాది హస్తం ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు బెంగళూరులోని ఎన్ఐఏ కోర్టులో శుక్రవారం దాఖలు చేసిన చార్జిషీట్లో పేర్కొన్నారు. పాక్‌కు చెందిన అనుమానిత ఉగ్రవాది పైజల్ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నారని తెలిపింది. కాగా ఈ కేసులో ముస్సావీర్ హుస్సేన్ షాజిబ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా, మాజ్ మునీర్ అహ్మద్, ముజమ్మిల్ షరీఫ్‌లు నిందితులుగా ఎన్ఐఏ గుర్తించిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన 42 రోజుల తర్వాత నిందితులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. మంగళూరు కుక్కర్ పేలుడు తర్వాత ముస్సావిర్ షాజిబ్, తాహాలు అదృశ్యమయ్యారు. కొన్నేళ్ల అనంతరం మళ్లీ బెంగళూరు చేరుకున్నారు. ఈ సమయంలో ముజమ్మిల్ షరీఫ్‌తో పరిచయమైంది. ముజమ్మిల్ మెజస్టిక్ వద్ద హోటల్లో పనిచేసేవాడు. ఇతనే ముస్సావిర్ షాజిబ్, తాహాలను ఐసిస్ ఉగ్రవాదంలోకి చేర్చాడు. మొదటి దశలో కొన్ని దుశ్చర్యలు చేయడానికి ముజమ్మిల్ టాస్క్ ఇచ్చాడు. 2023 డిసెంబర్లో బెంగళూరులోని మల్లేశ్వరం బీజేపీ కార్యాలయంలో బాంబు పెట్టడానికి కుట్రపన్నారు. తర్వాత షాజీబ్ బెంగళూరు నుంచి చెన్నైకు మకాం మార్చాడు. ట్రిప్లికేన్‌లో అద్దె ఇంట్లో ఐఈడీ బాంబు తయారుచేసి 2024 జనవరి 22 ఉదయం బెంగళూరుకు చేరుకున్నాడు. మల్లేశ్వరంలోని బీజేపీ కార్యాలయంలో బాంబు పెట్టడానికి షాజీబ్ ప్లాన్ రూపొందించాడు. పోలీసు భద్రత ఎక్కువగా ఉండటంతో బీజేపీ కార్యాలయం వెనుక బాంబు పెట్టి 90 నిమిషాలకు టైమర్ సెట్ చేశారు. అయితే బాంబు పేలలేదు. అనంతరం షాజీబ్ చెన్నై పారిపోయాడు. అనంతరం బెంగళూరులో జనసమ్మర్థం అధికంగా ఉండే ప్రాంతంలో బాంబు పెట్టడానికి ప్లాన్ చేశారు. ఫిబ్రవరి నెలలో ఐఈడీ బాంబు తయారుచేసి అదేనెల 29 తేదీన షాజీబ్ చెన్నై నుంచి బెంగళూరు చేరుకున్నాడు. కృష్ణరాజపురం టిన్ ఫ్యాక్టరీ వద్ద దిగి అక్కడ నుంచి కుందలహళ్లికి వెళ్లి మార్చి 1న రామేశ్వరం కెఫేలో బాంబు పెట్టినట్లు ఎన్ఐఏ చార్జిషీట్లో పేర్కొంది. -
ఈ ఉగ్రవాదుల సమాచారమివ్వండి
ప్రజలకు ఎన్ఐఏ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదుల సమాచారం తెలిస్తే తమకు అందించాలని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. దిల్సుఖ్నగర్ పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు యాసిన్ భత్కల్, తబ్రేజ్‌లను ఎన్ఐఏ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో మరో ఇద్దరు ఉగ్రవాదులు తహసీన్ అక్తర్ అలియాస్ మోను, అలియాస్ హసన్, వకాస్ అలియాస్ జవేద్ అలియాస్ అహ్మద్‌లు దేశంలోనే ఉండివుంటారని అనుమానిస్తోంది. వీరిద్దరూ మళ్లీ పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉండొచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దర్యాప్తు అధికారులు సూచించారు. 2010లో జరిగిన వారణాసి, 2011లో ముంబై పేలుళ్లకు కూడా వీరు బాధ్యులని ఎన్ఐఏ ప్రకటించింది. ఒక్కొక్కరికీ రూ.10 లక్షల రివార్డును ఇప్పటికే ప్రకటించింది. వీరిద్దరి ఆచూకీ తెలిసినవారు ‘ఎస్పీ10.ఎన్ఐఏఎట్జీవోవీ.ఇన్’కు మెయిల్ పంపాలని, 011-23438200, 91-8540848216 నంబర్‌కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వవచ్చని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఎస్పీ, సీబీఐ-1, ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్, 6వ అంతస్తు, ఎన్డీసీసీ బిల్డింగ్ -11, జై సింగ్ రోడ్, న్యూ ఢిల్లీ-110001 అడ్రస్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదుచేయవచ్చని వెల్లడించారు. కూనంనేనిపై కేసు ఎత్తివేయాలి: నారాయణ సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సహా తమ పార్టీ కార్యకర్తలపై పెట్టిన నాన్‌బెయిలబుల్ కేసుల్ని ఎత్తివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన మంగళవారం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు.